S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

బామ్మ మాట

మధు వొలకబోసె నీ చిలిపి కళ్లు.. అవి నాకు వేసె సంకెళ్లు.. పాట వినవస్తోంది. గాయక గళం రామకృష్ణది... అభినయం శోభన్‌బాబుది.. మధు వొలకబోసే చిలిపి కళ్లు సినిమాలో.. వాణిశ్రీవి. పావలా ఇచ్చి పాట వేయించుకున్న ఆ శోభన్‌బాబు విశాల్, తను చూస్తున్న ఆ కనె్న వధువు బహుశా ఏ వాణీయో మరి.
ఆమె వాణి వినిపించింది సర్వర్‌ని కేకేసి.. పావలా విసిరేసి ఏదో చెప్పింది.. అంతే పాట మారింది.. అందం చూడవయా.. ఆనందించవయా.. అంటూ సాగింది. పాట మారడంతో విశాల్ ఖంగుతిన్నాడు. ఈసారి తను సర్వర్‌ని పిలిచి మరో పావలా విసరబోయాడు. అయితే ఈసారి సర్వర్‌కి ఈ ఇద్దరి యుద్ధం అర్థమై బుర్ర గోక్కుంటూ ఆ ప్రాంతాల అగుపించలే. మేం కాలేజీ చదివే రోజుల్లో అంతగా ఈ టీవీలు, ఈ నెట్ విజన్లు లేని కాలంలో హోటల్స్‌లో ఇలా పాటలు ప్లే చేసేవారు పే చేస్తే. కానీ ఈ ఇద్దరి మధ్య పేచీ అర్థమయిన సర్వర్ సైలెంట్‌గా చాటయ్యాడు.
సర్వర్ పలాయనం చిత్తగించేసరికి ఈ ప్రేయసీ ప్రియులు ఇద్దరూ జారుకున్నారు అక్కణ్ణించి. ఇది ఇద్దరికి.. ఒద్దిక కోసం సాగే యుద్ధం.. ఎవరికి తెలుసు వాళ్ల ఈ యుద్ధం పైపైకేనని.. లోలోన ఒకరంటే ఒకరికి ఇష్టమేనని. ఆ తర్వాత ఇద్దరూ ఒకే బైకు మీద వెళ్తుంటే విస్తుపోయి చూస్తూండిపోయాడు సర్వర్ విశ్వనాథం.
చీకటి పడింది.. ఆకాశాన్ని మబ్బులు కమ్మేశాయి.. చీకటి మరింత చిక్కబడింది. అంతలోనే పెళపెళార్భాటాలతో విద్యుల్లత మెరుపులతో.. వర్షం హర్షం వ్యక్తం చేస్తూ, నల్లటి రాత్రికి కాంతులద్దుతూ.. ఏకాంతంలో నేను.. నా హృదయాంతరాలలో తాను.. జాబిల్లికి దూరమైన తారకి మల్లే-
ప్రేమ కడుపు నింపుతుందా.. పెద్దల మాట, ఒకప్పుడు చద్దిమూట.. కానీ ఇప్పుడు.. ఏదో అశాంతి అవరిస్తోంది హృదయాంతరాన్ని. మూడు తరాలకు సరిపోయే ఆస్తి ఉన్నా ప్రేమ లేక.. ప్రేమ ఫలించక.. ఆ జీవితాన ఆనందం దొరుకుతుందా? పెద్దల మాటకి.. ప్రేమికుల బాటకి పొంతన కుదరక మది స్వాంతన పొందుతుందా!!
ఎంత నిగ్రహించుకున్నా విశాల్ ప్రేమను కాదనుకోలేక పోతున్నాడు.. అలాగని తల్లిదండ్రులను నొప్పించ లేకపోతున్నాడు. ఒప్పించనూ లేకపోతున్నాడు. మస్తిష్కంలో మధనం.. అంతర్మధనం.. అనుదినం.. అనుక్షణం. ఏమైనా సరే ఈ వాతావరణానికి దూరంగా వెళ్లాలని నిశ్చయించుకున్నాడు విశాల్.
