S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నిరీక్షణ

కిటికీ తెరిచి ఆమె
ఎదురుచూస్తుంది
జాడ తెలియని నేస్తం
రాత్రి పగళ్లు వొక్కటే

అంతమెప్పుడు
ఈ నిరీక్షణకి

స్నేహం!
కనిపించకుండా వినిపించే
అజ్ఞాత కోయిలొకటి
జీవిత చెట్టుపై వాలి
సందడి చేస్తుంది
స్నేహం
దూరాలను చెరిపేస్తుంది!

విఫలం!
బువ్వ తింటుంటే
సరం పడింది
ప్రేమించిన చిన్నది
యాది చేసుకుందేమో
విఫలం
వెంటాడుతూనే ఉంది

జ్ఞాపకం!
చిరిగిపోయిన గతంలో
చెరిగిపోని సంతకం
ఆమె
ఇప్పటికి
గుర్తులతో గాయం చేస్తుంది
ప్రేమ
తీపే కాదు చేదు కూడా.
*

-పుష్యమీ సాగర్ 9010350317