S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రతిపాదిత సవరణల విశే్లషణలు

రాజ్యాంగం అందరికీ ముఖ్యమైనది కాబట్టి, ఈ పుస్తకంలోని సమాచారం ప్రజలకు అమూల్యమైనదని మేము నమ్ముతున్నాము.
రచయితలు, వారిలో చాలామంది సుప్రీం కోర్టు మరియు హైకోర్టులలో న్యాయవాదులు. వారిలో ఒకరు శాసనసభ్యుడు. మేము రచయితల పరిచయంతో ప్రారంభిస్తాము. తరువాత ప్రభుత్వ అధికారులు మరియు అకాడెమీలోని వ్యక్తుల పుస్తక సమీక్షలు ప్రచురిస్తాము.
-ఎడిటర్
*
అవినీతిని నిర్వచించడం చాలా సులభం. దాని అర్థాన్ని లేదా ఫలితాన్ని అర్థం చేసుకోవడం కూడా సులభం కానీ మూసివేసిన తలుపుల వెనుక జరిగే విధానం వివరించడం లేదా అర్థం చేసుకోవడం కష్టం. రాజ్యాంగం మరియు వందలాది చట్టాలు వ్రాసినప్పటికీ మేలు చేయలేదని మీకు బాగా తెలుసు. మీరు యంత్రాంగాన్ని అర్థం చేసుకోకపోతే, దాన్ని పరిష్కరించడానికి మీరు ఒక పరిష్కారాన్ని ప్రతిపాదించలేరు. ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి గుణాత్మక ప్రకటనల కంటే పరిమాణాత్మకంగా దీనిని వివరించడానికి మనము ప్రయత్నించాలి. ఇటువంటి నమూనాను క్లిట్ గార్ట్ , మాక్లీన్ -అబరోరా మరియు పారిస్ అందిస్తున్నారు. అవినీతి యొక్క యంత్రాగాన్ని అర్థం చేసుకోవడానికి వారు ఈ కింది నమూనాను ప్రదర్శిస్తారు.
అవినీతి అంటే స్వలాభం కోసం పదవి దుర్వినియోగం చేయడం.
C=M+D-A
Corruption= Monopoly + Discretion- Accountability
అవినీతి = గుత్త్ధాపత్యం విచక్షణ- జవాబుదారీతనం వస్తువు లేదా సేవపై అధికారులకు గుత్త్ధాపత్యం ఉన్నప్పుడు (తరువాతి విభాగంలో వివరించబడింది. -అర్థం చేసుకోవడం కష్టం)
అపరిమిత విచక్షణ ఉంటుందో?
అంటే నిర్ణయాన్ని ఎవరూ ప్రశ్నించలేరని చెప్పడం. జవాబుదారీ తనం లేనప్పుడూ , ఆవ్యక్తి ఏవిధానంలో నిర్ణయిస్తున్నారో ఇతరులకు చెప్పవలసిన అవసరం లేనప్పుడు (ఇది అర్థం చేసుకోవడం కూడా కష్టం)
పైన పేర్కొన్న 3 కారకాలు సంక్లిష్ట పద్ధతిలో కలిసి పనిచేస్తాయి. ఫలితంగా పూర్తి అవినీతి జరుగుతుంది.
పౌరులు అధ్యక్షుడిని ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు.
అతను లేదా ఆమె ఎఫ్‌బిఐ వంటి ప్రభుత్వ దర్యాప్త్భుగాలను స్వతంత్రంగా ఉంచగలుగుతారు. అంటే అతను లేదా ఆమె సొంత పార్టీ అభ్యర్థులపై దర్యాప్తు జరిగిన వాటి వల్ల అధ్యక్షునిపై సద్భావం పెరిగే అవకాశం కూడా ఉంది.
ఎందుకంటే చట్టఅమలు స్వతంత్రంగా ఉండటానికి అనుమతించినందుకు క్రెడిట్ ప్రజలు ఇస్తారు. దర్యాప్తు శాఖతో ఎగ్జిక్యూటివ్ జోక్యం చేసుకోకపోవడానికి అధికార పార్టీ సభ్యులపై నేరారోపణలు మరియు వాటి వల్ల శిక్షార్హితులు కావటం సాక్ష్యంగా నిలుస్తాయి.
యుకెలో మాదిరిగా పార్లమెంటరీ ప్రభుత్వ రూపం ఉన్న దేశాలలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవినీతి ఆరోపణలు తీవ్రంగా ఉన్నప్పుడు రాచరికం జోక్యం చేసుకోమని కోరవచ్చు.
