S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

స్మార్ట్ చేతబడి

ఉలకడు పలకడు
గలగలా మాట్లాడడు
మనసులో మాట ఎరిక చేయడు
నలుగురిలో వుంటాడు
కానీ
వొంటరితనంలో వాడు
తన లోకపు వ్యోమగామి వాడు.
దూరంలో ఉన్నవాళ్ల నెందరినో
చేతి వేళ్లతో పలకరిస్తాడు
వేల మైళ్ల దూరం వారికి
ఇష్టాయిష్టాలు ప్రకటిస్తాడు
ఆనందిస్తాడు ఆక్రోశిస్తాడు
ఆస్వాదిస్తాడు ఆవేదన పడతాడు - వాడు.
విష క్రీడలు ఆడతాడు.. వికృత చిత్రాలు చూస్తాడు
ఉద్యోగ సద్యోగాల వేటలాడతాడు
నిమిషాలు గంటలు గడిపేస్తూ
క్షణాలను ఖరీదు కడుతూ
అపరిచితుడిగా.. వాడు
పెళ్లిళ్లు పేరంటాలు
ఆఫీసులు ఆనంద సమయాలు
వాకింగ్‌లు వంటశాలలు
ఇక్కడ అక్కడ అని లేకుండా
రంగురంగుల తెరపై ధ్యాస
నిరంతరం అంతర్ముఖుడిని చేస్తూ
వెబ్‌సైట్లలో చిక్కుకున్న ఈగ
అంతర్థానుడైనాడు స్మార్ట్ చేతబడిలో - వాడు.

-లక్కరాజు శ్రీనివాసరావు 9849166951