AADIVAVRAM - Others

అమ్మతోడు... అమ్మా నువ్వు కావాలి...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరుగెత్తి వస్తోంది రాహువు.. అయ్యో తరిగిపోతున్నాది ఆయువు.. ఆపాత మధురాల్లో విషాద గీతాలు శీర్షికన వినిపిస్తోంది బాలు గొంతుకలో.. తెర మీద అభినయిస్తున్నాడు సూపర్ స్టార్ కృష్ణ. కమ్మిన మబ్బులు విడిపోయి ఇప్పుడిప్పుడే వెలుగు రేఖలు, క్రాంతి భావాలు మదిలో మెదలసాగాయి కుముదం అంతరంగాన. ఒకప్పుడు కరడు గట్టిన మత్సరంతో కూడిన స్వార్థంతో తను తనకి చేసిన ద్రోహం గుండెను పిండి చేస్తున్నట్లుగా అతని ఆక్రందనం గుర్తుకొస్తున్నది...
తను ఓ మారుమూల గ్రామంలో నివాసి.. తనని అందరూ చూసి రాబోయే కాలంలో కాబోయే జమీందారిణి అంటూ అభిలషిస్తుండేవారు.. ఆశలూరిస్తుండేవారు. తనపై తనకి నమ్మకం కుదిరేది కాదు వర్తమానంలో. ఎందుకంటే తల్లిదండ్రులు కడు పేదవారు, నాలుగిళ్లల్లో వంట పనులతో అమ్మ.. ఉపాదానంతో నాన్న సంసారం ఈడ్చుకొస్తున్నారు. తనని, తమ్ముణ్ణి అత్తెసరు చదువులతో ఐదో తరగతి వరకు ఆ ఊరి బళ్లో చదివించడమే కష్టమయ్యింది. ఇంక హయ్యర్ సెకండరీ చదువులకి పొరుగూరు లేదా పట్నం ఎలా పంపగలరు? కుముదం తమ్ముడికి సామూహిక ఉపనయనాలలో ఉపనయనం అయ్యిందనిపించారు నాన్న. ఆ తరువాత జియ్యర్‌గారి పుణ్యమా అని వేద పాఠశాలకి పంపించారు. అక్కడే జియ్యర్‌గారి శిష్యరికంతో మఠంలో కాలక్షేపం చేస్తున్నాడు తమ్ముడు సుందరయ్య (ముద్దుపేరు) అసలు పేరు సుందర వరద రాజస్వామి పెరుమాళ్. ఇంట్లో వారు పెరుమాళ్‌ని.. బయటి వారు వరద అని కొందరు. తన ఈడువారు సుందయ్య అంటూ వాణ్ని ఆట పట్టిస్తుంటారు.
ఇది సంక్షిప్తంగా మా కుటుంబం పరిస్థితి, ఆర్థిక స్థితి గతి. నువ్వు బాగా పాడ్తున్నావ్... బహుశా మధుర గాయనివై కచేరీలతో మంచి గుర్తింపు.. ఆర్థిక ఉన్నతి లభించవచ్చు అంటుండేవారు మా వీధి అమ్మలక్కలలు. కారణం వారందరు ఆర్థికంగా సంపన్నులైనా.. వారివారి సంతాన మా అంత అందం.. చందం కలిగినవారు కారు. భగవంతుడు బహుశా ఒకటిస్తే రెండివ్వడో ఏమో!!
చూడచక్కని అందం మా కుటుంబంలోని వారందరిది. అందుకని మా ఇంట లక్ష్మీ విస్తారంగా లేకపోయినా మా ముఖ కవళికలో కళాకాంతులు విరజిమ్ముతున్నాయన్నది లోకోక్తి. అందుకని భగవంతుడిని నువ్వుగా అడక్కు.. ఇస్తే వద్దనకు.. ఒకరితో పోల్చుకోకు.. ఇది నాన్నగారి సిద్ధాంతం. కాదని ఎవరైనా ముందుకొస్తే ఆ రోజు నాన్నగారు వేదాంతం క్లాసులు తీసుకుంటారు. అందుకని తమ్ముడు, నేను నాన్నగారి వద్ద చాలా మెలకువగానే ఉంటాము.
