S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

దాచేస్తే దాగని సత్యాలు!

భారతదేశ చరిత్రను అధ్యయనం చేస్తున్నప్పుడు - నిజమైన చరిత్రను - గతకాలపు గాయాలు మళ్లీ మళ్లీ పచ్చి నిజాలు సెలవేస్తూనే ఉంటాయి. బహుళ జనానక సమాజంలో సర్దుబాటు స్వభావం పెంపొందించుకోవటం అత్యంతవసరం అని కాంగ్రెస్ నాయకుడు, గత కాలపు కాంగ్రెస్ ప్రభుత్వ విదేశాంగ మంత్రి అయిన సల్మాన్ ఖుర్షీద్ సెలవిచ్చారు. ది హిందూ పత్రిక వరుసగా వారం రోజులు ఈ సుభాషిత ప్రవచనాన్ని ఆకర్షకంగా ప్రచురిస్తూ వచ్చింది. కాబట్టి బహుజన దృక్పథం కూడా అనుసరించవలసి ఉంటుంది అని అర్థమవుతున్నది కదా! ఇర్ఫాన్ హబీబ్, సతీష్‌చంద్ర, ఎస్.గోపాల్, రోమెలా థాపర్‌లు మాత్రమే చరిత్రవేత్తలని భ్రమపడకూడదు. విల్‌డ్యురాంట్ అనే గొప్ప చరిత్రవేత్త 40 సంవత్సరాలు శ్రమించి (1935-1973) 11 సంపుటాలలో మానవ నాగరికత గాథ (డి స్టోరీ ఆఫ్ సివిలైజేషన్) ప్రకటించాడు. ఆయన ఇల్లాలు ఏరియల్ డ్యురాంట్ (1913-81 జీవితకాలం) ఈ మహాయజ్ఞంలో ఆయనకు సహకరించింది. ఈ జ్ఞానమేథ సంపుటాలలో మొదట సంపుటం ఆసియా ఖండానికి సంబంధించింది. ఈ సంపుటానికి ప్రతిష్ఠాత్మకమైన పులిట్జర్ బహుమతి లభించింది. అమెరికాలో అత్యంత ప్రాచుర్యం పొందిన గ్రంథ ప్రచురణ సంస్థ భారెస్ అండ్ నోబుల్ ఈ మహా ప్రయత్నాన్ని ఇట్లా శ్లాఘించింది.
‘విశ్వమానవ చరిత్ర, సంస్కృతులను సర్వ సమగ్రంగా, ఉత్తేజకరంగా మన సమకాలీన సమాజ జీవనంలో అందించిన అత్యుత్తమమైన, ఉత్కృష్టమైన ప్రయత్నం విల్‌డ్యురాంట్ చేశాడు. ఈ ప్రయత్నానికి సాటిరాగల మరో ప్రయత్నం లేదు. విల్‌డ్యురాంట్‌ను గూర్చీ, ఆయన 11 సంపుటాల మానవ నాగరికత ఇతిహాసం గూర్చీ తెలుసుకోవలెననుకున్న వారు వీకిపీడియాను (ఇంటర్నెట్) సంప్రదించవచ్చు.
భారతదేశానికి ముస్లిం పరిపాలకులు చేసిన ఘోర దురంత ద్రోహాలను విల్‌డ్యురాంట్ ఇట్లా ప్రస్తావించాడు. నిరుద్వేగంగా ఈ విషయాలను ఇప్పుడు మనం సమీక్షించుకోవాలి. ఔరంగజేబ్‌ను గూర్చి చెపుతూ కళాత్మక దృక్పథం వీసమెత్తు లేకుండా, గుడ్డిద్వేషంతో, స్వీయ మతాహంకార చర్చరావేశంతో, మతాంతరులు (విగ్రహారాధకుల) పరమ సౌందర్య కళాత్మక వారసత్వాన్ని పనిగట్టుకొని సర్వనాశనం చేశాడు. ఈ పని అర్ధశతాబ్దం పాటు కొనసాగించాడు. క్రూర కర్కశుడై తన మతాన్ని అభివృద్ధి చేస్తున్నానని పిశాచనర్తనం చేశాడు.
