S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

07/06/2019 - 18:36

రాలే వర్షపు నీటిచుక్క బీడును తడిపినా
మోడుపై చిలికినా ఆశలు ఫలియించునా.. ఆశయం చిగురించునా
జారే కన్నీటి చుక్క గుండె మంటలార్చునా..
మదినోదార్చునా.. ఊరట కలిగించునా..
ఎదలో దుఃఖం ఉపశమించునా..
శూన్యాకాశంలో తళుకుమనే తారకలు మాయమై
నిశీధిని తలపునకు తెస్తూ కటిక చీకటి నిండిన
జీవితమొక కథయై కలయై కదలని శిల్పమై
ఆశలుడిగిన మనిషి మనుగడ దుర్భరమై

07/06/2019 - 18:27

పిల్లలు బాగా చదవాలని, మంచి మార్కులు వస్తే ఏదైనా బహుమతిని ఇస్తామని చెబుతాం. వాళ్లకి అది ఒక ప్రేరణగా ఉంటుంది.
ఈ పరిస్థితిని మనమూ చిన్నప్పుడు చూసి ఉంటాం. చిన్నప్పుడు ప్రేరణ అవసరం. సహజం కూడా. అందరికీ అలాగే ఉంటుంది.
మనలో చాలామంది పెద్దవాళ్లు అయిన తరువాత కూడా ఇలాంటి ప్రేరణని కోరుతున్నారు. నిజంగా అది అవసరమా?

06/29/2019 - 22:47

పెన్నమ్మ ప్రక్క వూళ్లో శివాలయం
రతనాలనబడే రాళ్లసీమలో
ఆ వూరు ‘బంగరు’
పెన్నమ్మ ఎప్పుడూ ఇసుక చీర కట్టుకొని వుంటుంది
శ్రావణంలోనో, భాద్రపదంలోనో
బిడియపడి వచ్చే వాన చినుకులకు
ఏ పండక్కో పేరంటానికో అన్నట్టు
జల జలతారు కోక కప్పుకుంటుంది
నోరు తడుపుకోవడానికి నీళ్లు వెదకాలి
బావి తవ్వితే రాళ్లే కానీ నీళ్లేవీ

06/29/2019 - 19:49

ఆదిలాబాద్‌కు చెందిన అన్నారపు నరేందర్ గీసిన బొమ్మలు విలక్షణమైనవి, విశిష్టమైనవి. నైరూప్యంలో రూపం, రేఖల్లో జీవన వ్యథను క్యూబిజం ఛాయల్లో చిక్కగా చిత్రితమవుతాయి. ఒకే చిత్రంలో బహు చిత్రాలు (మల్టిపుల్ ఇమేజెస్) దర్శనమయ్యేలా బొమ్మలు గీయడం ఆయన ప్రత్యేకత. ఈ శైలిని అనుసరించే ఇతరులెవరూ మనకు కనిపించరంటే అతిశయోక్తి కాదు.

06/29/2019 - 19:44

సమానార్థకమైన తెలుగు మాటలు వెతికే సందర్భంలో నన్ను అమితంగా ఇబ్బంది పెట్టిన మాటలు కంప్యూటర్ రంగంలో కొల్లలుగా ఉన్నాయి. నేను 1968లో, సైన్సు విషయాలు తెలుగులో రాయటానికి మొదటిసారిగా ప్రయత్నం చేసినప్పుడు మొట్టమొదట కొరకరాని కొయ్యగా ఎదురైన సమస్య హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, ప్రోగ్రాం (hardware, software, program) అనే ఈ మూఢు మాటలకీ తెలుగు మాటలు ఏమిటన్న విషయమే!

06/29/2019 - 19:40

కొండ శిఖరాల్లో నివసించే గిరిజనుల బతుకులు మార్చేందుకు ప్రభుత్వం ‘అక్షర బ్రహ్మ’ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. పార్వతీపురం ఐటిడిఏ పీవో లక్ష్మిషా పీవోగా బాధ్యతలు చేపట్టిన తరువాత అంతరించిపోతున్న సవర భాష, సంస్కృతిని పరిరక్షించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

06/29/2019 - 19:00

నవ్వులాట కాదు
ఉన్న మాట
నలుగురి నోటా
నానుతున్న మాట
రోజూ మనిషి పయనిస్తున్న బాట
ఏ మోజూ లేని అయోమయం పాట
*
గృహిణి ఇచ్చిన కాఫీతో
గ్రహణం విడిచిన చంద్రుడిలా
విప్పారిన వదనంతో పేపరు విప్పితే
అత్యాచారం, అనాచారం
ఆర్తనాదం, పిడివాదం
వీటితో తల తిరగడం
*
ద్విచక్ర వాహనంపై
దిక్కులు చూస్తూ, ఏ వాహనం

06/29/2019 - 19:00

ప్రిన్సిపాల్ ప్రతిరోజూ ఒక విజన్‌ను ఎలా చెప్పగలుగుతాడన్న ప్రశ్న వస్తుంది. భారత రాజ్యాంగవేత్తలు ప్రజలతో మమేకమవ్వటం భావి భారతదేశం ఎలా ఉండాలో తమ యొక్క విజన్‌ను రాజ్యాంగంలో రూపొందించారు. మన రాజ్యాంగం భవిష్యత్తు నిర్మాతలకు ఆదేశం లాంటిది. ఆ ఆదేశాలు మనందరికీ ముఖ్యంగా కార్యోన్ముఖులైన ప్రిన్సిపాళ్లు తమ విజన్‌ను పిల్లలకు ప్రతిరోజూ చెప్పటానికి అదే మన సోర్స్‌మెటీరియల్.

06/29/2019 - 18:42

* చైనాలోని లీచెంగ్ కౌంటీలో సాయంత్రం ఒపెరా ప్రదర్శనకు చాలామంది కళాకారులు సిద్ధమవుతుంటారు. మేకప్ వేసుకునే దగ్గరి నుంచి స్టేజ్‌పై ప్రదర్శన ఇచ్చేవరకూ రోజంతా వీరితోనే గడిపాడు ఫొటోగ్రాఫర్ హాఫెంగ్ లీ. చైనాలోని లోస్ మైదానంలో స్థానికులు లోస్ పొరలో గుంతలు తవ్వి గుహల వంటి గదులను ఏర్పాటు చేసుకుంటారు. వీటిని యెడాంగ్లు అంటారు. ఇందులో వేడిని కాపాడే గుణాలు ఉంటాయి.

06/29/2019 - 18:39

టెర్రస్‌లో కూర్చున్నా.. బెడ్‌రూమ్‌లో పడుకున్నా.. కనుచూపు మేర పరుచుకున్న అనంత జలరాశి - సముద్రపు ఒడ్డున నిర్మించిన బంగ్లా అది. ఎకరం విస్తీర్ణంలో ఎంతో విశాలంగా, విలాసవంతంగా ఆధునిక సదుపాయాల సమాహారం ఆ భవన నిర్మాణం. భవనం చుట్టూరా పలురకాల ఫల పుష్పాదులు, కూరగాయల మళ్లు, కొంచెం దూరంలో గేదెలు, ఆవులు ఇంకా అనేక మూగ జీవాలు.

Pages