AADIVAVRAM - Others

ఎవరు ముందు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మరో రెండు రోజుల్లో మనం 2020లోకి ప్రవేశించబోతున్నాం. కానీ కొన్ని దేశాలు మాత్రం మనం 2020లోకి ప్రవేశించినా ఇంకా 2019లోనే ఉంటాయి. అది ఎలాగో.., కొత్త ఏడాది సంబరాలు అందరికంటే ముందు ఎవరు చేసుకుంటారో చూద్దాం..
* మనకి డిసెంబర్ 31 మధ్యాహ్నం 3:30 నిముషాలు అవుతుండగానే పసిఫిక్ మహాసముద్రంలోని ‘సమోవా’ దేశం 2020లోకి అడుగు పెట్టేస్తుంది. అక్కడ సంప్రదాయ నృత్యాలతో కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతారు స్థానికులు. సమోవాతో పాటు కిరిబాటి దేశ పరిధిలోని క్రిస్‌మస్ ద్వీపంలోనూ ఇదే సమయంలో నూతన సంవత్సర వేడుకలు మొదలవుతాయి.
* కొత్త ఏడాదిని ఆహ్వానించడంలో మనకంటే అయిదున్నర గంటలు ముందుంటుంది ఆస్ట్రేలియా.. తూర్పునున్న దేశాల్లో కొత్త ఏడాది కోలాహలం ఎక్కువ కనిపించేది ఇక్కడే! ‘సిడ్నీ హార్బర్ బ్రిడ్జ్’ దగ్గర లక్షలమంది వేడుకల్లో పాల్గొంటారు. హార్బర్ పొడవునా అరవై ఐదు కిలోమీటర్ల మేర రాత్రి తొమ్మిదింటి నుంచి 80 వేల రకాల మందుగుండు సామాగ్రిని పేలుస్తూ పండుగ చేసుకుంటారు.
* సూర్యోదయ భూమి(నిప్సన్)గా పేరున్న జపాన్ మనకంటే మూడున్నర గంటలు ముందే కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతుంది. ఇదే సమయానికి దక్షిణ కొరియాలో కొత్త సంవత్సర సంబరాలు జరుపుతారు. మనకంటే చైనా రెండున్నర గంటల ముందు, భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్‌లు ముప్ఫై నిముషాల ముందు కొత్త సంవత్సరంలోకి అడుగుపెడతాయి.
* కొత్త సంవత్సరంలోకి ‘సమోవా’ తర్వాత ఎనిమిదిన్నర గంటలకు మనం అడుగుపెడతాం. శ్రీలంక కూడా మనతోపాటే అడుగుపెడుతుంది.
* మనకు ఒకటో తేదీ తెల్లవారుజామున నాలుగున్నర గంటలకు ఒకేసారి 43 దేశాలు కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతాయి. వాటిలో జర్మనీ, నార్వే, ఫ్రాన్స్, ఇటరీ, ఐరోపాలతో పాటు కాంగో, అంగోలా, ఆఫ్రికా దేశాలూ ఉన్నాయి.
* మన తర్వాత అయిదున్నర గంటలకు ఇంగ్లండ్‌లో వేడుకలు మొదలవుతాయి.
* మనకు ఉదయం 10:30 అయినప్పుడు అమెరికాలోని న్యూయార్క్‌లో కొత్త సంవత్సరం వేడుకలు మొదలవుతాయి. అక్కడ ‘టైమ్ స్క్వేర్’లో జరిగే బాల్ డ్రాపింగ్ సంబరం ఈ వేడుకలకు ప్రధాన ఆకర్షణ. ఆరడుగుల చుట్టుకొలతతో 1070 పౌండ్ల బరువుండే ‘వాటర్‌ఫోర్డ్ క్రిస్టల్ బాల్’ను స్తంభంపై ఉంచుతారు. 11:59 నిముషాలకు ఆ బాల్ కిందకు జారడం మొదలై సరిగ్గా పనె్నండింటికి నేలను తాకుతుంది. అంతే శుభాకాంక్షల హోరు మిన్నంటుతుంది.
* చివరిగా అమెరికాలోని ‘సమోవా’తో కొత్త సంవత్సరం వేడుకలు ముగుస్తాయి. ఈ ప్రాంతం అమెరికా పరిధిలోకి వస్తుంది. అప్పటికి భారత్‌లో సాయంత్రం నాలుగున్నర అయ్యుంటుంది. నూతన సంవత్సరం ఆఖరిగా వచ్చేది అమెరికా పరిధిలోని బేకర్, హోవార్డ్ దీవులు. అమెరికా సమోవాకు ఇక్కడికీ గంట తేడా.. ఇక్కడ జనావాసాలు ఉండవు. ఒకవేళ ఎవరైనా అక్కడుంటే చివరిగా కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టేది వారే.. కన్‌ఫ్యూజ్ కాకండి.. పసిఫిక్ మహాసముద్రంలోని ‘సమోవా’లో మొదట నూతన సంవత్సరం ఆరంభమవుతే.. అమెరికాలోని ‘సమోవా’లో ఒకరోజు తర్వాత నూతన సంవత్సరం ఆరంభమవుతుంది. పేర్లు ఒక్కటే కానీ ప్రాంతాలు వేరు..
* స్వీడన్, ఫిన్లాండ్‌లను ‘మ్యూనియో’ నది విభజిస్తుంది. ఫిన్లాండ్ సమయం, స్వీడన్ కంటే గంట ముందు. ఫిన్లాండ్‌లో నూతన సంవత్సరానికి స్వాగతం పలికిన తరువాత పదిహేను నిముషాలు నడిచి వంతెన దాటితే స్వీడన్లోకి వెళ్లచ్చు. అక్కడ మళ్లీ 2020కి స్వాగతం పలకవచ్చు. ఈ రెండు నగరాల్లోకి యువతకు ఇది భలే సరదా.. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరుకోడానికి కేవలం పదిహేను నిముషాలు సమయం పట్టడంతో వారు మొదట ఫిన్లాండ్‌లో నూతన సంవత్సర వేడుకలు చేసుకుని తర్వాత స్వీడన్లోకి వెళతారు.