S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సూత్రప్రాయమైన పరికల్పన

రాజ్యాంగం అందరికీ ముఖ్యమైనది కాబట్టి, ఈ పుస్తకంలోని సమాచారం ప్రజలకు అమూల్యమైనదని మేము నమ్ముతున్నాము.
రచయితలు, వారిలో చాలామంది సుప్రీం కోర్టు మరియు హైకోర్టులలో న్యాయవాదులు. వారిలో ఒకరు శాసనసభ్యుడు. మేము రచయితల పరిచయంతో ప్రారంభిస్తాము. తరువాత ప్రభుత్వ అధికారులు మరియు అకాడమీలోని వ్యక్తుల పుస్తక సమీక్షలు ప్రచురిస్తాము.
-ఎడిటర్
*
ప్రస్తుత ముసాయిదా మాన్యుస్క్రిప్ట్ అవినీతి, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ, మహిళలు మరియు ఎస్సీ/స్టీ రిజర్వేషన్లు, లోక్పాల్, మనీలాండరింగ్, బినామీ లావాదేవీలు, హద్దు లేని అధికారాలు మరియు ఎన్నుకోబడిన లేక నియమించబడిన అధికారుల యుక్తాయుక్త విచక్షణ లేని అధికారాలు, జవాబుదారీ తనం లేకపోవడం, ఎప్పటికప్పుడు మహిళలు మరియు పిల్లలపై పెరుగుతున్న నేరాలు, న్యాయ విచారణలో ఆలస్యం, నకిలీ-లౌకికవాదం మరియు అనేక ఇతర విషయాలు ఉన్నాయి.
భారతదేశంలో విస్తృతమైన అవినీతి మన రాజకీయ - న్యాయ వ్యవస్థను వక్రీకరించింది. ఆర్థికాభివృద్ధిని అణగదొక్కింది మరియు మన సామాజిక విలువలను, వ్యవస్థను కూడా నాశనం చేసింది. ఈ పరిస్థితి ఈ క్రింది పరిణామాలకు దారితీసింది. రాజకీయాలు మరియు ఉద్యోగ వ్యవస్థలోని అరాచకాలు, సామాజిక వ్యత్యాసాలను చట్టపరంగా కులవ్యవస్థగా ధృవీకరించటం, మత, ప్రాంతీయ ప్రభావాలకు లోబడిన వ్యక్తిత్వం, ప్రజానీకంలో అత్యంత పేదరికం, న్యాయ వ్యవస్థ పతనం మరియు అదుపు చేయతరం కాని నేరాలు మరియు హింస.
రాజ్యాంగ చట్టం, శాసనాలు, కోర్టు తీర్పులు, ప్రముఖ న్యాయమూర్తులు, న్యాయవాదులు మరియు విద్యావేత్తల అభిప్రాయాలను సమగ్రంగా విశే్లషించిన తరువాత డాక్టర్ ఆనంద్ గరికపాటి బాగా పరిశోధించిన వ్యాసాలు రాశారు. వారి సూత్రప్రాయమైన పరికల్పన ఏమిటంటే, భారీ అవినీతికి ప్రధాన కారణాలు మన రాజ్యాంగ మూలాంశంలోని నిర్మాణ మరియు సంస్థాగత లోపాలేనని, అధిక నైతిక విలువల మార్గాన్ని అనుసరించే భారత రాజ్యాంగ కర్తలు అగాథమైన నైతిక క్షీణతను, మరియు వ్యవస్థను వక్రీకరించి, అణచివేసి వాటి విధ్వంసానికి దారితీసే విధానాలను, మోసపూరిత మ్యాక్వెల్లియన్ పద్ధతులతో భారతదేశం యొక్క ప్రణాళికాబద్ధమైన పునర్నిర్మాణానికి బదులుగా వారి స్వప్రయోజనాలను పెంచడానికి పాల్పడతారని ఊహించలేదు.
లోక్‌పాల్ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, ఆర్టికల్స్ 129 మరియు 144లను ఉల్లంఘిస్తోందని, ఈ బిల్లు జవాబుదారీతనం, పరిమితులు లేకుండా ఎగ్జిక్యూటివ్‌కు అధికారం ఇవ్వడం ద్వారా న్యాయవ్యవస్థ నియమావళి యొక్క స్వాతంత్య్రాన్ని బలహీనపరుస్తుందని అతని సారాంశం.
