S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

10/05/2019 - 22:26

‘‘శమీ శమయతే పాపం, శమీ శతృ వినాశినీ, అర్జునస్య ధనుర్ధారీ, రామస్య ప్రియదర్శినీ’’ ...్భరత, రామాయణాది పౌరాణిక గాధలలో శమీ వృక్షానికి విశేష ఫ్రాధాన్యత కల్పించ బడింది. శమీకే ‘‘అపరాజిత’’ అనిపేరు. అంటే ఓటమి నెరుగని మాతయని అర్థం. అమెయే ‘‘విజయ’’ నామాంకితయైన జగజ్జనని. అపరాజితా దేవి విజయానికి అధిదేవత.

,
10/05/2019 - 20:21

ఒక ‘కానె్సప్ట్’ను తీసుకుని దాని మూలాల్లోకి వెళ్లి, దర్శించి, తాదాత్మ్యం చెంది చిత్రరచన చేయాలని చిత్రకళను బోధించే ఆచార్యులు తమ విద్యార్థులకు చెబుతారు. వారి మాటను చిత్రకారిణి పూస ఆండాలు తు.చ తప్పకుండా పాటించారు. తనదైన ప్రత్యేక శైలిలో బొమ్మలు గీశారు.

10/05/2019 - 20:16

కుంభకోణం అనగానే వంచన, కపటం, మోసం, చేతివాటం, దగా అనే అర్థాలు తెలుగులో రూఢమైనాయి. కుట్ర అనే అర్థంలో కూడా విరళంగా వాడుక ఉంది. ఈ అర్థాలు ఈ పదానికి అంతా నూరేళ్ళనుంచే తెలుగులో వాడుకలోకి వచ్చాయి. ఆధునిక తెలుగు నిఘంటువే లేదు. కాబట్టి ఈ మాట రుూ అర్థాలలో తెలుగులోకి ఎక్కిందో లేదో తెలియదు.

10/05/2019 - 20:15

ఇంగ్లీషులో దగ్గర దగ్గరగా అర్థాలు ఉన్న మాటల జంటలలో ‘వెదర్’(weather),, క్లైమేట్ (Climate) అనేది ఒక జంట. వీటికి సమానార్థకమైన తెలుగు మాటలు గురించి ఆలోచించే ముందు ఈ రెండు మాటల అర్థాలలో పోలికలు, తేడాలు ఏమిటో చూద్దాం. బయట వేడిగా ఉందో, చలిగా ఉందో, వర్షపాతం ఉందో, వాయు వేగం ఎంతో, మేఘచ్ఛాదం ఎంతో వర్ణించి చెప్పడానికి ఈ రెండు మాటలూ వాడతారు.

10/05/2019 - 19:53

ఒక్క అడుగే కదాని నీరసించి
నిష్క్రమించకు
అడుగు వెనుక అడుగుతో
ఖగోళమంతా
కౌగిలించుకోవచ్చు.

ఒక్క నీటి చుక్కే కదా అని
చులకనగా చూడకు
ఆ వర్షపు బిందువులే అఖండ
సింధువవును ఆవిష్కరిస్తాయి

వెలగించాలనుకునే దీపం
ఒక్కటే అని వెనకడుగు
వేయకు
అది లక్షల చీకటి జీవితాల్లో వెలుగు
నింపే జీవనజ్యోతి

10/05/2019 - 19:52

తే॥ తెలుగు కవితల సొబగులు తెలిసి రాగ
తెలుగు కవుల ధీశక్తియు తెల్ల వౌగ
తెలుగు వెలుగుల జిలుగులు కలియబోసి
తెలుగు ప్రజలెల్లరు పుడమి భళియనంగ॥

10/05/2019 - 19:41

తూరుపు వెలుతురులో
మెరిసే.. లేత హరితం
నా ప్రేమ

తరువు ఒడిలో
రాలిపడే.. పూలసడి
నా ప్రేమ

నింగి కరిగి
నేలను మురిపించే
చినుకుల జడి
నా ప్రేమ
వేణువులో ప్రవహించి
గాలి వినిపించే..
తీయని స్వరం
నా ప్రేమ

విరిసే వెనె్నల
కురిసే మల్లెల రాశి
నా ప్రేమ

తీరాన్ని తడిపే
కడలి అలల పరుగు
నా ప్రేమ

10/05/2019 - 18:46

పొద్దునే్న ఆకాశాన్ని చూస్తానా
మనసులో ఏదో చెప్పలేని అనుభూతి
సాయంత్రం ఆకాశం చూస్తానా
గుండెల నిండా ఆనందం
రాత్రి ఆకాశాన్ని చూస్తానా
మనసంతా వెనె్నల జలపాతం
తీరిక దొరికినప్పుడల్లా
అలా ఆకాశం వైపు చూస్తూనే ఉంటాను
నాలో లేనిదేదో అక్కడుందని
కళ్లప్పగించి చూస్తుంటాను
చూపు చూపునకు అందని ఆకాశం
నాలో కొత్త ఆశలు రేపిన ఆకాశం

10/05/2019 - 18:45

ప్రియతమా!
తనువులు దూరమైతేనేమి?
వలపుల ‘తలపులు’ చేరువేగా..
పెదాలు పలక్కపోతేనేమి?
వౌనం మాట్లాడుతుందిగా..
దేహం పొడిబారితేనేమి?
మది ‘జీవనది’ ప్రవాహమేగా..
ఆంక్షలు అడ్డుగోడలైతేనేమి
మనో గవాక్షం వీక్షిస్తుందిగా..
కనురెప్పలు మూస్తేనేమి?
కలల ‘తలుపులు’ తెరిచే ఉంటాయిగా...
పరువు ఉప్పెన ముంచేస్తేనేమి?
అలౌకిక ‘బంధ సౌధం’ పటిష్టమేగా..

10/05/2019 - 18:36

కులం వ్యక్తిగతం
మతం మనోగతం
మానవత్వం అందరి అభిమతం
కులమతాలు కలిగించవు
అభిప్రాయ భేదాలూ, ఖేదాలూ
మతిభ్రమించిన రాజకీయ నాటకీయాలు
ఓట్ల కోసం, సీట్ల కోసం, నాటిన విష వృక్షాలు
కులమతాలెప్పుడూ మతాబులే
మానవులందరికీ జవాబులే
లాభనష్టములూ, ఇష్టానిష్టములూ
ధర్మాధర్మములూ, కర్మాకర్మములూ
ఎవరివి వారివే అయినా అవనిలో
అందరూ సమానులే

Pages