అది వెంకటాచలంగారి ఇల్లు.. దూరపు బంధువు శోభనాద్రి పతీ వియోగంలో ఉన్న వెంకటాచలం గారింటికి చుట్టం చూపుగా వచ్చి వారిని అనునయంగా ‘వెంకటాచలం అన్నయ్యగారు.. పోయిన వాళ్ళతో మనం పోలేము గదా.. మనకీ ఓ దారి ఏర్పరచుకోవాలి.. ఇంటికి ఓ ఆడదిక్కు కావాలి.. పిల్లవాడికి లాలన, పాలన కావాలి.. ఆలోచించండి ఆ విషయంగా’ అంటూ చెవిన వేశాడు. వెంకటాచలం కొంచెం లోకం కోసం వెరచినట్లు ముఖం పెట్టినా.. కళ్లు మాత్రం కాసింత మెరిశాయి ఆశతో. అది చాలు అనుకున్న శోభనాద్రి తనకు తెలిసిన చక్కని చుక్కల ఫొటోలు తన ముందుంచాడు.
వెంకటాచలం అన్యమనస్కంగా పైకి కనిపించినా.. అంతంగం మటుకు ఫొటోల్ని నిశితంగా చూస్తున్నాయి.. కళ్లల్లో ఆ కాంతి తెలుస్తూన్నది.. ఎంతైనా నడికారు వయసు వెంకటాచలంది.. అంగబలం, అర్థబలం పుష్కలంగా ఉన్నవాడు.. ఒంటరితనం ఎలా భరిస్తాడు, ఎంతకాలం ఉపేక్షిస్తాడు. పిల్లవాడ్ని తనని చూసుకోగలవారైతే అభ్యంతరం లేదంటూ తేల్చి చెప్పేసి. ఒక ఫొటో మటుకు ఉంచుకుని మిగిలినవి ఇచ్చేశాడు శోభనాద్రికి.
వెంకటాచలంని ఆకర్షించిన పిల్ల కుముదం ఆల్చిప్పల్లాంటి కళ్లు, కోటేరు ముక్కు, నల్లని కేశాలు, మంచి శరీర ఛాయ, పరిపుష్టమైన అంగసౌష్టవం. కానీ రెండవ పెళ్లివాడికి మొగ్గుతారా.. ఏమైనా లాభసాటి బేరం చేయాలి. ఇది శోభనాద్రి మేధస్సు చేస్తున్న మేథోమధనం. ‘అన్నగారు శిల్పంలాంటి శరీరాకృతి ఉన్న పాపనే ఎంచుకున్నారు. బాపూ బొమ్మ పట్టుపూల రెమ్మ.. అచ్చ తెనుగు ముద్దుగుమ్మా.. మీ ఇంటికి రాబోయే కూనలమ్మ. నట్టింట మీ మనసు ఆనందపరిచే అందాల రాసులమ్మ. కాకపోతే వారిది చాలా పేద కుటుంబం... మీతో సరితూగాలంటే.. మీ ఇంట ఊయల ఊగాలంటే మీరు కొంత కన్యాశుల్కం విదల్చాల్సి ఉంటుంది... అంటూ నానే్చస్తున్నాడు శోభనాద్రి.
వెంకటాచలం గొంతు విప్పాడు ‘చూడండి శోభనాద్రి మీరు ఈ సంబంధం కుదిర్చారంటే..’ అంటున్నంతలోనే శోభనాద్రి అడ్డు తగుల్తూ ‘మీరు సంపన్నులు.. మీరు గాని సంకల్పించారంటే వికల్పమేముంటుంది. వారిని సంతోషపరుస్తారు, నన్ను సత్కరిస్తారు..’ అనేశాడు. శుభస్య శీఘ్రం, నిస్సంకోచంగా పోయి రండి అంటూ వెంకటాచలం శోభనాద్రి చేతిలో పది వేల కట్ట ఉంచారు అడ్వాన్స్ క్రింద. అమితానందంతో గంతులేసింది శోభనాద్రి మేథ.
