AADIVAVRAM - Others

‘సజీవ శిలలు’ ఈ మొక్కలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ మొక్కలు చాలా దృఢంగా ఉంటాయి..
అంగారకుడిపై పెరుగుతాయి..
32,000 సంవత్సరాలు బతుకుతాయి..
అత్యంత తీవ్ర వాతావరణ పరిస్థితుల్లోనూ మనుగడ సాగిస్తాయి..
ఆశ్చర్యంగా ఉంది కదూ.. నిజమే! ఈ మొక్కలు అత్యంత కఠిన పరిస్థితుల్లో కూడా పెరుగుతాయి. వీటి అసాధారణ ప్రతిఘటన చూసిన శాస్త్రవేత్తలు వీటిపై పరిశోధనలు మొదలుపెట్టారు. ఆహార పంటలను పండించడంలో మన సామర్థ్యంపై వాతావరణ మార్పు ఎలాంటి ప్రభావం చూపుతుంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పంటలు ఎలా రూపాంతరం చెందుతాయి.. అనే అంశంపై పరిశోధనలు సాగిస్తున్నారు. అంగారక గ్రహంపై కూడా వేళ్లూనుకుని బతికేంత దృఢమైన రెండు రకాల మొక్కలను జర్మనీ శాస్త్రవేత్తలు గుర్తించారు. అవి లిచెన్స్, సియానో బాక్టీరియా. వీటిని స్విట్జర్లాండ్, అంటార్కిటిక్‌ల నుంచి వీటిని సేకరించారు. భూమిని ఆక్రమించిన తొలిజీవుల్లో ఇవి కూడా ఉన్నాయని ఆ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అప్పటి నుంచీ ఈ మొక్కలు జీవించి ఉన్నాయంటే ఈ జీవులు ఎంత బలమైనవో అర్థమవుతుంది. అరుణ గ్రహంపై ఉండే పరిస్థితులను గమనిస్తే.. నిలువునా చీల్చే సౌర అణుధార్మికత, తీవ్రంగా మారిపోతుండే ఉష్ణోగ్రతలు, అత్యధిక పొడి వాతావరణం, అతి తక్కువ వాయు పీడనం వంటివి ఉంటాయి. ఈ ప్రాచీన మొక్కలను పరీక్షించడానికి అరుణ గ్రహంపై ఉన్న వాతావరణాన్ని కల్పించి పరీక్షించారు. ఆశ్చర్యంగా ఈ మొక్కలు జాతులు కేవలం బతికి ఉండటమే కాదు.. కిరణజన్య సంయోగక్రియ(్ఫటోసింథసిస్)ను, ఇతర కార్యకలాపాలను కొనసాగిస్తూ ఇబ్బడి ముబ్బడిగా వృద్ధి చెందాయి కూడా..
తూర్పు కాలిఫోర్నియాలో ఉన్న బ్రిజిల్‌కోన్ పైన్ వృక్షాన్ని భూమిపై జీవించి ఉన్న వృక్షాల్లో అత్యంత వృద్ధ వృక్షంగా భావిస్తారు. 2012లో ఆ వృక్షం వయస్సు 5,062 సంవత్సరాలు అని గుర్తించారు. అంతకన్నా ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే.. మరింత దీర్ఘాయుష్షును సాధించడానికి కొన్ని చెట్లకు ఒక కిటుకు ఉంది. అదే క్లోనింగ్.. అవును.. ఈ చెట్లను వాటికవే క్లోన్ చేసుకుంటాయి. అలా క్లోన్ కాలనీలను ఏర్పాటు చేసుకుని జీవిస్తాయి. ఒకే మూలంతో అనుసంధానమై ఉండే జన్యుపరంగా సారూప్యత కలిగిన చెట్లు అవి. ఈ క్లోన్ కాలనీలు వేల సంవత్సరాలు మనుగడ సాధించగలవు. అమెరికాలోని యుటా రాష్ట్రంలో గల పాండో కాలనీ వయసు 80, 000 సంవత్సరాలని అంచనా. అలాగే కాలిఫోర్నియాలోని జురుపా ఓక్ కూడా 13,000 సంవత్సరాలుగా జీవిస్తున్నట్లు శాస్తవ్రేత్తలు భావిస్తున్నారు.
లిథోప్స్
లిథోప్స్‌ను ‘సజీవ శిలలు’ అని కూడా ఉంటారు. అలా ఎందుకు అంటారో అర్థం కావాలంటే వాటిని చూడాల్సిందే.. అవి ప్రాణులుగా కన్నా గులకరాళ్ల మాదిరిగానే కనిపిస్తాయి. కానీ ఆఫ్రికా దక్షిణ ప్రాంతంలో ఉండే ఈ అద్భుత జీవులు.. మారువేషంలో ఉన్న మొక్కలు. అతి తీవ్రమైన ఎడారి వాతావరణంలో, రాతి ప్రదేశాల్లో కూడా ఈ మొక్కలు మనగలవు. తమను తినేయకుండా ఉండటానికి రాళ్లలో రాళ్లుగా కనిపిస్తూ మారువేషంలో దాక్కుని ఉంటాయి. ఈ లిథోప్స్ ఎక్కువగా నేల కింద
పెరుగుతాయి. అయితే.. సూర్యకాంతిని స్వీకరించడానికి పారదర్శకమైన పై పొర వీటికి ఉంటుంది. ఇలా స్వీకరించిన సూర్యకాంతిని ఇవి శక్తిగా మార్చుకుంటాయి. భూమిపై ప్రకాశవంతమైన వెలుగును, నేలకింద తక్కువ వెలుగును.. రెండింటినీ ఇవి ఉపయోగించుకుంటాయి. దీన్ని బట్టి లిథోప్స్ సామర్థ్యాన్ని అర్థం చేసుకుంటే.. భవిష్యత్తులో మరింత సమర్థవంతమైన పంటను అభివృద్ధి చేయవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
కొకోవా
పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు.. సాధారణ కాఫీ గింజలను అంతమొందించేలా ఉన్నాయి. అయితే కాఫీ స్థానాన్ని భర్తీ చేయటానికి అంతకన్నా దృఢమైన మొక్క సిద్ధంగా ఉంది. అదే కొకోవా. వేడి వాతావరణంలో అరబికా కాఫీ రకపు మొక్క ఎంత కష్టపడుతోందో.. ఇటీవలి కాలంలో సెంట్రల్ అమెరికాలో కాఫీ తోటలను నేలమట్టం చేస్తున్న ఆకు తెగులుకు ఎంతగా గురవుతుందో శాస్తవ్రేత్తలు తమ పరిశోధనల్లో నమోదు చేశారు. ఉష్ణోగ్రతలు పెరుగుతోంటో.. దిగువ ప్రాంతాల్లోని తోటలు నాణ్యమైన కాఫీని ఉత్పత్తి చేయడం కష్టంగా మారుతోంది. ఫలితంగా వేలాదిమంది ప్రజల జీవనోపాధి కూడా ప్రమాదంలో పడుతోంది. దీంతో నికరాగువా, హోండూరస్, ఎల్ సాల్వెడార్‌లలోని రైతులు ఇప్పటికే కాఫీ బదులు కొకోవా సాగులోకి మారుతున్నారు. వేడి వాతావరణాల్లోనూ వృద్ధి చెందే బలమైన పంట ఇది. ఇలా మరికొన్ని సంవత్సరాల్లో ఉదయం కాఫీ స్థానంలో హాట్ చాకోలేట్ వచ్చినా ఆశ్చర్యపోనక్కర లేదు.

- సన్నిధి