S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నిరీక్షణ

తీరానికి ఆవల ప్రాంతంలోంచి
తెలియని దేశంలోంచి
అప్పుడప్పుడూ..
అలలపై తేలియాడుతూ
కలల కాగితమొకటి కొట్టుకొస్తుంది.
పూల రెమ్మలా విచ్చుకుంటూ
మడత మడతలోనూ
మధుర సౌరభాలను వెదజల్లుతూ
మాటల కందని మానవీయ పార్శ్వాల్ని
మహత్తరంగా ఆవిష్కరిస్తుంది
తీరానికి ఆవలి ప్రాంతం..
కంటి ముందు కల్లోల సంద్రం..
అప్పుడప్పుడూ..
కడలి కెరటాల మీదుగా తేలి
వెనె్నల వాక్యమొకటి చుట్టుముట్టి
నిరాశల నిశి రాత్రులపై
వెలుగుల వర్షం కురిపిస్తుంది.
మరుపు చేయి పట్టుకొని
మరలిపోతున్నప్పుడల్లా
తలపు విడిచి తరలిపోతున్నప్పుడల్లా
తీరానికి ఆవలి ప్రాంతం నుండి
తీయని స్వరమొకటి వినవస్తుంది
భాష కందని భావ జాలమేదో
రహస్య సంకేతంగా చెవిని తాకుతుంది.
మైళ్ల యోజనాల కావల
మనసు మధనమేదో జరుగుతున్నట్టు
అప్పుడప్పుడూ
ఆవలి గట్టు నుండి అయాచిత వరమై
మధుతుంపర మనసు తినె్న పైకి తుళ్లుతుంది
ఆవలి తీరం
అద్భుతంగానే తోస్తున్నా
అక్షరాల దీవిని దర్శించాలని ఆశగా వున్నా
ఈతరానితనంతో, ఎగురలేనితనంతో
ఏళ్ల తరబడి ఇక్కడే సంచరిస్తూ
ఒక్కో కవిత కోసం నిరీక్షిస్తూ
నేనిక్కడ ఒంటరిగా వేచి ఉంటాను.

-చొక్కాపు లక్ష్మునాయుడు 9573250528