కుముదం కుడికాలు మోపింది కొత్త కోడలుగా, వెంకటాచలం చిటికెన వేలు గట్టిగా పట్టేసుకుని.. ఆ వెంటనే రాణివాసంలో ఇంటి పెత్తనం యావత్తు కలల రాణి.. కలువల నెలరాణి గుప్పిట్లో పెట్టేసి మళ్లీ విలాస జీవితంలోకి అడుగుపెట్టి భోగభాగ్యాల, సకల సౌకర్యాల తూలతూగుతున్నాడు వెంకటాచలం. తనని సుఖపెట్టే ఇల్లాలు అయితే వచ్చింది, కానీ తన కొడుకు అంకిత్ మాత్రం ఆయమ్మ చేతుల్లోనే ఎదుగుతున్నాడు. ఎదిగే అంకిత్‌ని కుముదం వెంకటాచలంకి నచ్చజెప్పి రెసిడెన్షియల్ స్కూల్లో చేర్పించింది. తనకి, భర్తకి మధ్య అడ్డుగోడగా ఉన్న మారుటి కొడుకు అంకిత్‌ని హాస్టల్‌లో ఉంచడంతో కుముదం స్వేచ్ఛా విహంగమై వెంకటాచలంతో సంసారం మొదలెట్టి ముగ్గురు మగ పిల్లలతో తన ఆస్థానం సుసంపన్నం చేసుకుంది.
కుముదంతో కలిగిన సంతానం కళ్లెదుట కదులుతున్నా వెంకటాచలం మనసు మాత్రం దూరమైన కొడుకు అంకిత్‌పైన.. మొదటి భార్య మైథిలి పైన మొగ్గు చూపటం మొదలెట్టింది. అది చూచాయగా పసికట్టి కుముదం మంచి మూడ్‌లో వెంకటాచలంతో.. కైకేయి దశరథుడిని వరమడిగినట్లుగా.. స్థిర చరాస్తుల విభజన విల్లు రాయించింది తనకి, తన పిల్లలకే చెందేటట్లుగా.. అంకిత్‌కి తన తల్లి ఆస్తి యావత్తు చెందేటట్లుగా.. ఇష్టపూర్వకంగా కాకపోయినా, భార్య ముచ్చట తీర్చటానికి అంకిత్‌ని పక్కన పెట్టేశాడు వెంకటాచలం.
కుముదం దృష్టిలో అంకిత్‌ని దూరం పెట్టాడు కానీ మనసులో అంకిత్‌కి, గతించిన మొదటి భార్య స్మృతులకి చేరువవుతున్నాడు. ఆ మానసిక సంఘర్షణలో వెంకటాచలంని, మనోవ్యాధి మంచమెక్కించింది... విశ్రాంతిగా ఉంటుందని పెరట్లో ఉన్న కుటీరంలోకి మకాం మార్చేసింది కుముదం. ఇంటికి ఎంతైనా పెద్దవాడు కనుక అంకిత్‌కి పెళ్లి ప్రయత్నాలు చేసింది కుముదం. తండ్రి కబురుపెడ్తే వచ్చిన అంకిత్ తనకి వేరే ఎవరినీ ప్రపోజ్ చేయవద్దని, తన ఆఫీసులోనే పని చేస్తున్న కస్తూరిని ప్రపోజ్ చేశాడు అంకిత్.. అదే విషయంపై కస్తూరు తల్లిదండ్రులని సంప్రదించి పెళ్లికి ఏర్పాట్లు మొదలెట్టింది కుముదం, అంకిత్ ఒకింటి వాడయ్యాడు. వైజాగ్‌లో ఆఫీస్‌కి దగ్గరగా ఓ ఇల్లు ఏర్పరచుకుని తను ఇనే్నళ్లుగా పోగొట్టుకున్న ఆత్మీయత కస్తూరి జతలో పొందుతున్నాడు. తను తండ్రిని తనతో రమ్మని పిలవనూ లేదు, తనుగా వెంకటాచలం కొడుకు దగ్గరకు వెళ్లనూ లేదు. ఇలా ఎవరి జీవితాలు వారివిగా కాలగతిలో ఐదేళ్లు ముందుకెళ్లింది. కుముదం పెద్దాడికి, తరువాత రెండవ వాడికి పెళ్లిళ్లు జరిపించింది మంచి సంబంధాలు.. తనే దగ్గరుండి చూసి.
వెంకటాచలం ఆరోగ్యం క్షీణించసాగింది. కుముదం గమనించి వెంకటాచలంతో అబ్బాయి అంకిత్‌ని పిలిపించమంటారా.. అంటుంటే కళ్లల్లో ఆనందం తొంగిచూసి అంతలో మాయమై తల అడ్డంగా తిప్పాడు వెంకటాచలం. ఎందుకైనా మంచిదని అంకిత్‌ని భార్యాపిల్లల్ని తీసుకుని వేసవి సెలవులకి రమ్మని ఫోన్‌లో కోడలుకి చెప్పింది. కోడలు వసుంధర అలాగే అత్తయ్యగారు తప్పకుండా వస్తామని చెప్పి మాట ఇచ్చింది.