పైన పేర్కొన్న రెండు రకాల ప్ర భుత్వాల కంటే భారతీయ వ్యవస్థ చాలా ఘోరంగా ఉంది. రాష్టప్రతి , ప్రధానమంత్రి ఇద్దరూ పరోక్షంగా శాసనసభ్యులచే ఎన్నుకోబడుతారు. కాబట్టి ప్రభుత్వ దర్యాప్తు విభాగానికి తమవిధులను నిర్వర్తించడానికి ఎక్కువ స్వాతంత్య్రం లేదు.
పర్యవసానంగా అధికార పార్టీకి చెందిన సభ్యులు చట్టం గురించి లేదా పర్యవసనాల గురించి భయపడాల్సిన అవసరం లేదు. తమ పదవులను కొనసాగించడానికి ప్రధానికి , రాష్టప్రతికి తమ మద్దతు మరియు సద్భావం మంచి సంకల్పం అవసరమని శాసనసభ్యులకు తెలుసు.
పదవి పరిమితులు తప్ప మరేమీ భారతదేశాన్ని అత్యున్నత స్థాయికి చేరిన అవినీతి నుండి రక్షించలవు. అదనపు వివరాలు తరువాత విభాగాలలో ఇవ్వబడ్డాయి.
ప్రతిపాదనలు
1. ప్రధాని మరియు రాష్టప్రతి కాల పరిమితి
ప్రధానమంత్రి లేదా రాష్టప్రతి 2 పదవీ కాలాలు లేదా మొత్తం 10 సంవత్సరాలకు మించి సేవ చేయకూడదు. ఒక నాయకుడు 10 ఏళ్లల్లో గణనీయంగా దేశాభ్యుదయ పురోగతి సాధించలేకపోతే, అతను లేదా ఆమె ప్రధానిగా గొప్ప నాయకుడు కాకపోవచ్చు. అమెరికా అధ్యక్షుని పదవి 8 ఏళ్లకు మించకూడదు. టర్మ్ లిమిట్స్ ఉన్న డజన్ల కొద్దీ దేశాలు ఉన్నాయి. గొప్ప వ్యక్తులు ఉన్నప్పటికీ మీరు 10 ఏళ్లకు పైగా పదవి ఉండగలరని అనుకోవటంలో జరిగే మంచి కన్నా చెడే ఎక్కువ.
చాలామంది బలమైన మరియు సమర్థులైన నాయకులను కలిగి ఉన్న దేశానికి ఇది మంచిది కాదు. 15 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు పదవిలో ఉన్న నాయకుడు దేశాన్ని దెబ్బతీసి మానవ బలహీనతల కారణాల వల్ల పెద్ద తప్పులు చేయలేరని ఎటువంటి హామీలేదు. అంతేకాక
దోషులుగా తేలిన నేరస్థులనకు క్షమించే అధికారం రాష్టప్రతికి ఉంది. టర్మ్ లిమిట్స్ మెరుగైన పాలనను ఇస్తాయి. మరియు తద్వారా దేశాన్ని బలోపేతం చేస్తుంది. దేశంలో అత్యున్నత అధికారం ఉన్న ప్రధాని మరియు రాష్టప్రతి కి టర్మ్ పరిమితులు అవినీతిని ప్రభావితం చేయటం లేదా తొలగించడం ప్రారంభిస్తే ఇతర స్థాయిలలో టర్మ్ పరిమితుల అవసరం ఉండదు. కేంద్ర ప్రభుత్వం గవర్నర్ కార్యాలయాన్ని సిబిఐ వంటి ఏజన్సీలను ప్రస్తుత స్థితిలో ఉన్న యంత్రాంగాలతో రాష్ట్ర స్థాయిలో అవినీతిని ఎదుర్కోవటానికి ఉపయోగించవచ్చు. సంస్కృతంలో మూడు పదాలు ఉన్నాయి. వజ్రం వజ్రేనా భిద్యాతే అంటే వజ్రాన్ని కోయటం కోసం మీకు ఇంకో వజ్రం కావాలి. న్యాయం యొక్క ఆటంకం లేదా విధి నిర్లక్ష్యం వంటి దోషాలను ప్రధాని పైనా లేదా అధ్యయుడిపైనా అభియోగాలు మోపడానికి కమీటీలు లేదా బిల్లులు సహాయం చేయలేవు. నిజంగా కావాల్సినది ఏమిటంటే సమానంగా శక్తివంతమైన సంస్థ లేదా వ్యక్తి అది తదుపరి కొత్త ప్రధాని లేదా రాష్టప్రతి యొక్క అధికార మోహం అంటే విమర్శలను ఎదుర్కోవటానికి ఎటువంటి దారి లేక ధర్మమార్గాన్ని అనుసరించి పదవిని కాపాడుకోవాలనే ఆకాంక్ష .