అవినీతి విశే్లషణపై రాసిన వ్యాసంలో, రచయిత కిడ్గార్డ్ యొక్క ఫ్రేమ్ లేక ఆలోచనా విధానంలో (్ళ=+) అవినీతి యొక్క ఆకారాన్ని చిత్రిస్తాడు. రాజకీయ తరగతి ఎటువంటి జవాబుదారీతనం లేకుండా ఉండే విధానాలను అనుసరిస్తూ సంపూర్ణ అధికారం పొందుతుంది. కొన్ని పరిస్థితులలో అవినీతిపై నియంత్రిత విచారణ కూడా తమాషాగా మారిపోతుంది. ఉనికి కూడా కాపాడుకోలేకపోతుంది. రాజ్యాంగాలలో కొన్ని స్పష్టమైన నిర్మాణ లోపాలను గుర్తించిన రచయిత కొన్ని సవరణలను ప్రతిపాదించారు. ఇందులో ప్రధాని మరియు రాష్టప్రతికి రెండు కాల పరిమితులు ఉండాలని, రాష్టప్రతి ఎన్నికలలో శాసనసభ్యులు తప్పనిసరిగా ఓటు వేయాలని, ఓటింగ్ రోల్ కాల్ ద్వారా నిర్వహించబడాలని అంటే రహస్య బ్యాలెట్ ద్వారా కాదని, మరియు అధికారులపై ప్రాసిక్యూషన్ బ్లాక్ చేయడానికి న్యాయస్థాన ఆమోదం తప్పనిసరని, సీనియర్ బ్యూరోక్రాట్లు మరియు న్యాయమూర్తులపై న్యాయస్థాన పర్యవేక్షణలో విచారణ, జాతీయ సలహా మండలిని రద్దు చేయడం, స్వేచ్ఛ, నమ్మకం, విశ్వాసం మరియు ఆరాధన లౌకికవాదానికి అనుగుణంగా ఉండాలని అనేవి రచయిత యొక్క ప్రతిపాదనలు. అదనంగా, రచయిత అవినీతి నివారణ చట్టాల అసమర్థతను విశే్లషించారు మరియు చట్టాలలో కొన్ని క్లిష్టమైన మార్పులను సూచించారు. న్యాయమూర్తులను అడ్డుకోవడం మరియు మంత్రులను విచారించడానికి అనుమతి నిరాకరించడం వంటివి అవినీతికి ఊతమందించే పద్ధతులుగా భావించాలి. అవినీతి నిరోధక చట్టం 1988 అవినీతి ఆరోపణలకు పాల్పడిన న్యాయమూర్తుల పింఛను కనీస జరిమానాగా విధించాలనేదే ప్రతిపాదన. రాజ్యాంగంలోని ఆర్టికల్ 124ను సి.జె.ఐ. మరియు ఎస్సీ న్యాయమూర్తులు పదవీ విరమణ తరువాత వరుసగా 8 సంవత్సరాలు మరియు 5 సంవత్సరాలు ఏదైనా చెల్లింపు లేదా గౌరవ పదవిని స్వీకరించకుండా నిరోధించే విధంగా సవరించాలి.
సుప్రీంకోర్టు తీర్పులను తటస్థీకరించడానికి చేయు ఆదేశాలు మరియు రాజ్యాంగ సవరణలు లేదా చట్టాల శ్రేణిని, వాటి యొక్క సుదీర్ఘ చరిత్రను గమనించి, తీర్పులను ఉల్లంఘించిన అధికారులను తీసివేయటానికి ఆర్టికల్ 129 యొక్క సవరణను రచయిత సిఫారసు చేశారు. రాష్టప్రతి, క్షమాపణలు, ఉపసంహరణలు ఇవ్వడానికి తన అధికారాన్ని వినియోగిస్తూ ఒక సంవత్సరంలోపు దోషి నుండి మరణశిక్ష అర్జీపై తన చర్యను పూర్తి చేయడం తప్పనిసరి చేయాలి. ఆర్టికల్స్ 129 కింద ఆర్డినెన్స్‌లను ప్రకటించడానికి రాష్టప్రతి యొక్క అధికారం యొక్క దుర్వినియోగాన్ని తనిఖీ చేయడానికి, ప్రతిపాదిత ఆర్డినెన్స్ యొక్క ఆవశ్యకతపై రాష్టప్రతి దేశానికి తప్పనిసరిగా కారణాలను తెలియజేయాలి.