ఈ లోపలే వెంకటాచలంకి, రాత్రికి రాత్రి సీరియస్ అయి హాస్పిటల్‌కి తీసుకువెళ్లారు.. వార్త తెలిసిన అంకిత్ ఫ్లైట్‌లో విజయవాడ వచ్చి డైరెక్ట్‌గా హాస్పిటల్‌కి వెళ్లి తండ్రిని సమీపించాడు. తన చుట్టూరా కుముదం సంతానం ఉన్నా కనిపించని ఆనందం.. అంకిత్‌ని, కోడలు మనవడ్ని చూసిన సంబరం ఎక్కువయి తట్టుకోలేక వెంకటాచలం గుండె ఆగిపోయింది. వారిని చూస్తున్న కళ్లు నిశ్చలమయి పోయాయి. వెంకటాచలం అంతిమ యాత్ర అంకిత్ చేతుల మీదుగా ముగిసిపోయింది. ఆ పది రోజులు తను దగ్గరే ఉండి వెంకటాచలం ఉత్తర క్రియలు జరిపి, వైజాగ్‌కి ప్రయాణం అవుతూ.. అంకిత్ కుముదం కళ్లల్లోకి చాలా ఆవేదనగా చూశాడు.. తల్లికి దగ్గర కాలేక తను, దగ్గరగా తీసుకునే ప్రయత్నమైనా చేయక కుముదం అలా మూగగా చూస్తూండి పోయారు.. కళ్లతోనే వీడ్కోలు చెప్పుకున్నారు. కోడలు మటుకు అత్తగారికి జాగ్రత్తలు చెప్పి ఆరోగ్యం చూసుకోండని సెలవు తీసుకుంది.
అలా ఇల్లు వదిలిన అంకిత్ మళ్లీ సంవత్సరం తిరక్కుండా.. పినతల్లి కుముదం అనారోగ్యం పాలైందని తెలిసి కస్తూరి ద్వారా.. ప్రయాణమయ్యాడు విజయవాడకి ఫ్లైట్‌లో. ఫ్లైట్‌లో ప్రయాణం కుదుపుల్లేవుగాని, తన మనసులో ముసురు కుదిపేస్తోంది తనని గతం. మారుటి తల్లికి తనెప్పుడూ చేరువ కావాలనుకున్నా తను ఎందుకో తన దగ్గర కాలేకపోయాడు, ఆమె అలాంటి ప్రయత్నం ఎన్నడూ చేయలేదు. చొరవ చూపలేదు. మా ఇద్దరి మధ్య దూరం అలాగే కొనసాగిపోయింది.. ఇక తమ్ముళ్లయితే సరేసరి.. తనని పరాయిగా చూసేవాళ్లు.. మరి నాన్నగారు చొరవ చూపేవారు కాదు. నిజానికి తనెంతో అలమటించాడు. పిన్ని తనని అక్కున చేర్చుకోవాలని.. లాలించాలని, అమ్మని మరిపించాలని.. కానీ అంతే ప్రాప్తి. ‘ఆశ’ ఆశగానే ‘నాలో.. లోలో’ కుమలసాగింది.
కుముదం పక్కమీద అటు ఇటు పొర్లుతూ, ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని చీకటిని చీల్చుకుని వెలుతురుకై విచ్చుకున్న కళ్లు వెతుకుతున్నాయి. సూర్యోదయమయింది.. చీకటి తెరలు తొలగించుకుంటూ సూర్యకాంతి భూగోళాన్ని ప్రకాశవంతం చేస్తోంది. ఆ వెలుగులో గోడకి నిలువెత్తున వేళ్లాడ్తున్న పటం.. ఆ పటంలో అంకిత్ తన అమ్మానాన్నల మధ్య దొరబాబులా చిరుహాసంతో వెలిగిపోతున్నాడు. కానీ తనకి పరిచయమైన నాటి నుండి చూస్తున్నా కదా.. తనని తలవంచే చూస్తూ తప్పించుకు తిరిగేవాడు.. తనూ ఎప్పుడు తనని నిలువరించలేదు. ఆప్యాయంగా పలకరించనూ లేదు. ఏమిటో.. నా అనుకున్న నా వారి పరిస్థితి అదే..