ఎంతటివారికైనా కాముడు ఆవహిస్తే మదిలో కలవరపాటు తప్పదు. కాముని ఆదరిస్తే కోలాహలం.. కాదని చరిస్తే హాలాహలం. శరీరంలోకి యవ్వనం.. మనసంతా వలపుదనం గుండెల్లో వలపు సందళ్లు చేస్తుంది. ప్రణయ జీవుల ఆరాధ్య దైవం మదనుడు.. కూకుండ నీడు కూసింతసేపు.. కుదురుండనీడు ఈడుతూ ఆడుకోకుంటె.. వగకాడు.. వలపులరేడు. ఈ పరిభ్రమణం పెద్దలకెలా చెప్పను.. మదిలో గుట్టు ప్రేమలో పట్టు.. పెద్దలకెలా గొంతు విప్పను. గుండెలో మాట గొంతు దాటి.. కట్టలు త్రెంచుకున్న ఉప్పెనలా.. సాగుతున్నా పెదవులపైనే ఆగుతోంది.. వెనుకకు మళ్లీ గుండెల్లో సుళ్లు రేపుతోంది..
తనపై ప్రేమ పెంచుకున్నవారు.. నాతో ప్రేమను పంచుకున్న వారి ముచ్చట వినరు.. నాలో రగిలే ప్రేమ విఫల జ్వాలను ఆర్పేదెవరు. ఆ దైవం నాపై పగబూనిందా.. నను సాధిస్తోందా.. శోధిస్తోందా.. విశాల్ ఎటూ తేల్చుకోలేక పోతున్నాడు. పెను తుఫాను తాకిడికి చిక్కుకున్న నావ చందాన తల్లడిల్లిపోతున్నాడు విశాల్. తల్లిదండ్రులు ఒకే మాటగా తెగేసి చెప్పారు తమని విడిచిపొమ్మని. విడివడని చిక్కు ప్రశ్న అయింది మా ప్రేమ.. ఎడతెగక పారే ఏరయ్యింది తనలో దుఃఖం.
ఎవరిని వరించాలి.. ఎవరిని త్యజించాలి.. త్రాసులో ఎవరికి ఎవరు తీసిపోరు. కిందికి మీదికి తూగుతున్నారు. ఒకపక్క తనకు పంచిన ప్రేమ.. మరోపక్క తనను పెంచిన ప్రేమ!! - ఎలా ఇద్దర్ని.. సమం చేయడం. కాలానికి వదిలేద్దామా.. కాలం ప్రేమని కాటేస్తే.. తలో ఇంటికి వేరైతే - అలాగని తల్లిదండ్రులని కాదని వేరై ప్రేమకి చేరువైతే.. ప్రశాంతంగా ఉండగలనా తల్లిదండ్రులను క్షోభపెట్టి. ఎటూ తేల్చుకోలేని విశాల్ మనసు తక్కెటలాగా కిందికి మీదికి తులలేక తూగుతూనే ఉంది.
ఎక్కడో చదివాడు తను.. ఇప్పుడు అనుభవంలోకి వస్తోంది.. మనిషి అప్రమత్తంగా జీవించేందుకు సూర్యుణ్ణి ఆదర్శంగా తీసుకోవాలి. సూర్యుడు సకాలంలో ఉదయిస్తాడు.. తగిన సమయానే అస్తమిస్తాడు.. సమయ పాలన అంటే అది - సూర్యుడెన్నడు సమయపాలన తప్పడు మేఘాలెంతగా కమ్మేసిన తన విద్యుక్తం తను తప్పక పాటిస్తడు - బాహ్యానికి ప్రకటితం కాకపోయినా ప్రకాశిస్తూనే ఉంటాడు. తన సమయానికి తను నిష్క్రమిస్తూనే ఉంటాడు.. అలాగే దిక్పాలకులు - నాలాటి మనిషి అపజయాలను పొందడంలో ముఖ్యంగా అప్రమత్తత లోపించడమే ప్రధాన కారణం.
