S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

08/24/2019 - 18:55

నేటి ఉరుకుల, పరుగుల యాంత్రిక జీవనంలో మానవుడు కాలంతో పాటు పరిగెత్తి పరిగెత్తి అలసిపోతున్నాడు. అందుకే సంవత్సరానికి ఒక్కసారైనా యాంత్రికతకు దూరంగా, ప్రకృతికి దగ్గరగా గడపాలనుకుంటున్నాడు. ఇందుకోసం కొత్త కొత్త దారులను ఎంచుకుంటున్నాడు. ఈ విషయాన్ని కనిపెట్టారేమో.. గానీ కొంతమంది వ్యాపారవేత్తలు ఇలాంటివారికోసం.., ప్రకృతితో సహజీవనం చేసేందుకు వీలుగా చెట్లపై రిసార్ట్స్‌ను నిర్మిస్తున్నారు.

08/24/2019 - 18:41

సూర్యుడినడిగా.. చంద్రుడినడిగా..
పగలు రాత్రి కలిపేస్తుంటారు
లోకం చుట్టేస్తుంటారు.
ఎండలు కాయిస్తుంటారు
వెనె్నల కురిపిస్తుంటారు
మలినాల్ని కలుషాల్ని కడిగేస్తుంటారు
నీ చూపు సోకి సరోజం మురిసి మురిసి
ప్రకాశిస్తుంటంది.
శశికిరణం తాకి కలువ చలువ
కురిపిస్తుంటుంది
మరి నాకెందుకు ఈ నైరాశ్యం
నాకెందుకు ఈ నిశీది యాగం

08/24/2019 - 18:23

జీవితమే ఓ నాటకం
దానికితోడు వ్యాపకం
ఏదో చేయాలని
ఏమో కావాలని
అనుక్షణం తాపత్రయం
అందుకే వదల్లేరు ఈషణత్రయం
తామెవరో! తమ దారేమిటో
ఈ దారికి సూత్రధారి ఎవరో
సూత్రప్రాయంగానైనా ఆలోచించరు.
ఈషణ్మాత్రం ఊహించరు
న్యాయా న్యాయ విచక్షణా
చక్షువులు మూసుకున్నప్పుడు
పాపపుణ్యాల మాటను పక్కనపెట్టి
తమకోసం తమ వారి కోసం

08/24/2019 - 18:17

మనసు వికసిస్తే
మాట పరిమళిస్తుంది
సౌజన్యం వెల్లివిరుస్తుంది
భావం సార్వత్రికమైతే
ఆలోచన విస్తరిస్తుంది
అవగాహన విస్తృతవౌతుంది
కోపాన్ని నియంత్రిస్తే
వివేచన చొరవ తీసుకొంటుంది
బుద్ధి వికసిస్తుంది
నమ్మకాలకు నిజాల అవసరం వుంది
ఎందుకంటే అవి నిజమో కాదో తేలాలి గనక
నిజాలకు నమ్మకాలతో పనిలేదు
ఎందుకంటే నమ్మినా నమ్మకపోయినా

08/24/2019 - 18:06

కొత్త విషయాలు తెలుసుకోవడం,
చదవడం,
అధ్యయనం చేయడం కొంతమందికి ఓ నిరంతర ప్రక్రియ.
ఈ విషయంలో సివిల్ సర్వెంట్స్ విషయంలో న్యాయవాదుల విషయంలో ఓ గమ్మతె్తైన కామెంట్ ఉంది. ఐ.ఏ.ఎస్. ఐ.పి.ఎస్.లు కావడానికి వాళ్లు రోజుకి 20 గంటలు చదువుతారు. సాధిస్తారు. ఆ తరువాత చదవడం మానేస్తారు. ఈ కామెంట్ అందరికీ వర్తించదు.

,
08/17/2019 - 20:40

కొత్త తరం చిత్రకారిణి ప్రియాంక ఏలే. సరికొత్త ‘సబ్జెక్ట్’తో, భావ వ్యక్తీకరణతో, రంగుల పొంగులతో హద్దులను చెరిపేస్తూ ఆమె దూసుకుపోతున్నారు. తెలుగు నేలపై ఇప్పుడు ఓ రంగుల సమీరం వీస్తోంది. సృజనాత్మకత - కళాత్మకత కళ్లకు కడుతోంది. ప్రియాంక ఏలే కుంచె ఓ కొత్త రంగుల సమీకరణాన్ని కాన్వాసుపై ప్రదర్శిస్తోంది. ఆమె పెన్ను సైతం పరవశింపజేసే ఆకృతులను కాగితంపై అద్దుతోంది, అద్భుతాలను ఆవిష్కరిస్తోంది.

08/17/2019 - 20:30

పోలరైజ్డ్ కళ్లద్దాలు పెట్టుకునే వారికి ఈ మాట అసంకల్పంగా అర్థం అవుతుంది. తీవ్రమైన ఎండలో చలవ కళ్లజోళ్లు పెట్టుకోవటం మనకి అనుభవం ఉన్న అలవాటే. ఈ చలవ కళ్లద్దాలనే పోలరైజ్డ్ కళ్లద్దాలు అని కూడా అంటారు. నిజానికి ఈ రకం కళ్లజోళ్లు ధరించటం కంటి ఆరోగ్యానికి రెండు విధాలుగా మంచిది. ముందస్తుగా మంచి రకం చలవ కళ్లజోళ్లు ‘గ్లేర్’ని తగ్గిస్తాయి.

08/17/2019 - 20:27

ఒక ప్రిన్సిపాల్ నుంచి సమాజం ఏం ఆలోచిస్తుందో అని చెప్పటం చాలా కష్టం. ప్రిన్సిపాల్‌ను ఆదేశించటం, నిర్దేశించటం కష్టం. మా ఆలోచనను బట్టి ప్రిన్సిపాల్‌కు ఏడే విద్యుక్త ధర్మాలను సూచించామే కానీ సమాజం ప్రిన్సిపాల్ నుంచి చాలా ఆశిస్తుంది.
ఉదాహరణకు అబ్రహాం లింకన్ తన కొడుకు గురించి ఒక టీచర్‌కు రాసిన ఉత్తరమే దీనికి సాక్ష్యం.
* * *

08/17/2019 - 20:06

భక్తిశ్రద్ధలతో నిర్వహించే ఈ తీజ్ పండుగ బంజారా గిరిజనులలో బలమైన విశ్వాసం వుంది. పూర్వం తండాలలో కాలం కాకపోవడంతో తీవ్ర కరువు వచ్చినప్పుడు లోకం సుభిక్షంగా వుండాలని పెళ్లికాని యువతులతో ఈ తీజ్ పండుగ నిర్వహించే వారని గిరిజన బంజారా పెద్దలు చెబుతున్నారు. తీజ్ పండుగలో కీలకంగా మారిన పెళ్లికాని యువతులకు త్వరగా మంచి లక్షణాలు గల వరుడు లభించి వివాహం అవుతుందని విశ్వాసం.

08/17/2019 - 20:06

ఉన్నట్టుండి
ఏదో నిప్పు రాజుకుంటుంది
ఒక వాక్యమై
ఒక నినాదమై!

ఉన్నట్టుండి
ఏదో ఊహ పురుడు పోసుకుంటుంది
ఒక పదమై
ఒక ప్రవాహమై!

ఉన్నట్టుండి
ఏదో ఆవేశం ఎగసిపడుతుంది
ఒక ఉప్పెనై
ఒక కవిత్వమై!

ఉన్నట్టుండి
ఏదో నిర్వేదం పెనవేసుకుంటుంది
ఒక గాయమై
ఒక గేయమై!

Pages