ఒక ధనవంతుడు లేదా స్ర్తికి ఏదో ఒక రోజు అతను లేదా ఆమె మొత్త డబ్బును ఆస్తిని కోల్పోతా మరియు ఏమీ లేకుండా పోతారు అనే ఆలోచన భయభ్రాంతులను చేస్తుంది. అదేవిధంగా ఎవరికైనా కొంతకాలం తర్వాత కచ్చితంగా అధికారం పోతుందని మరియు ఇతరుల దయపై ఆధారపడవలసి వస్తుందనే భావన అధికారంలో ఉన్నవారికి భయానకమైన ఆలోచన ఈదేశానికి అదొక్కటే మిగిలిన ఆశ. అపెక్స్ కోర్టు అభిప్రాయం ప్రకారం కోర్టు ఆదేశాలు దేశంలో శిక్ష పడుతుందేమోనన్న భయం లేకుండా ఉల్లంఘించబడుతున్నాయి.
అనేక కారణాలతో యుఎస్ ఎ సహా అనేక దేశాలకు పరిమితులుంటాయి.
2. సబార్డినేట్ యొక్క ప్రాసిక్యూషన్స్ నిరోధించడానికి సుపీరియర్ అధికారిని అనుమతించడానికి న్యా య అనుమతి వేరే రాజకీయ వ్యవస్థ ఉన్న ఇతర దేశాల నుండి అరువు తెచ్చుకున్న సుపీరియర్ అధికారి అనుమతి అనే నియమం. ఈ చట్టం ఈ కింది కారణాల వల్ల భారతదేశానికి పని చేయవు. యుఎస్ ప్రెసిడెంట్ దీనిని తరచుగా లేదా అవినీతి వంటి చాలా ముఖ్యమైన సమస్యలపై ఉపయోగించలేరు. ఎందుకంటే ప్రజలు దీనిని గమనిస్తారు. మరియు పత్రికలల్లో ప్రశ్నలు అడుగుతారు. పార్టీలు మరియు వ్యక్తుల పట్లల అనుబంధాలు మరియు శత్రుత్వం భయం వంటి వివిధ కారణాల వల్ల ఇండియాలో పత్రికా స్వేచ్ఛ తక్కువ. అందువల్ల వారు నిజమైన దేశ ప్రయోజనాలకు ఉపయోగపడగలరా? అనేది ప్రశ్నార్థకం. అదే విధంగా అవినీతి ఆరోపణల విషయంలో బ్రిటిష్ ప్రధాని దీనిని ఉపయోగిస్తే రాచరికం బహుశా వివరణ కోరవచ్చు. భారతదేశంలో వివిధ కారణాల వల్ల అవినీతి సమస్యను రాష్టపతి అత్యున్నత స్థాయిలో పరిశీలించలేరు. వాటిలో ముఖ్యమైనది రాజ్యాంగం. జస్టిస్ కృష్ణఅయ్యర్ ఎత్తి చూపినట్లుగా మనకు ఉన్న పరిస్థితి నియంతృత్వ సమానస్థితి. నియంతృత్వ దేశాలలో మాత్రమే కాక అధికార అభిప్రాయం ఒక్కటే వారు చెప్పేది సత్యం అని చెబుతూ పని చేస్తుంది. లేదా మార్చాల్సిన అవసరం ఉంది. తద్వారా అత్యున్నత స్థాయిలో ఉన్నతాధికార సిట్టింగ్ సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తుల ప్యానెల్ యొక్క అమోదం తో మాత్రమే తన కింది అధికారి విచారణను ఆపటానికి వీలవుతుంది. మిగిలిన ప్రభుత్వాధికారులు తమకు ప్రమాదం కలిగించే రాకుండా ఉండడానికి తమ కింది అధికారి విచారణను అడ్డుకునే అవకాశం లేకుండా చేయాలి. అంటే ఆ అనుమతి యొక్క అవసరాన్ని తీసివేయాలి. చాలామంది అవినీతిని నిర్మూలించడానికి క్యాబినెట్ సభ్యులకు న్యాయ ఆమోదం మరియు మనం సమీకరణాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.
