S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఎంత హాయి ఈ రేయి

రివ్వున ఆకాశానికి బారులుతీరి ఎగిరే గువ్వల్ని.. చీకటిపడుతుంటే గూటికి చేరే గువ్వపిట్టల్ని.. టపటపమంటు నేలతల్లిని తాకే ప్రయత్నంలో సవ్వడిచేసే తొలకరి చినుకుల్ని.. తడిసిన మట్టిలో నుంచి అపుడప్పుడే మొలకలెత్తే మొలకల్ని.. బోసిబోస నవ్వులతో, బుడి బుడి నడకలతో పసివాడు కొట్టే కేరింతల్ని... వేసే తప్పటడుగుల్ని చూస్తుంటే లోకంలో అంతకంటే సంబరం, సంపద మరేది అనిపించదు నాకు.
బువ్వపెట్టి, కథల్చెప్పి వెచ్చగా పడుకోబెట్టే అమ్మని మరిపించేది.. నాన్న లికిడి అమ్మ పొత్తిళ్ళల్లో వున్న నానికి.. బుజి బుజి కళ్ళు మెరిసేవి.. సంతోషంతో వాడి కాళ్ళు గజ్జెల శబ్దం చేసేవి.. పగలంతా పడ్డ శ్రమని, కష్టాన్ని మరిపించి రాత్రంతా కమ్మని హాయిని.. పంచేవి.. పసిపాపని అక్కున చేర్చుకున్న యశోదకి, నాకు.
పదే పదే నాని మా తలపుల్లోకి వస్తున్నాడు. గతానికి తెర తీస్తున్నాడు. యశదని కదిలిస్తే కళ్ళు కావేరిని తలపిస్తున్నాయ్.. నా మసకబారిన కళ్ళకి.. ఈ కళ్ళల్లో కురిసే కన్నీటి వానకి అంతమెప్పుడో! ఏడ్చి ఏడ్చి ఎర్రవారిన కళ్ళు కలువలయ్యేవి ఇంకెన్నడో?
‘‘తలచినదే జరిగినదా దైవం ఎందులకు.. జరిగనదే తలచితివా శాంతి లేదు నీకు..’’ కవి చెప్పినట్లు ‘‘అనుకున్నామని జరగవు అన్ని.. అనుకోలేదని ఆగవు కొన్ని.. జరిగేవన్ని మంచికని.. అనుకోవటమే మనిషి పని..’’ ముమ్మాటికి నిజం. ప్రతి మనిషికి, మనసున్న మనిషికి తప్పదేమో ఈ వైఫల్యం ఏదో ఓ రూపంలో జీవితంలో-
ఎంత తరచి చూసినా దుఃఖమే కాని.. శాంతి దొరికేలా లేదు విశ్వాకి. యశోద పరిస్థితి ఇంకా దారుణం. తను నాలుగ్గోలమద్య బందీ.. పోనీ ఎటైనా తీసుకుపోదాం అంటే తను నాని బాల్యాన్ని, వాడు ఊగిన ఊయలని తలచుకుని తలచుకుని కుమిలిపోతోంది. ఈ విషమ పరిస్థితి ఎందులోకి దారితీస్తుందో.. ఈ మనోవ్యాధికి మందెలా దొరుకుతుందో తెలియని పరిస్థితి నాదైంది. ఏమైనా సరే, ఎలాగైనా సరే.. నాని జ్ఞాపకాల నుంచి బయటికి తీసుకురావాలి. విశ్వ మేధకి పదునుపెట్టాడు.. ఎంతకి దొరకని సమాధానం.. చీకట్లో రాయి విసురుదాం..
