S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

12/29/2019 - 23:45

నిలువెత్తు ‘నిర్భయాన్ని’ శిలువగా మోయటమే!
దూషణ, భూషణ, తిరస్కారాలను కవచాలుగా మలచుకోవటమే!
సత్యం ‘నిప్పుల కుంపటి’ శిరస్త్రాణంగా ధరించటమే
అవకాశవాద ఆర్భాటాలకు చిరునవ్వులు పొదగటమే
నిలువుటద్దంలో ముఖ కవళికలకు రంగులు దిద్దుకోవటమే
ముళ్లబాటపై చెప్పులు లేకుండా పాదయాత్ర చేయటమే
కళ్ల కాంతుల్ని తీక్షణ శరాలుగా మార్చుకోవటమే

12/29/2019 - 23:39

అబ్బో! వలపోత
ఒక సుదీర్ఘ జీవన చరిత్ర
దుఃఖం
మన పరిస్థితుల్లోంచి చూసి
నిర్ణయించేది కాదు.

చలనశీలి కాలం
దుఃఖం ముందు స్తంభించి పోతుంది
కొండలు మరింత ఘనీభవిస్తాయి
ఆకాశం ఇంకా శూన్యవౌతుంది
చెట్టూ చేమలూ పశు పక్ష్యాదుల
సమస్త చరాచర జగత్తు
ఒక శ్రుతిలో ధ్వనిస్తాయి.

12/29/2019 - 23:29

నా కోసం అంటూ ఏదీ పుట్టలేదు
ఏ భావాలు తెర తీయలేదు
దరి చేరని అనుభూతులకై
కొత్తగా ఆరాటపడ్డాను
వెలుగుని నింపుకొని
కలలని పండించాలని
కలలు కన్నాను అంతే...!

12/29/2019 - 23:22

ఔను
నేను నేనే
నాకు జీవం లేదు
ద్రవ్యరాశి కొలమానం ఉంది

నా సృష్టికి
మూలం శోధించినా
దొరకట్లేదు

నన్ను మాత్రం
విరివిగా విచ్చలవిడిగా
ఎక్కడపడితే అక్కడ
జుర్రుకుంటున్నారు

పైకి ఇసిరిన రాయి
గురుత్వాకర్షణ శక్తి కన్నా
ఎక్కువ నా ఆకర్షణ
న్యూటన్ నన్ను
పరిగణనలోకి తీసుకుంటే
ఇంకెన్నో విశేషాలు

12/28/2019 - 23:50

ఏదో సాధించాలన్న తపన..
ఇంకేదో కోల్పోతున్నామన్న ఆవేదన..
ఏవేవో కొత్త పరిచయాలు..
ఇంకెందరో కొత్త స్నేహితులు..
తెలియకుండానే సంవత్సరకాలం గడిచి..
మరో నూతన సంవత్సరంలోకి..
మరో నూతన దశాబ్దిలోకి స్వాగతం పలుకుతోంది కాలం..

12/28/2019 - 23:48

మరో రెండు రోజుల్లో మనం 2020లోకి ప్రవేశించబోతున్నాం. కానీ కొన్ని దేశాలు మాత్రం మనం 2020లోకి ప్రవేశించినా ఇంకా 2019లోనే ఉంటాయి. అది ఎలాగో.., కొత్త ఏడాది సంబరాలు అందరికంటే ముందు ఎవరు చేసుకుంటారో చూద్దాం..

12/28/2019 - 23:40

రివ్వున ఆకాశానికి బారులుతీరి ఎగిరే గువ్వల్ని.. చీకటిపడుతుంటే గూటికి చేరే గువ్వపిట్టల్ని.. టపటపమంటు నేలతల్లిని తాకే ప్రయత్నంలో సవ్వడిచేసే తొలకరి చినుకుల్ని.. తడిసిన మట్టిలో నుంచి అపుడప్పుడే మొలకలెత్తే మొలకల్ని.. బోసిబోస నవ్వులతో, బుడి బుడి నడకలతో పసివాడు కొట్టే కేరింతల్ని... వేసే తప్పటడుగుల్ని చూస్తుంటే లోకంలో అంతకంటే సంబరం, సంపద మరేది అనిపించదు నాకు.

12/28/2019 - 23:24

రాజ్యాంగం అందరికీ ముఖ్యమైనది కాబట్టి, ఈ పుస్తకంలోని సమాచారం ప్రజలకు అమూల్యమైనదని మేము నమ్ముతున్నాము.
రచయితలు, వారిలో చాలామంది సుప్రీం కోర్టు మరియు హైకోర్టులలో న్యాయవాదులు. వారిలో ఒకరు శాసనసభ్యుడు. మేము రచయితల పరిచయంతో ప్రారంభిస్తాము. తరువాత ప్రభుత్వ అధికారులు మరియు అకాడెమీలోని వ్యక్తుల పుస్తక సమీక్షలు ప్రచురిస్తాము.
-ఎడిటర్
*

12/28/2019 - 23:22

మదిని చొచ్చిన వ్యాకులత
సమస్యల వలయంపై వాలి
ముందుకెళ్లాల్సిన గమనానికి
అడ్డు సంకెళ్లు బిగిస్తుంది

ఎదను మొలిచిన బతుకు చింతన
విశ్వరూపాకృతిని పొంది
సంక్షోభపు పంట పండిస్తుంది

జీవనం బాధాతప్తమైన దారుల వెంట
పయనించాల్సి వచ్చిన విషమ స్థితి
వెంటాడి వేటాడి తరుముతుంది

12/28/2019 - 23:19

ఓ చట్రంలో ఒదిగిపోయి పని చేయడం తనకు కుదరదని, సంపూర్ణ స్వేచ్ఛను ఆస్వాదిస్తూ, ఆలోచనలను మధిస్తూ రంగుల పదనిసలు సాగించడం తనకెంతో ఇష్టమని శిల్పి, చిత్రకారుడు చిలువేరు మనోహర్ అంటున్నారు.

Pages