ఇటుకపై ఇటుక పేర్చుకుంటూ పోతుంటేనే ఉన్నత భవనం రూపొందినట్లు.. ఒక్కొక్క సమస్యని ఎదుర్కొని పోతుంటేనే జీవన మార్గం సుగమమైనట్లు.. అంతే విశాల్ మనసులో స్థిరత్వం ఏర్పడింది. ఒక్కసారిగా దుఃఖం కాస్తా దూరమైంది.. తెప్పరిల్లిన తుఫానులా విశాల్ దృఢ నిశ్చయుడై ముందుకురికాడు.
పచ్చని దుప్పటి కప్పుకున్న కొండల్నీ లోయల్ని చూస్తూ వాటి మధ్యలో నుంచి గాల్లో తేలుతూ వచ్చే కాఫీ పరిమళాన్ని, యాలకుల తోటల సువాసల్ని ఆఘ్రాణిస్తూ. తల మీదుగా ప్రయాణించే మేఘాల్ని పట్టుకోవాలని ఆశపడుతూ ఎగిసిపడే జల్లులో తడుస్తూ ‘స్కాట్‌లాండ్ ఆఫ్ ఇండియా’గా పేరొందిన కూర్గు పరిసరాల్లో పర్యటిస్తుంటే కాలమే తెలియట్లేదు అనాల్సిందే యువతైనా.. వయసుడిగిన ముదుసల్లైనా..
కాఫీ తోటలు, సుగంధ ద్రవ్యాల మొక్కలతో నిండిన ప్రదేశం మధ్యలో ఉన్న జలపాతాల్ని ఎంత చూసినా తనివి తీరదు.. అంతే అనుభూతికి లోనవుతున్నాడు విశాల్ ప్రేమనే చూస్తూ.. క్రీగంట తననే చూస్తున్న విశాల్ని చూస్తూ వశం తప్పిపోతోంది ప్రేమ. క్రొత్త జంటకి హనీమూన్ ట్రిప్ మరి. ఏవేవో చిలిపి తలపులుకురుతుంటే అవి ఎలా ఎలా చెప్పాలో తెలియకున్నది ఆ వలపు కళ్లకి.. నాలుగు కళ్లు ఎప్పుడో రెండయినాయి, రెండు మనసులెప్పుడో ఒకటైనాయి.. ఎంచక్కా పక్కపక్కనే కూర్చున్న వెచ్చదనంలో.. ఒకళ్ల వొడిలో ఒకరు వెచ్చగా వొదిగిపోయారు జగతిని ఉన్నది మనమిద్దరమే అనుకుని.
కొండల్ని చూస్తూ, లోయల్ని చూస్తూ తన విహారం ప్రేమ యాత్ర చేస్తుంటే ఒద్దికైన వార్దిదరికీ సమయం ఇట్టే గడిచిపోయింది. ఈ లోకంలోకి వచ్చేసరికి చీకట్లు కమ్ముకొస్తున్నయ్. చిటపట చినుకులు టపటప మంటుంటే కారు బోనెట్‌పైన కారు తీసుకుని రివ్వున రోడ్డెక్కారు ప్రేమ విశాల్ ప్రేమనగర్‌కి. అదే హోటల్ సూట్‌కి.. అదే హనీమూన్ సూట్‌కి. సూట్‌లో ప్రవేశిస్తూనే గబగబ స్నానాదికాలు తెముల్చుకుని, డ్రెస్సప్పయి.. రెస్టారెంట్ వైపుగా నడిచారు కొత్త దంపతులిద్దరు కొంగు ముడి వేసుకున్నట్లుగా.. ఒకరిని ఒకరు పెనవేసుకుని. నీ అభిప్రాయమే నా అభిప్రాయమన్నట్లు.. తెచ్చిన డిషెస్‌ని డిన్నర్ చేశారు ఎంగిళ్లు పంచుకుంటూ.