కాశ్యప్ రెప్పలార్చని ఆ కళ్ళని.. విప్పారిన ఆ కలువల కళ్ళని.. సరిగమ పదనిసలనిపించె ఆ పలువరసల బిగువున ధ్వనియించే హాసనాల్ని... గాలికి నుదురును తాకే ముంగురులు తన ముఖారవిందాన్ని కప్పి, కనుపించి కనుపించని ముఖ కవళికల్ని అలా చూస్తూండిపోవాలన్న ధ్యాసే కానీ, మరే వికార భావనలు లేవు తనపట్ల.
కాని ఆ ప్రకృతి ఒడిలో ఊయలూగుతున్న మృదుల మనసు ఈతనిని గమనించే పరిస్థితులలోలేదు. ఓ పక్క పూలు, పండ్లు విరగబూసిన నేత్రానందం.. మరోపక్క ముక్కులకు పసందైన పరిమళాలు.. ఇంకోపక్క గలగలపారే ఏరు.. ఏటిలోకి రుసరుస దూకే జలపాత పరవళ్ళు, కనె్న ఒరవళ్ళు తను చూస్తోంది.. కాశ్యప్ తనలో వెతుకుతున్నాడు. అలా ఎంతసేపు కాలం గడిచిందో కాలానికి తప్ప కాశ్యప్ ప్రణయావేశానికి, మృదుల తన్మయత్వానికి తెలియదు.
మృదుల జాగృతమంది మూసుకొస్తున్న మసక వెలుతురులకి.. గుర్తుకొస్తున్న ఒంటరితనానికి- అప్పుడు తనవైపుగా వస్తున్న కాశ్యప్‌ని గమినంచింది. ఒకింత తడబాటు ఆ కళ్ళల్లో కనబడింది. మృదువుగా కాశ్యప్ చిరునవ్వు విసిరాడు ఆమెని సమీపిస్తు..
మృదుల కళ్ళల్లో మెరుపు, చురకు, దుడుకు తను తనని సమీపిస్తున్నది గమనించి, రాబోయే తుంటరి విపత్తును ఏకాంతంలో, సంధ్యమరుగయే ప్రాంతంలో.. ఒంటరి తను.. నడకల్లో తను తననుంచి తప్పుకునే పరుగు చూపించింది- ‘మిస్’ అంటూ పలకరించ సాహసి కాశ్యప్. ‘ఏంకావాలి’.. ప్రశ్న కన్పించింది తన కళ్ళలో. ‘నేను ఈ ప్రాంతానికి కొత్త.. ఇక్కడి విశేషాలు మీకు తెలుస్తాయని..’ అంటూ ఓ చెంచా నీళ్లు నమిలాడు తటపటాయిస్తూ. మృదుల కళ్ళు రెపరెపలాడిస్తూ తన ఆంతర్యంలోని చొరవని నిరసిస్తు రుసరుస నడక సాగించింది తన కారు వద్దకు.
‘మిస్.. కంగారు పడవలసిన విషయం, ఐ మీన్ నాలో ఏ అన్య చింతన లేదు. నేనొక పొయెట్‌ని.. భావుకత కసం ఈ ప్రాంతానికి వచ్చాను. నా నుంచి మీరెలాటి భయాన్ని పెట్టుకోవద్దు. బైదిబై ఐయామ్ కాశ్యప్ పత్రికల్లో వాటిల్లో ఆర్టికల్స్ వస్తుంటాయి.’ అంటూ మృదులని నిలువరించాడు.
‘ఓ.. ఐయామ్ మృదుల.. ఓ డాక్టర్‌ని. అప్పుడప్పుడు పత్రికల్లో వచ్చే మీ కవితల్ని.. కథల్ని చూస్తూ రిలాక్స్ అవుతుంటాను. నాలో కవితాత్మకమైన ప్రేరణ ఉంది, అందుకని ఇలాటి ప్రదేశాలలో నన్ను నేను మరిచిపోతుంటాను. అందుకే ఇంతసేపు.. ఇలా ఒంటరిగా.. అంటూ క్లుప్తంగా కనెక్టయ్యింది.
