S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

12/16/2019 - 00:00

నగరాలు పెరుగుతున్నాయి, మెట్రో నగరాలు విస్తరిస్తున్నాయి. వాటి వైవిధ్యాన్ని, జీవన విధానాన్ని, శైలిని పత్రికలు - ఎలక్ట్రానిక్ మీడియా పట్టి చూపుతున్నాయి. మరి ‘పల్లె’ సంగతేమిటి?.. అన్న ప్రశ్న వేసుకున్నారు చిత్రకారిణి లాబిసెట్టి అనీశ. అలా పల్లెను ‘పత్రం’ పైకి తీసుకొచ్చి తన సృజనను, ప్రతిభను చాటారు.

12/15/2019 - 23:56

రాజ్యాంగం అందరికీ ముఖ్యమైనది కాబట్టి, ఈ పుస్తకంలోని సమాచారం ప్రజలకు అమూల్యమైనదని మేము నమ్ముతున్నాము.
రచయితలు, వారిలో చాలామంది సుప్రీం కోర్టు మరియు హైకోర్టులలో న్యాయవాదులు. వారిలో ఒకరు శాసనసభ్యుడు. మేము రచయితల పరిచయంతో ప్రారంభిస్తాము. తరువాత ప్రభుత్వ అధికారులు మరియు అకాడెమీలోని వ్యక్తుల పుస్తక సమీక్షలు ప్రచురిస్తాము.
-ఎడిటర్
*

12/15/2019 - 23:53

మసకబారిపోతున్న బతుకునో
మారు స్పష్టంగా చూడాలనుకున్నా...
మంచు శిల్పాలౌతున్న గతకాలపు జాడల్ని
ఓ మాటు తేరిపారా వీక్షించాలనుకున్నా..
అదిగో ఆ క్షణమే
నా కళ్ల వాకిట్లో ఓ అద్దాల భవంతి వెలిసింది!

12/15/2019 - 23:48

అరవై కిలోల పండ్ల బుట్టను
అరవై ఏళ్ల నెత్తి మీద మోస్తూ..
రోడ్డు మీద పడి తిరుగుతూ
‘కమలా కాయలు.. కమలా కాయలు’
అని అరుస్తూ..

అంత బరువు పైన పడినా
నలగని చిరునవ్వుల పూలు వెదజల్లుతూనే
బతుకు బరువు తొక్కి పెడుతున్నా
తొణకని స్వరంలో భాస్వరం ప్రజ్వరిల్లుతూనే..

12/15/2019 - 23:45

పరుగెత్తి వస్తోంది రాహువు.. అయ్యో తరిగిపోతున్నాది ఆయువు.. ఆపాత మధురాల్లో విషాద గీతాలు శీర్షికన వినిపిస్తోంది బాలు గొంతుకలో.. తెర మీద అభినయిస్తున్నాడు సూపర్ స్టార్ కృష్ణ. కమ్మిన మబ్బులు విడిపోయి ఇప్పుడిప్పుడే వెలుగు రేఖలు, క్రాంతి భావాలు మదిలో మెదలసాగాయి కుముదం అంతరంగాన.

,
12/15/2019 - 23:36

ఈ మొక్కలు చాలా దృఢంగా ఉంటాయి..
అంగారకుడిపై పెరుగుతాయి..
32,000 సంవత్సరాలు బతుకుతాయి..
అత్యంత తీవ్ర వాతావరణ పరిస్థితుల్లోనూ మనుగడ సాగిస్తాయి..

12/15/2019 - 23:08

ఎన్నో ఏకాంత వనాలను
నీ చిర్నవ్వు పూలతో నింపాను
ఎనె్నన్నో అక్షరాల తోటల్ని
నీ కోసమని పెంచాను
నేనొక జ్ఞాపకాల్ని పూసే కొమ్మలా
ఎన్నో వసంతాలుగా
నీ కోసం పూస్తూనే ఉన్నాను
ఒక్క పలకరింపు
శీతల పవన స్పర్శకై
మేఘాల చూరు పట్టుకు వేలాడే
వానచినుకులా వేచి ఉన్నాను
హృదయపు వాకిలిలో
నువ్వు వదిలెళ్లిన
రంగు రంగుల ముగ్గుల్ని చూస్తూ

12/15/2019 - 23:03

బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నట్లే ఇక్కడ
ఈ విశాల ప్రపంచంలో కూడా...
అలకలు, కన్నీళ్లు ఉంటాయి.
ఆవేశాలు, ఆరోపణలు ఉంటాయి
ఓటములు, ఓదార్పులు ఉంటాయి
అది మనం ఏరి కోరి వెళ్లిన ఇల్లు
ఇది మనకు తెలియకుండానే వచ్చి పడ్డ ప్రపంచం
ఆ ఇంట్లో గెలవాలంటే అందరితో నడవాలి,
అందరిలో ఒక్కరిగా నిలవాలి
క్షమించే మనసుండాలి, మరచిపోగల స్థైర్యముండాలి

12/14/2019 - 23:50

జీవితంలో చాలా చిన్న విషయాలు మన దృష్టికి రావు.
వాటిని మనం పట్టించుకోం.
కాలేజీలో చేరిన వెంటనే మనం గంభీరంగా వుండిపోతాం. మన ప్రక్కన కూర్చున్న వ్యక్తిని మనం పలకరించం. ఇదే పరిస్థితి చాలా ప్రదేశాల్లో కన్పిస్తుంది.
అపరిచితులని పలకరిస్తే వాళ్లు సరిగ్గా అర్థం చేసుకోకపోవచ్చు.
కానీ

12/14/2019 - 23:48

ఘంటసాల జయంతి సందర్భంగా వచ్చిన వ్యాసం (ఆదివారం 01.12.19) చాలా బాగుంది. అయితే కొన్ని చేర్పులు మార్పులు అవసరం.
‘అన్ని భాషలలో ఘంటసాల దాదాపు పదమూడు వేలకు పైగా పాటలు పాడి, 107 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు’ అన్నది ఘంటసాల మీద భక్తి, అభిమానం వలన వ్యాసకర్తలందరూ పొరబడే మాటే.

Pages