S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

చివరి అంకం

చూడు మోయడానికి నలుగురైనా లేకపోయిరి
పదుగురైనా స్మశానం వరకూ కూడా తోడు రాకపోయిరి
నీ దగ్గర ఉన్న డబ్బు మోతకు తాళం వేసేవారే అందరూ!
ఇప్పుడు మరణమృదంగం మ్రోగగానే పరారే ప్రతి ఒక్కరూ!
పిడికెడు మట్టి వేయటానికి కూడా దిక్కులేరెవరూ!
ఇదేనా నువ్వు సంపాదించుకున్న కీర్తిప్రతిష్ఠలు
ఇదేనా నీ అప్రతిహత అవిశ్రాంత సంపాదనకు ఫలితం?!
పోనీ నీవైనా ఒక్కరోజైనా కడుపునిండా తిని కంటినిండా నిద్రపోయావా?
ఒక్కరోజైనా సంతోషంగా వుంటూ మంచితనంతో గడిపావా?
ఒక్కరోజైనా ఎవరి మీదనైనా అయ్యో పాపమని జాలి చూపావా?!
డబ్బు మదంతో విర్రవీగుతూ ఎవ్వరినీ దరి చేర్చలేదు కదా!
అనుక్షణం ఎవరైనా డబ్బును ఎగరేసుకు పోతారేమోనని
కుక్కలా కాపలా కాసావు
అంత ప్రాణప్రదంగా చూసుకున్న డబుబ నీతో పాటు ఇప్పుడు వచ్చిందా?
నేడు వెళుతూ వెళుతూ నువ్వు తీసుకెళ్తున్నది ఏమిటి?
ఒంటిపైన నూలుపోగు కూడా లేక నగ్నంగా అనాథ ప్రేతంలా పడి వున్నావు
ఈ లోకంలోనికి రావడం లోకం వీడిపోవడం అంతా ఖాళీ చేతులతోనే అన్న నగ్నసత్యాన్ని గ్రహించలేక పోయావు!
నిన్నూ నీ డబ్బును చూసి కళ్లల్లో నిప్పులు పోసుకున్న వాళ్లెవరూ ఒక్క కన్నీటి బొట్టును కూడా రాల్చడానికి సిద్ధంగా లేరిపుడు!
అనవసరంగా అందరినీ దూరం పెట్టి బంధాలు
ఆప్యాయతలను త్రెంచేసుకున్నావు
ఆనాడు కనీసం ఒక్కరినైనా ఆదుకుని ఉంటే ఆ ఒక్కడు నీతోపాటుగా నిలిచి
నీ ప్రేత సంస్కారం చేసేవాడు!
దేహం కాలి బూడిదయినా ఆ ఒక్కడి గుండెల్లో పదిలంగా కలకాలం
మంచివాడిగా నిలచివుండే వాడివి కదా!
*

-శివేగారి చిన్నికృష్ణ.. 6300318230