‘నో.. నో’ ఇప్పుడు మరొంటరి ఎంత మాత్రం కాదు.. ఇది ఏకాంత వాసము కాదు.. అంటూ కవిగారు జలక్‌మనిపించారు మృదులని ఒకింతసేపు.
‘‘యు మీన్..’ అంటుంటే మృదుల.. ‘ఐమీన్. మనతోపాటు చెట్లు, చేమ, గూటికి చేరే గువ్వలు, మడుగున ఈదే చేపలు.. ఇలా జీవకోటి, ప్రకృతి మనల్ని పొంచి ఉన్నది గమనించాలి..’ అంటూ మృదుల కళ్ళల్కో తొంగి చూశాడు కాశ్యప్. కాశ్యప్ నుంచి కళ్ళని వాలుగా మళ్లిస్తూ ‘ఎంతైనా మీరు కవులు, చమత్కరిస్తారు.’ అంటుంటే మృదులని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ, ‘‘మీరు కవితాత్మకులు.. ఆస్వాదించ సమర్థులు..’ అంటూ కాశ్యప్ కారు డోర్ తెరిచాడు. తన విజిటింగ్ కార్డు తడిమి ‘ప్లీజ్..’ అంటూ మృదుల చేతికందించాడు.
‘ఓహ్.. డాక్టర్ కాశ్యప్, ఎం.డి (కార్డియాలజీ) విజిటింగ్ కార్డ్ చేస్తూనే పైకి చదివేసింది మృదుల, ఎం.ఎస్ (గైనిక్). అలా ఇద్దరు ఒకే వృత్తి.. ఒకే ప్రవృత్తి.. చాలా దగ్గరగా కనెక్టయ్యారు. ఫ్రీక్వెన్సీ బాగా పెరిగి, పరిచయం కాస్త పరిణయం దాకా వెళ్లింది. కాకపోతే ఎటొచ్చీ చిక్కువాళ్ళ వ్యక్తిత్వాలు కూడా ఒకటే కావడం. మృదుల ఫారిన్‌లో వున్న తల్లిదండ్రులకి దగ్గరగావాలంటుంది. కాశ్యప్ దేశాభిమాని, పుట్టిన భూమి.. కన్నవారిని.. విడిచి రానని తను. ఇక్కడ భేదాభిప్రాయమైంది ఇద్దరికి.
కారు ఎయిర్‌పోర్టుకి రావడంతో కాశ్యప్ మృదుల వర్తమానంలోకి వచ్చారు.. గతంలో ఇద్దరి పరిచయాన్ని.. ఇప్పటి విడిపోయే ప్రహసనాన్బిద్ధమైతే ఎంత బాగుండు అనుకుంటూ ఎయిర్‌పోర్ట్‌లోకి ప్రవేశించారు. వీడ్కోలు ఇచ్చే స్థానంలో కాశ్యప్, విడిపోయి తల్లిదండ్రులని చేరే స్థితిలో మృదుల.. అన్యమనస్కంగానే విడిపోతున్నారు. విధిని విధిగా తిడ్తూ, వేరే దారిలేక.. ఇంకేమి చేతకాక.. కాశ్యప్ చివరిసారిగా చెప్పే చూశాడు మృదులని ఆలోచించమని, తన అభ్యర్థనని మన్నించమని. మృదుల వౌనంగా చేయి ఊపింది కాశ్యప్‌కి.. కాశ్యప్ ఫ్లైట్ గాలిలోకి ఎగిరేవరకు ఉండి, సాగిపోయే రోడ్డు పట్టాడు కారులో నిరాశతో.
