AADIVAVRAM - Others

ముక్తకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచంలో ఎంతకాలం
బ్రతుకుతావన్నది కాదు ముఖ్యం
మనినంతకాలం
మల్లెపూవై పరిమళించురా నేస్తం!
* * *
పోరాటం పోరాటమే
అది అవసరమే
అది చీకటితో ఐతేనే
అవనికి కళ్యాణం
* * *
ఆకురాలినంత మాత్రాన
చెట్టు కుంగిపోదురా
మళ్లీ చిగిర్చి పచ్చగా హసిస్తానని
దానికి తెలుసురా!
* * *
చదువు
సముద్రం
ఎంత లోతుకు వెళ్లినా
అంతే అగాధం
* * *
అన్నా! మనసును మంచిగా
మంచులా స్వచ్ఛంగా ఉంచు
మంచితనాన్ని లోకానికి
పంచుతూ బతుకు
* * *
పాలరాతి మేడలో మనినవాడు
పూరిగుడిసెలో బతికినవాడు
ఆఖరుకి అక్కడికే చేరుతారు
ఆ నేలది ఎంత సమధర్మం!
వాడు కోట్లు కూడబెట్టాడు
వాణ్ణి విశ్వం మరచిపోయింది
వీడు కుదిపే పాటలు కట్టాడు
వీణ్ణి లోకం గుండెల్లో నిలుపుకుంది
* * *
తినడానికే బతుకకు
భూమికి నీవు భారం
బతకడానికే తిను
బతుకు సమాజానికి ఉపయుక్తం
* * *
బాహ్య సౌందర్యం
వాడిపోతుంది
హృదయ సౌందర్యం
సదా నిలుస్తుంది
సోక్రటీసే నిలిచాడు
అబ్దుల్‌కలాం విరిచాడు
నిలిచే పనులు చేస్తేనే మనిషి
ఇలలో నిలుస్తాడు.

-డా.తిరునగరి.. 9392465475