ప్రస్తుతానికి, మాన్యుస్క్రిప్ట్‌లో వాచకం యొక్క విధానం, వరుస మరియు సంబంధితాలు విచ్ఛిన్నమైనవి కనిపిస్తున్నాయి. అంతేకాకుండా, కొన్ని సవరణలు లేదా సలహాలకు సంపూర్ణ జాతీయ స్థాయిలో చర్చాగోష్టి అవసరం. పీస్ సూచనలు సమస్యను పరిష్కరించలేకపోవచ్చు. వాస్తవానికి, అవి చాలా అనవసరమైన చట్టపరమైన అనిశ్చితలకు దారితీస్తాయి. ప్రభావంతంగా ఉండటానికి, చట్టాలు సరళంగా మరియు ఖచ్చితమైనవిగా ఉండాలి. నిస్సందేహంగా, ప్రస్తుత రచన క్లిష్టమైన సమస్యలపై జాతీయ స్థాయిలో చర్చను సృష్టిస్తుంది మరియు రచయితల సూచనలు దేశ దిశను మార్చగలవంటి చర్చకు గొప్ప వేదికను, చర్చనీయాంశములను అందిస్తాయి.
రాజ్యాంగంపై న్యాయ విధ్వాంసుల అభిప్రాయాలు
1.ఎస్.రామచంద్రరావు: సుప్రీంకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రముఖ సీనియర్ న్యాయవాది, ఆంధ్రప్రదేశ్ మాజీ అడ్వొకేట్ జనరల్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడ్వొకేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తన పుస్తకంలో ‘్భరత రాజ్యాంగం’. ఇది విఫలమైందా లేదా మనము విఫలమయ్యామా?
ప్రస్తుత భారీ అవినీతి పరిస్థితిని ఊహించడంలో రాజ్యాంగం విఫలమైంది. చెప్పాలంటే, ఇది చాలా దూరం వరకు వ్యాపించిన ఒక కార్చిచ్చు వంటిది. మరియు ఈ ఘోరమైన అవినీతి ద్వారా ఉత్పన్నమయ్యే ఆకస్మిక పరిస్థితులను పరిష్కరించడానికి రాజ్యాంగం ఎటువంటి యంత్రాంగాన్ని లేదా మార్గాన్ని నిర్దేశించలేదు. అవి ఇప్పుడు అన్ని స్థాయిలలో రాజకీయ పరంగా లేదా అధికారిక పరంగా విశ్వవ్యాప్తం అయ్యాయి.
అంటువ్యాధిలాగా సర్వత్రా వ్యాపించిన ఈ అవినీతికి అడ్డుకట్ట వెయ్యలేకపోతే, మొత్తం రాజ్యాంగ యంత్రాలు, భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ, భారత శ్రేయస్సు మరియు భవిష్యత్తు కేవలం మిధ్య మాత్రమే అవుతుంది.
రాజ్యాంగం ఇంత విస్తృతమైన రాజకీయ అవినీతిని ఊహించలేదు సరికదా రాజకీయ, అధికారిక విలువలలో సంపూర్తిగా పతనం అవటానికి తోడ్పడే మార్గాలను లేక విధానాలను అవగాహన చేసుకోవడంలో కూడా పూర్తిగా విఫలమైంది. హాస్యాస్పద విషయం ఏమిటంటే అవినీతిని సరిదిద్దడానికి కానీ అరికట్టడానికి గానీ మన రాజ్యాంగంలో ఎటువంటి నిబంధన లేదా ముందు జాగ్రత్తతో చేసిన ఏర్పాటు లేకపోవడం.
2.జి.ఎల్. బాత్రా, మాజీ అదనపు కార్యదర్శి, భారత పార్లమెంట్ మరియు రాష్ట్ర హర్యానా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్.
ప్రస్తుత పరిస్థితులు చూసిన తరువాత మన రాజ్యాంగ వ్యవస్థకు రూపకల్పన ఇచ్చిన వారి మనోభీష్టమైన ఆశలు విఫలమయ్యాయనే చెప్పాలి. ఈ స్థితిగతుల్ని నిలబెట్టకలిగే వెనె్నముక వలె మన దేశం యొక్క ఉనికిని కాపాడే నీతి, న్యాయము, ధర్మము మన కళ్ల ముందే క్షీణించి మన బాధకు, తీవ్ర మనోవేదనకు కారణాలై మనని గందరగోళం, అన్యాయం, అపాయాలకు గురిచేస్తుందని నా దృఢ విశ్వాసం.
3.హరిన్ పి రావల్, అదనపు సొలిసిటర్ జనరల్, బొగ్గు కుంభకోణం ఎపిసోడ్ సందర్భంగా అటార్నీ జనరల్‌కు రాసిన లేఖలోని సారాంశం.