అయోధ్య రామజన్మభూమి భవ్య మందిరాన్ని పరిసంధులు కూల్చలేదట. అక్కడ దేవాలయం ఉందో లేదో స్థానిక సామంతులకు (రాజ ప్రతినిధులకు) తన అధీన పాలకులకు సెక్యులరిస్టులు చెప్పలేదట. హిందూ దేవాలయాలను, క్రైస్తవ ఆరాధనా స్థలాలను నేలమట్టం చేయవలసిందని తాఖీదులు పంపాడు. విగ్రహం (దేవతా మూర్తి)ని ఎక్కడ కనపడితే అక్కడ ముక్కలు చేయాల్సిందిగా ఆజ్ఞలు జారీ చేశాడు. హిందువుల పాఠశాలలు (విద్యాలయాలు) నామరూపాలు లేకుండా నాశనం చేయవలసిందిగా వెర్రి శివాలు (చిందులు) తొక్కాడు. ఒక్క సంవత్సరంలోనే (1679-80) 66 దేవాలయాలను కూలగొట్టాడు. ఒక్క అంబర్ సంస్థానంలోనే (రాజపుత్ర దేశం) చిత్తూర్‌లో 63 దేవాలయాలు ధ్వంసం చేశాడు. ఉదయపూర్‌లో 123 దేవాలయాల విధ్వంసానికి పూనుకున్నాడు. హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం, అవిముక్తమనీ, ఆనంద కాననమనీ, మోక్షధామమనీ విశ్వసించే వారణాసి (కాశీ)లో భారతీయులను తీవ్రంగా, క్రూరంగా పరిభవించాలని ఒక మసీదు నిర్మించాడు. మహమ్మదీయ మతాన్ని స్వీకరించని వారందరిపైనా పెనుభారపు పన్నులు విధించాడు.
ఔరంగజేబు క్రోధ ఘార్ణిత స్వీయ మతోన్మాదం వల్ల భారతదేశపు అపురూప కళా సౌందర్య రూపురేఖలు తరువాత తరాల వారికి చూడనోచుకోనివైనాయి. ఔరంగజేబు పరిపాలిత దుష్టుడెప్పుడు మరణిస్తాడా? అని అంగలార్చారు. కొందరు ముస్లింలు మాత్రం అతడు సాధుసత్వుడు, ముని అని ఆరాధిస్తారేమో కానీ, లక్షలాది ఇతర మతస్థులు అతడిని క్రూర రాక్షసుడుగా పరిగణించారు. అతడి పరిపాలనా కాలంలో రాజ్యం కనీవినీ ఎరుగనట్లు విస్తరించింది. దక్కన్ దాకా చొచ్చుకొని వచ్చింది. కానీ దానికి పునాదులు లేవు. ప్రజల ప్రేమాభిమానాలకు ఈ దుర్మార్గుడు నోచుకోలేదు. ఔరంగజేబు పరమ కిరాతక పాలనతో ఘోరాతి క్రూరకృత్యం హిందువుల పవిత్రాతి పవిత్రమైన కాశీ క్షేత్రంపై దండెత్తి దానిని మహమ్మదాబాద్‌గా పేరు మార్చాడు. జాట్‌లో, మధురలో తిరుగుబాటు చేయగా అక్కడి కేశవ దేవాలయాన్ని కూలద్రోశాడు. ఆ స్థలంలో ‘ఈద్గా’ నిర్మించాడు. ఖండేలా, ఉదయపూర్, చిత్తూరులలో, జోధ్‌పూరులలో విధ్వంసం ఇంతకు ముందే ప్రసక్తం. కొమరగిరి వేంకట భూపాలరావు పుస్తకం ‘మహామంత్రి మాదన్న’ చదవండి. ఔరంగజేబు క్రూరత్వం అవధి లేనిది అనిపిస్తుంది. గోల్కొండలో నట్టనడివీధిలో పట్టపగలు మధ్యాహ్నం అక్కన్న మాదన్నలను మత విరోధులు నరికి చంపగా, మూడు వారాల తర్వాత అక్కన్న మాదన్న శిరస్సులను ఔరంగజేబు షోలాపూర్‌లో ఏనుగుల చేత తొక్కించినట్లు భూపాలరావు కథనం. పాతకాలపు ఉత్పాతాలు, క్రౌర్యాలు, దౌర్జన్యాలు ఇప్పుడెందుకనవచ్చు?

-అక్కిరాజు రమాపతిరావు