AADIVAVRAM - Others

మనమే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవితంలో చాలా చిన్న విషయాలు మన దృష్టికి రావు.
వాటిని మనం పట్టించుకోం.
కాలేజీలో చేరిన వెంటనే మనం గంభీరంగా వుండిపోతాం. మన ప్రక్కన కూర్చున్న వ్యక్తిని మనం పలకరించం. ఇదే పరిస్థితి చాలా ప్రదేశాల్లో కన్పిస్తుంది.
అపరిచితులని పలకరిస్తే వాళ్లు సరిగ్గా అర్థం చేసుకోకపోవచ్చు.
కానీ
మనం చేరిన కాలేజీలోని వ్యక్తులని, మన కాలనీ వాసులని, మన ఫ్లాట్లలో నివసిస్తున్న వారిని, మనం కొత్తగా ఉద్యోగంలో చేరిన ప్రదేశంలో సహోద్యోగులని పలకరించడంలో జాప్యం అవసరం లేదు.
వాళ్లు పలకరిస్తేనే మాట్లాడదాం.
వాళ్లు నవ్వితేనే నవ్వుదాం.
వాళ్లు మనల్ని పొగిడినప్పుడే పొగడుదాం.
ఇలాంటి ఆలోచలని వదిలేసి మనమే ముందు పలకరిస్తే, చిన్న చిరునవ్వు నవ్వితే, చిన్న మంచి పని చేసినప్పుడు పొగిడితే-
చాలా బాగుంటుంది.
మనమే నాయకత్వం వహించాలి.
మనమే ఇతరులని ప్రభావితం చేయాలి.
*

మంగారి రాజేందర్ ‘జింబో’ 94404 83001