AADIVAVRAM - Others

ఆశావాదిని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చైత్రానికి కుసుమాంజలితో
వయ్యారాల వసంతాన్ని ఆహ్వానిస్తూ
ఆమని కోయిలలు గానం చేసే గొంతుకతో
కవి కోయిలలు పరవశించి పలికిన పదాలతో
ఆశాభావాల్తో ఆహ్వానించాలని పించింది ఉగాదిని.

మరాఠీల గుడెపగ్వా, మళయాళీల విషు,
తమిళుల పూత్తాండు, కన్నడ కూగీ హేలు,
సిక్కుల వైశాఖి, బెంగాలీల పోయ్‌లా బైశాఖి -
ఎక్కడైనా ఉగాదే అదే ‘యుగాది’,
నూతన జీవనానికి ‘నాంది’.

ఘనకీర్తి గడించిన ఘటనలెన్ని వున్నా
వికారిత ఘటనల ‘వికారి’కి వీడ్కోలు,
కారు చీకట్లో కాంతి పుంజాల్లాంటి
ఆశాకిరిణావృత అంధకార ‘శార్వరి’కి ఆహ్వానం.
ఎన్ని ఋతువులున్నా వసంతం వేడుకే వేరు,
మనసులను రంజింపచేసే మధుమాసం.
వేయి వృక్షాల ప్రాణవాయువు సహిత
వేపవృక్ష కుసుమ భక్షణం,
వగరు, తీపి, పులుపు రుచుల జీవన వైవిధ్యం.

గత, వర్తమాన ఘటనల జ్ఞాపకాలను నెమరేస్కుంటే -
తొందరపడి ఒక మామిడి ముందే పండింది కార్బైడ్ వల్ల
నింబ వృక్ష కుసుమ ఉగాది పచ్చడి నీటెఖిన ‘మేడీజీ’ ప్యాకెట్లు!
కూల్‌డ్రింకులు చాలు, కొబ్బరి బోండం నీళ్ళు మేలు అంటే
అధిక దిగుబడికి మోనో ప్రోటో పాస్!!
లిక్విడ్ గంజాయితో చాక్లెట్లు, తినుబండారాలట!

సంప్రదాయం పేరిట పరస్పర ముష్ఠి ఘాత క్రీడ
కత్తికట్టే కోడిపందాలు, కర్రలాటల, బర్రెలాటల,
హింసాత్మక వినోదాల నియంత్రణను కాంక్షిస్తూ,
యాసిడ్‌దాడులు, సెనైడ్ హత్యలు, రైస్ పుల్లింగ్ ముఠాలు,
లింగ నిర్ధారణను లీకు చేసే ఆసుపత్రులు,
మూత్రపిండాల వ్యాపార దంధాల దవాఖానాల,
పసికందుల విక్రయాలను నిలువరించాలని -
చట్టాలెన్ని చేసినా నియంత్రణ లేని నేరాలు
‘నిర్భయ’, ‘దిశా’, ‘్ఫక్సో’ తరహా దోషుల
దుష్ట దురాగతాలను దునుమాడాలి,
చట్టాలు బాధితులకు బాసట కావాలి,
అత్యాచార, హత్యాచార నేరాలాగేనా?
‘మార్పు’ మనలో కలిగేనా?

పుట్టుక మనదేశం కాని పుట్టెడు వ్యాప్తికారక,
కార్చిచ్చులా వ్యాపిస్తున్న కరుణలేని ‘కరోనా’ లాంటి
వ్యాధులు నిలువరింపబడాలని కాంక్షిస్తూ -

బహుళ అంతస్ధుల భవనాలవుతున్న
హరిత క్షేత్రాల రక్షణ కాంక్షిస్తూ,
వ్యక్తిగత విద్వేషాల కన్న
వ్యవస్ధ మేలుకోసం పాలకులు పనిచేయాలని,
అంతరిక్ష పరిశోధనా రంగంలో
అఖండ విజయాలు నమోదు కావాలని,
‘శార్వరి’ వెనుక ‘శర్వరీశు’ని రజత రేఖాశల
ఆశాజనక పంచాంగ శ్రవణాన్నాశించే ఆశావాదిని.

- వేదం సూర్యప్రకాశం 9866142006