S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

12/22/2019 - 23:16

కిటికీ తెరిచి ఆమె
ఎదురుచూస్తుంది
జాడ తెలియని నేస్తం
రాత్రి పగళ్లు వొక్కటే

అంతమెప్పుడు
ఈ నిరీక్షణకి

స్నేహం!
కనిపించకుండా వినిపించే
అజ్ఞాత కోయిలొకటి
జీవిత చెట్టుపై వాలి
సందడి చేస్తుంది
స్నేహం
దూరాలను చెరిపేస్తుంది!

12/22/2019 - 22:55

ఏ సువార్తను చదివినా - ఏసయ్యా
నీ రూపమే మా కనుల మెదిలేను

పరలోక మార్గము చూపే కావ్యమై
ప్రతి మనసునూ కదిలించేను- ఈ
మారుమనసు స్వస్థతను కూర్చేను

పరిపరి విధముల యోచన చేసి
పాప కార్యమునకు పరుగులు తీసి
మురికి కూపమైన మనసుల నిండా
పరిశుద్ధ వాక్యమై పరిమళించేను
పరలోక మార్గమై నిలిచేను

,
12/22/2019 - 22:53

హైదరాబాద్ స్టేట్ నిజాం ప్రభుత్వంలో ఎన్నో అద్భుత కళాఖండాలు, కట్టడాలు నేటికీ ప్రజల మనసుదోచి మళ్ళీ మళ్లీ చూడాలనిపిస్తున్నాయి. లక్షల మంది పర్యాటకులు నిజాం ప్రభుత్వ కట్టడాలను చూసి తరిస్తున్నారు.

12/22/2019 - 22:42

ఒకడు
ఒక్కో సంఘాన్ని
ఉసిగొల్పాడు
ఒకే నినాదం

నమ్మింది సంఘం
నినాదం మాటున
మర్మమెరుగక

ప్రజాపక్షమో
తప్పదనో
నేతలంతా హోరెత్తించిన
నినాదం

కులమూ
మతమూ కానక
ఉరిమింపజేసిన నినాదం

ఒక్కటై
నినాదాన్ని
ఫలింపజేసి
ఒక్కడిని గద్దె నెక్కించిన సమాజం

,
12/22/2019 - 22:30

ప్రపంచంలోని అనేక దేశాలలో ఎన్నో చర్చిలు శిల్ప కళాసంపదతో విరాజిల్లుతున్నాయి. అటు భక్తులను, ఇటు పర్యాటకుల్ని విశేషంగా ఆకర్షిస్తున్నాయి. క్రైస్తవుల ప్రార్థనా మందిరాన్ని చర్చి అంటారు. చర్చిలలో బెసిలికా, కెతడ్రల్, చాపెల్ ఇత్యాది రకాలు ఉన్నాయి. పవిత్రమైన వ్యక్తులు నివసించే ప్రాంతంలో నిర్మించే చర్చిలను బెసిలికా అంటారు.

12/22/2019 - 22:14

చెబుతుంటే చాలా వింతగా ఉంది కదూ.. నిజమండీ ఈ మొక్కలు కార్చిచ్చుతో వ్యాపిస్తాయి. పైరోపైటిస్ అనే వృక్షజాతికి చెందిన మొక్కలు అగ్నిని తట్టుకునేలా రూపాంతరం చెందాయి. పైరోపైటిస్ అంటే ప్రాచీన గ్రీకు భాషలో ‘అగ్ని మొక్క’ అని అర్థం. ఇంకా చెప్పాలంటే ఈ మొక్కలు విస్తరించడానికి, మనుగడ సాగించడానికి వీటికి మంటలు కూడా అవసరం. సహజసిద్ధంగా మంటలు పుట్టించే ఈ చెట్లు..

12/16/2019 - 00:00

నగరాలు పెరుగుతున్నాయి, మెట్రో నగరాలు విస్తరిస్తున్నాయి. వాటి వైవిధ్యాన్ని, జీవన విధానాన్ని, శైలిని పత్రికలు - ఎలక్ట్రానిక్ మీడియా పట్టి చూపుతున్నాయి. మరి ‘పల్లె’ సంగతేమిటి?.. అన్న ప్రశ్న వేసుకున్నారు చిత్రకారిణి లాబిసెట్టి అనీశ. అలా పల్లెను ‘పత్రం’ పైకి తీసుకొచ్చి తన సృజనను, ప్రతిభను చాటారు.

12/15/2019 - 23:56

రాజ్యాంగం అందరికీ ముఖ్యమైనది కాబట్టి, ఈ పుస్తకంలోని సమాచారం ప్రజలకు అమూల్యమైనదని మేము నమ్ముతున్నాము.
రచయితలు, వారిలో చాలామంది సుప్రీం కోర్టు మరియు హైకోర్టులలో న్యాయవాదులు. వారిలో ఒకరు శాసనసభ్యుడు. మేము రచయితల పరిచయంతో ప్రారంభిస్తాము. తరువాత ప్రభుత్వ అధికారులు మరియు అకాడెమీలోని వ్యక్తుల పుస్తక సమీక్షలు ప్రచురిస్తాము.
-ఎడిటర్
*

12/15/2019 - 23:53

మసకబారిపోతున్న బతుకునో
మారు స్పష్టంగా చూడాలనుకున్నా...
మంచు శిల్పాలౌతున్న గతకాలపు జాడల్ని
ఓ మాటు తేరిపారా వీక్షించాలనుకున్నా..
అదిగో ఆ క్షణమే
నా కళ్ల వాకిట్లో ఓ అద్దాల భవంతి వెలిసింది!

12/15/2019 - 23:48

అరవై కిలోల పండ్ల బుట్టను
అరవై ఏళ్ల నెత్తి మీద మోస్తూ..
రోడ్డు మీద పడి తిరుగుతూ
‘కమలా కాయలు.. కమలా కాయలు’
అని అరుస్తూ..

అంత బరువు పైన పడినా
నలగని చిరునవ్వుల పూలు వెదజల్లుతూనే
బతుకు బరువు తొక్కి పెడుతున్నా
తొణకని స్వరంలో భాస్వరం ప్రజ్వరిల్లుతూనే..

Pages