అప్పుడప్పుడే చీకటి తెరలు తొలగి వెలుగు రేఖలు భూమిని పరచుకుంటున్నాయి.
నిన్న రాత్రి నలిగిన పూల సువాసన లింకా వెదజల్లుతున్నాయి విశాల్ మదిలో.. ప్రేమ హృదిలో.. అరమోడ్పు కన్నులతో ప్రేమ తనని అక్కున హత్తుకున్న సుందర స్వప్నంలా కళ్లల్లో కలికంలా అలుముకునే ఉంది. ఎదలోను అదే స్మృతి.. ఎదురుగాను అదే మూర్తి. అంతే ప్రేమని దగ్గరగా తీసుకుని తనివితీరా కళ్లతో కళ్లని జుర్రుతున్నాడు. తట్టుకోలేక ప్రేమ విశాల్‌ని ఇంకా దగ్గరగా తీసుకు హత్తుకుంది.
విశాల్‌ని.. స్లైడింగ్ విండోస్‌లో నుంచి కనువిందు చేస్తున్న ప్రకృతి దృశ్యాల్ని.. రెప్పలార్చి ఏమార్చి చూస్తోంది.. ఆ సందడిలో తానుంటె.. విశాల్ ప్రేమకి ఇచ్చింది ఎన్ని ముద్దులో - ఆ మదనుడికే ఎరుక.
ఇద్దరు నడుమ నలిగిన రాత్రి.. అర విరిసిన ప్రేమ పూలై.. రవ్వయి.. వెలుగుల దివ్వె అయి కాంతులు వెదజల్లుతుంటె.. కురులారబోసిన అందాలు అరవిందాలై తనలో తొందరలై.. ఊహలు దొంతరలై.. ముచ్చటగొలిపే.. మురిపెము ముద్దయి.. సద్దయి.. మూడు రాత్రులు ఇలాగే ఇక్కడే ఆగిపోతే ఎంత బాగుంటది.
ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు విశాల్, ప్రేమ. తిరుగు ప్రయాణంలో ప్రేమ విశాల్‌తో ‘అత్తయ్య మామయ్యలని ఎలా పెళ్లికి ఒప్పించావ్ విశాల్..’ అంటుంటే విశాల్ ప్రేమని దగ్గరగా తీసుకున ‘అది చిదంబర రహస్యం’ అంటూ దాటవేశాడు. ప్రేమ బుంగమూతి పెడ్తూ ‘నాతో కూడా రహస్యాలా..’ అంది గోముగా విశాల్ గుండెల మీద తలవాల్చి బస్సులో.
‘అలకల కొలికి అలకనందా.. అంత రహస్యం ఏమీ లేదు.. అమ్మా నాన్నలకు మా బామ్మంటే గురి.. బామ్మకి నా మీద గురి.. అందుకని బామ్మని వాళ్ల మీదికి గురిపెట్టా.. అంతే.. నెగెటివ్ కాస్తా పాజిటివ్ అయింది.. బామ్మ మాట మనకి బంగారు బాట. బామ్మని జాగ్రత్తగా చూస్కో.. ఏం.. అంటూ’ విశాల్ కొసరాడు ఆ చీకట్లో. చీకట్లో కలిసిపోయింది ప్రేమ విశాల్‌ల ముద్దు మురిపెం.. ఆ వైపుగా వెళ్తున్న చంద్రుడు విరిశాడు వీరిద్దరి ప్రణయం చూసి.. తారలు చంద్రుని చుట్టిన వేళ-

-ఆచార్య క్రిష్ణోదయ 74168 88505