C= M+D-A
ఉన్నత స్థాయి కమిటీ సభ్యుల నండి పెద్దగా జోక్యం లేనప్పుడు సాధారణంగా బహుళ స్థాయి కమిటీలు మొదటి 2 కారకాల నుండి అవినీతిని తగ్గించగలవు. కానీ సబార్టినేట్‌ళను విచారించడానికి సుపీరియర్ అనుమతి అవసరం అనే నియమం ఈ విధానాన్ని పూర్తిగా పనికిరానిదిగా చేస్తుంది. పర్యవసానంగా అవినీతికి ఈ కారకాల సహకారం దాదాపు అనంతం.
ప్రధాని లేదా రాష్టప్రతిని ఎన్నుకునే పరోక్ష పద్ధతి వారు మంత్రులూ లేదా పరిపాలన యొక్క సీనియర్ సభ్యులపై ఎటువంటి చర్యలను ప్రారంభించకుండా చేస్తుంది. కనక జవాబుదారీ తనం మాటలో మాత్రమే ఉనికిలో లేదు. అందువల్ల దాని ప్రభావం లేదా ఫలితం సున్న.
నికర ఫలితం అపరిమిత అవినీతి ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పు

ప్రతిపాదిత సవరణలు
రాజ్యాంగంలోని 54, 57 మరియు 75 మరియు అవినీతి నిరోధక చట్టాన్ని మార్పు చేయాలని ప్రతిపాదించారు.
ఆర్టికల్ 54 రాష్టప్రతి ఎన్నిక
ఎ. పార్లమెంటు ఉభయ సభలలో ఎన్నికైన సభ్యులతో కూడిన ఎన్నికల కళాశాల సభ్యులచే రాష్టప్రతి ఎన్నుకోబడుతారు. మరియు
బి. రాష్ట్రాల శాసన సభలలో ఎన్నికైన సభ్యులు
ఈ కింది విధంగా ఉండాలి.
ఆర్టికల్ 54 రాష్టప్రతి ఎన్నిక
ఎ. పార్లమెంటు ఉభయ సభల్లో ఎన్నికైన సభ్యులతో కూడిన ఎన్నికల కళావాల సభ్యులచే రాష్టప్రతి ఎన్నుకోబడుతారు.
బి. రాష్ట్రాల శాసన సభలలో ఎన్నికైన సభ్యులు
రాష్టప్రతి ఎన్నికల్లో అర్హత గల సభ్యులు ఓటు వేయడం తప్పనిసరి. సరైన కారణం లేకుండా పాల్కొన్న కూడదని ఎంచుకున్న సభ్యులను ఎన్నికల సంఘం పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటించవచ్చు.
ఆర్టికల్ 57 తిరిగి ఎన్నికలకు అర్హత
ఈ రాజ్యాంగంలోని ఇతర నిబంధనలకు లోబడి అధ్యక్షుడిగా పదవిలోనున్న లేదా నిర్వహించిన వ్యక్తి ఆ కార్యాలయానికి తిరిగి ఎన్నిక కావడానికి అర్హులు.
ఈ కింది విధంగా సవరించాలి.
ఆర్టికల్ 57 తిరిగి ఎన్నికలకు అర్హత
ఈ రాజ్యాంగంలోని ఇతర నిబంధనలకు లోబడి, అధ్యక్షుడిగా పదవిలో ఉన్న వ్యక్తి, రెండు పూర్తి ఐదేళ్ల పదవి కాలపరిమితిని మించకపోమొత్తం మొత్తం పది ఏళ్లకు అనగా ఆ కార్యాలయానికి తిరిగి ఎన్నిక కావడానికి అర్హులు.
ఆర్టికల్ 75 మంత్రులకు సంబంధించిన ఇతర నిబంధనలు
ప్రధాన మంత్రిని రాష్టప్రతి నియమిస్తారు. మరియు ఇతర మంత్రులను ప్రధానమంత్రి సలహా మేరకు రాష్టప్రతి నియమిస్తారు.
ఈ కిందివిధంగా సవరించాలి.
ఆర్టికల్ 75మంత్రులకు సంబంధించిన ఇతర నిబంధనలు
1. ప్రధానమంత్రి ని రాష్టప్రతి నియమిస్తారు. మరియు ఇతర మంత్రులను ప్రధానమంత్రి సలహా మేరకురాష్టప్రతి నియమిస్తారు.
ప్రధానమంత్రిగా నియమించబడే వ్యక్తి ఆ పదవిని రెండు పూర్తి ఐదేళ్ల పదవి కాలపరిమితి లేదా మొత్తం పదేళ్ల పాటు మించి కలిగి ఉండకూడదు.

- ఆనంద్ గరికపాటి