ఎవరి ఆస్తులు వారు దక్కించుకున్నాక.. తన కడుపున పుట్టిన పిల్లలు సైతం నాకదే చేస్తున్నారు. ఏదో వారానికో, పక్షానికో ఒకసారి కనిపించి, కనిపెంచిన తల్లి రుణమింతే అన్నట్లు ప్రవర్తిస్తున్నారు.. కమ్మని అమ్మతనం వారికి ఎంత పంచినా.. వారే తన సర్వస్వమని తను ఎంచినా.. పిల్లలు మటుకు ముభావంగా, ముక్తసరిగా మొక్కుబడి చెల్లించినట్లు పలకరించి వెళ్తున్నారు. తనకి శాస్తి జరగవలసిందే, తను అంకిత్‌కి అమ్మ ప్రేమ అందించక.. భర్త అభ్యర్థనని మన్నించక, అంకిత్‌ని దూరం పెట్టినందుకు ఇప్పుడు గతం భూతమై.. భవిష్యత్ అంధకార బంధురమై.. తనని అతలాకుతలం చేస్తోంది, అనాధను చేసింది తనని. అవునులే నాథుడు లేని మగువకింతకన్నా దొరికేది ఏముంటుంది - నిరాశ, నిస్పృహ.. ఇలా తలపోస్తూ తలపోస్తూంటే నిద్ర పట్టేసింది.. తెల్లారబోయే ముందు.. బారెడు పొద్దెక్కినా లేవలేదు. లేవాలనిపించలేదు కుముదానికి.
అంకిత్ భార్యాబిడ్డలతో కుముదంని సమీపిస్తుంటే.. కుముదంని వెన్నంటి, కంటికిరెప్పలా చూస్తున్న ఆయా తాయారమ్మ కుముదం ఆరోగ్యం పరిస్థితి, కొడుకులు, కోడళ్ల ఆలనా పాలనలా క్లుప్తీకరిస్తుంటే వింటున్న అంకిత్ కళ్లు చెమరిస్తున్నయ్.. చెమరించిన కల్లు అమ్మని అనే్వషిస్తున్నాయ్.. అడుగులు ఆత్రుపడ్తున్నాయ్ అమ్మని దర్శించడానికి.. అమ్మని స్పర్శించటానికి.. ఆ అలికిడికి సగం మెలకువలోకి వచ్చింది కుముదం.. ‘అమ్మా’ అన్న పిలుపునకు పూర్తి మెలకువ కొచ్చింది. అవును అదే గొంతు.. నిస్సందేహంగా అదే పిలుపు.. అదే ఆర్తి.. అదే.. అదే.. కుముదం భళ్లున కళ్లు తెరచి చూసింది.. అంకిత్ చేతుల్లో వొదిగి వుంది అమ్మ. అమ్మ కన్నీరు మున్నీరుగా వర్షిస్తోంది.. అంకిత్ తనని ఒడిలోకి తీసుకున్న చొరవకి, స్పర్శకి పులకించిపోతోంది. కళ్లల్లో ఆ మార్పు చూసి చలించిన అంకిత్ ఆవేశంతో కూడిన ఆర్తితో, ఆవేదనతో ‘అమ్మా.. మా అమ్మ తోడు.. అమ్మ కావాలి...’ ఇనే్నళ్లుగా ఆ గొంతులో ఆగిపోయిన ఆ కమ్మని పిలుపు గుండె గొంతుకలను దాటి పెదవి పైకి పాకి నా చెవులకు సోకింది..’ అనుకున్న కుముదం అంకిత్ ఒళ్లంతా తడిమి తడిమి ఆ చేతుల్లో శాశ్వతంగా వొదిగిపోయింది.. బలంగా బిగుసుకుపోయింది.
అంతే.. అంకిత్ గుండెలవిసేలా రోదిస్తూ వౌనంగా వుండిపోయాడు. అమ్మ గుప్పెడు గుండెలో నుండి తన పట్ల తొంగి చూసిన ప్రేమ.. ఆప్యాయతతో కూడిన ఆత్మీయ అనురాగం.. శిథిలమై.. శిలయై.. రగిలే తన గుండెలో.. అమ్మ అనురాగపు జల్లు ఎల్లవేళలా కురిసేలా పదిలపరచుకున్నాడు అంకిత్ శాశ్వతంగా -
మనసులో ముద్రించుకున్నాడు ఆ తీపి జ్ఞాపకాలను.. అమ్మతో గడిపిన అమృత గడియల్ని చెరగని రూపకాలుగా...

-ఆచార్య క్రిష్ణోదయ 74168 88505