తలుపు మూసినా.. మృదులతో గడిపిన తలపులు.. మనసులో కదలసాగాయి.. తనని చూసిన తొలి చూపులోనే తను తనతో ‘‘ఎంత హాయి ఈ రేయి.. ఎంత మధురమీ హాయి..’’ డ్యూయెట్ పాడాలనుకున్నాడు.. కాని పాట పాటలోనే మిగిలిపోయింది జీవితం. ఇలా మారుతోందని, మారబోతోందని కాశ్యప్ ఉరఫ్ నాని జీవితమని కుమిలిపోసాగారు తల్లిదండ్రులైన విశ్వ, యశోదలు. కాశ్యప్‌ని ఎంతో అనునయించబోయారు ప్రోత్సహించబోయారు, మృదుల కోరికని మన్నించి పెళ్లికి ఒప్పుకోమని, తాము పండుటాకులమని.. తమకోసం పట్టిన చేయి విడవబోకని.. కాని కాశ్యప్ మాతృత్వాన్ని పంచిన మమతానురాగాల్ని... తండ్రి చేయూతని విస్మరించి ‘‘ఈ వయసులో మిమ్మల్ని విడిచి నా అంతరాత్మ ముందు కృతఘు్నడనై దోషిగా నిలవలేనని నిగర్వంగ ఆచెప్పేశాడు’’ అక్కడితో ఇల్లు చేరిన కాశ్యప్ ఆలోచనలు వర్తమానంలోకి వచ్చేశాయి.
కాశ్యప్ మత్తుగా పక్కపై అటు ఇటు దొర్లుతున్నాడు బద్ధకంగా. తన పక్కన ఎవరో కదిలిన స్పర్శ తెలుస్తోంది. కళ్ళు తెరవనీయటంలేదు, ఎంత విచ్చుకునే ప్రయత్నం చేసినా కళ్ళని. ఎట్టకేలకు, చిట్టచివరకు కళ్ళు తెరిచి చూద్దునుగదా, ఎదురుగా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ మృదుల. ఇది కలా.. నిజమా... అనుకుంటున్నంతలో అమ్మ కిందనుండి కేకలు పెడుతోంది. టిఫిన్ రెడీ.. కిందికి రండి అంటూ. ఒక్క ఉదుటున లేచి కూర్చున్నాడు కాశ్యప్, చేరువలో మురిపెంగా మృదుల.
అమ్మ కళ్ళల్లో ఆనందం.. మృదుల కళ్ళల్లో అనురాగం.. వెరసి నాన్న కళ్ళల్లో సంతోషం. అమ్మయ్య విధి కరుణించింది. అందరి కళ్ళల్లో సంతోషపు వెల్లువ.. తరలిరాద తనే వసంతం.. తన దరికి రాని వనాలకోసం.. అన్నట్లు దుఃఖసాగరంలా వున్న మా ఇంటికి ‘వసంతం’లా మృదుల మా మధ్యకి వచ్చింది. కాని ఏమిటి ఈ హఠాత్పరిణామం.. తనని ప్రభావితం చేసిన వారెవరు.. ఇది ప్రస్తుతం కాశ్యప్, యశోదల మేథలకందనిది. వారిరువురి కలవరాన్ని చూసి నవ్వాపుకలేకపోయాడు విశ్వ.
విశ్వ రాయబారం ఫలించింది.
యశోదని ఆ స్థితిలో చూడలేక... మృదులని వదులుకోలేక.. మృదుల తల్లిదండ్రులని విశ్వ కదిపాడు. వాళ్ళు విశ్వ అభ్యర్థనలోని ఔచిత్యాన్ని, అవసరాన్ని ఆకళింపుచేసుకుని వాళ్ళ స్టైల్‌లో మృదులని ఒప్పించారు.. పెళ్లి వరకు రప్పించారు.
ఇదే విషయాన్ని వెనె్నట్లో మృదుల కాశ్యప్‌కి వివరిస్తోంది..
గదిలో విశ్వ యశోదకి తేటతెల్లం చేస్తున్నారు.
ఎంత హాయి ఈ రేయి.. ఎంత మధురమీ హాయి..

-ఆచార్య క్రిష్ణోదయ.. 74168 88505