S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

07/13/2019 - 20:26

ఎన్నో పనులు.
మనం చేయాల్సినవి ఎన్నో పనులు.
చాలా పనులు మర్చిపోతూ ఉంటాం.

07/13/2019 - 20:23

కళ్లల్లో కళ్లెట్టి నీ కళలన్ని పసికట్టి
కనుపాపల కదలికలే చదివా!!
పయ్యెదపై గురిపెట్టి పైటచాటు పరువాల పగరువాల
తులతూగె కనె్న సొగసులెరిగా!!
గుండెలో విషయం నే చదివిన వైనమెరిగి
రెప్పలార్చి ఏమార్చే తీరులని
ఓరకంట ఓ రకంగా నన్నాకర్షించే నెరజాణవని
తెరతీయమని కిర్రెక్కించే తొందరలని
చిత్ర విచిత్ర కులుకులని కులుకుల సాగే సొబగులని

07/13/2019 - 19:41

కడవ సేతబట్టి
సెరువు కాడికొస్తివి
ఈత కొడుతున్న నన్ను
లేత కళ్లతో జూస్తివి..
సెరువు కాస్త సంద్రమైనాది
మనసు కాస్త కెరటమైనాది
కడవ నిండా నీళ్లలెక్క
గుండె నిండా నీ రూపు నింపుకుంటే
వంక మీద కొంగ లెక్క
వాగు మీద తెప్ప లెక్క
ఎళ్తున్న నినే్న జూస్తూ..
సెరువుకానే్న
సెక్కబొమ్మలెక్క నిలుసుంటి

07/13/2019 - 19:40

కొమ్మల చేతులు చాచి పచ్చగా నిల్చున్న చెట్టు
పెనుగాలికి పెళపెళా విరిగిపోతుంది
అప్పటి వరకూ దూరంగా తరమబడిన ఎండ
నిప్పులు చిమ్ముకుంటూ దాడిచేస్తుంది
గొడుగులా విస్తరించిన కొమ్మలు కూలపోవడంతో
అక్కడంతా శూన్యం అనంతంగా విస్తరిస్తుంది!
నేలపై కూలిపోయిన చెట్టు
నిస్తేజంగా కన్నీటి నదిలో మునిగిపోదు
నిశ్శబ్దంగా పోరాడుతుంది

07/13/2019 - 19:03

ఎగిసిపడే కెరటానికి ఆకాశపుటంచులు తాకాలని ఆరాటం - ఎస్వీ హృదయానికి ఆనందపు టంచులు చూడాలని ఉబలాటం -
వయసుకి ఊహలొచ్చి.. రెక్కలిచ్చి పరువంలో పరవశిస్తున్నాయ్-
ఏదో కావాలి.. ఏదో పొందాలి.. ఇదే ‘ఎద’ గొడవ-
అందం అరవిందమై విరిసింది పూల పాన్పుపై.. మకరంద మరందం మాధుర్యమై రసప్లావితమైంది అధరామృతం-

07/13/2019 - 19:00

సంవత్సరంలో పనె్నండు పౌర్ణములు వస్తాయి. దేనికదే ప్రాముఖ్యం వహిస్తుంది. అన్నీ విశేషమైనవే. అయితే, పూర్వాషాఢా నక్షత్రంలో వచ్చే పౌర్ణమి, ఆషాఢమాసంలో వస్తుంది. పూర్వాషాఢా నక్షత్రం, ధనూరాశిలో ఉంటుంది. ధనూరాశికి అధిపతి గురుడు. గురుడు విద్యా కారకుడు. ధన కుటుంబ గృహ వాహన కారకుడు. కొన్నిసార్లు ఉత్తరాషాఢా ప్రథమ పాదంతో కూడి పౌర్ణమి, ఆషాఢ మాసంలో రావచ్చు. ఉత్తరాషాఢ ప్రథమ పాదం కూడా ధనూరాశిలోనే ఉంటుంది.

07/13/2019 - 18:48

తెలుగు భాషలో అణువుకీ, పరమాణువుకీ మధ్య తేడా ఉందో లేదో తెలియకుండా అంతా గజిబిజిగా తయారయింది.
ఇది మొదట్లో మొదలెడితే కానీ తేలే విషయం కాదు.
మీరెవ్వరైనా, ఎప్పుడైనా పరమాణు బాంబు గురించి విన్నారా? పరమాణు విద్యుత్ కేంద్రం గురించి విన్నారా?

07/13/2019 - 18:43

మనస్సులోంచి వీచే
ఈదురుగాలికి
అడ్డూ ఆపూ లేదు
క్షణమైనా తెరిపిలేని
కల్లోల హోరు.
చెట్ల మెడలు వంచాలని
ఒకటే దాడి,
చెట్లు ఊరుకుంటాయా
ఆకులతో అరుస్తూ
గీపెడుతుంటాయి,
కొమ్మలతో దాని రెక్కలు విరిచి
కిందికి తోసేస్తుంటాయి.

07/13/2019 - 18:37

ఇటీవల 60వ జాతీయ చిత్రకళా ప్రదర్శనలో హైదరాబాద్ నగరానికి చెందిన గౌరి వేముల లలిత కళా అకాడెమీ అవార్డు అందుకున్నారు. ప్రతిష్ఠాత్మక ఈ అవార్డు అందుకున్న తెలంగాణ తొలి చిత్రకారిణి ఆమె కావడం గర్వకారణం. ‘విజిల్ బ్లోయర్’ శీర్షికతో గీసిన డ్రాయింగ్‌కుగాను జాతీయ అవార్డును ఆమె అందుకున్నారు. చిత్రకళారంగంలో ఆమె ప్రతిభావ్యుత్పత్తి అసాధారణం. వాస్తవానికి ఆమె చిత్రకళకు ఖరీదు కట్టే షరాబు లేడంటే అతిశయోక్తి కాదు.

07/06/2019 - 20:01

కొంతమంది చిత్రకారులు కంటికి కనిపించేది మాత్రమే చిత్రిక పడతారు. సాధ్యమైతే కొంత డిస్టార్ట్‌లు చేస్తారు. సొగసుగా చూపిస్తారు. మరికొందరు అంతర్ముఖులై అంతఃచేతన (సబ్‌కాన్షియస్‌స్)లో విహరించే అపురూప రూపాలకు ఆకృతి ఇస్తుంటారు. అలాంటి కొందరిలో కోటగిరి సంతోష్ ఒకరు. ఈ యువ చిత్రకారుడి కలలు కాంతులు రంగుల కవిత్వంగా చిరంజీవత్వం పొందుతాయి.

Pages