మీ వాంగ్మూలము వల్ల నాకు సిగ్గుపడవలసిన పరిస్థితి ఏర్పడింది. స్టేటస్ రిపోర్ట్‌లోని విషయాలు మీకు తెలియవని, అవి ప్రభుత్వానికి తెలియజేయబడలేదని భారతదేశ అటార్నీ జనరల్‌గా మీరు సమర్పించిన పత్రానికి అనుగుణంగా న్యాయస్థానంలో నేను మీ పక్షం వహించవలసి వచ్చింది.
4.జస్టిస్ వి.ఆర్. కృష్ణఅయ్యర్, రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి భారత ప్రధాన న్యాయమూర్తికి ‘‘ది బిగినింగ్ ఆఫ్ ది ఎండ్’’ అనే విజ్ఞప్తిలో రాశారు.
అవినీతికి స్వేచ్ఛ - దేశానికి సంకెళ్లు ఇవి. స్వేచ్ఛను కాపాడుకోవాలని కోరుతున్న భారతీయునిగా భారతదేశానికి విముక్తిని కలగచేసి, ప్రభుత్వ దయాదాక్షిణ్యాలతో కలుగు స్వేచ్ఛగాక యదార్థమైన స్వేచ్ఛను ప్రసాదించవలసిందిగా నా స్వాధికారంతో అడుగుతున్నాను.
5.అపెక్స్ కోర్ట్ జస్టిస్ చలమేశ్వర్: ‘‘ఎవరికీ చట్టం పట్ల భయం లేదు.’’
6.జస్టిస్ అత్తార్: అవినీతి సమాజానికి అతిపెద్ద ముప్పు.
7.అపెక్స్ కోర్ట్: ‘‘... విచారించవలసినదేమిటంటే శిక్షకు గురి అవ్వవలసిన అవసరం వస్తుందేమోనన్న భయం లేకుండా దేశంలో కోర్టు ఆదేశాలు ఉల్లంఘించబడుతున్నాయి.
చట్టమంటే ఎవరికీ భయం లేదని ఎస్సీ న్యాయమూర్తి చెప్పారు. జస్టిస్ చలమేశ్వర్ ఉపయోగించిన పదాలు చాలా లోతైనవి. ఎందుకంటే అవి ఒక ముఖ్యమైన ప్రశ్నకు తావిస్తున్నాయి. ‘‘ఒక సాధారణ వ్యక్తి తాను తప్పించుకోగలడని భావిస్తే, ప్రభుత్వంలో ఉన్నత స్థాయి వ్యక్తులు తమకు ఇంకా చాలా సులభం అని నిస్సందేహముగా భావించరా?
వీరు ఎన్నుకోబడటానికి సహాయం చేసిన వారి బంధువులు, స్నేహితులు మరియు పార్టీ నాయకులను చేర్చుకుంటే దాని పరిణామంగా అధికారాన్ని సులభంగా పొందగలిగి కాంట్రాక్ట్ బిడ్లలో నిర్ణయాలు గానీ లేదా ఫలితాలను గానీ ప్రభావితం చేయగలిగిన వారి సంఖ్య భారీ సంఖ్య కాదా? మీరు మంత్రుల సంఖ్యతో గుణిస్తే, ఆ సంఖ్య వేలల్లో ఉంటుంది. ఇక మిగిలి ఉన్న బడ్జెట్ శాతం విశ్వసనీయులు. నైతిక వ్యక్తులైన కాంట్రాక్టర్లకు ఎంత?
సుప్రీంకోర్టు అభిప్రాయం: మనము ఏ దశకు వచ్చామంటే ప్రతీది కోర్టులచే పర్యవేక్షించబడాలి. ఆదేశాలు పాటించనప్పుడు ఆవేదనను వ్యక్తం చేయాలి లేదా దర్శకత్వం వహించాలి. సుప్రీంకోర్టు అదేశాలు కూడా పాటించబడనప్పుడు హైకోర్టులనుద్దేశించి ఏమి మాట్లాడాలి. హైకోర్టు ఆదేశాలలో తొంబై తొమ్మిది శాతం పాటించబడడం లేదు.’’
అపెక్స్ కోర్టు, జస్టిస్ చలమేశ్వర్ మరియు సీనియర్ అడ్వొకేట్ ఎస్.రామచంద్రరావు చేసిన ఈ విమర్శలు మీరు జాగ్రత్తగా అధ్యయనం చేస్తే రాజ్యాంగంలో క్లిష్టమైన లోపాలను సూచిస్తున్నాయి. అవే ఈ పుస్తకం రాయడానికి ప్రేరేపింపచేసిన ప్రధాన అంశాలు.

- ఆనంద్ గరికపాటి