AADIVAVRAM - Others

ఫైర్ (సండేగీత)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫైర్ అంటే... నిప్పు - కానీ,
ఈ రోజుల్లో మరో అర్థం గుర్తుకొస్తుంది. ఉద్యోగం నుంచి తొలగించినట్టుగా గుర్తుకొస్తుంది.
ఇప్పుడు ఎక్కువగా ఈ సందర్భంలోనే ఈ పదాన్ని ఎక్కువగా వాడుతున్నారు.
పూర్వం నిప్పుని కనుగొనక ముందు మనుషులు పచ్చి కూరగాయలని, పచ్చి మాంసాన్ని తినేవారట.
ఎప్పుడైతే నిప్పుని కనుక్కున్నారో అప్పుడే వాళ్ల జీవితం మారిపోయింది. జీవనశైలి మారిపోయింది. చీకటి నుంచి వెలుగులోకి వాళ్ల ప్రయాణం మొదలైంది.
నాగరికత కూడా పెరిగింది.
ఫైర్ అనేది మనలో కూడా ఉంటుంది. దాన్ని చెకుముకి రాళ్లతో రాజేసుకోవాలి,
ఈ భూమీదకు మనం ఎందుకు వచ్చామో తెలుసుకోవాలి. అర్థవంతమైన జీవితం కోసం మనం ఏం చేయాలో ఆలోచించాలి.
మనలో ఉన్న ఫైర్‌ని బయట మండించాలి.
ఫైర్ అంటే మనకు గుర్తుకు రావల్సింది ఉద్యోగం నుంచి తొలగించడం కాదు.
మనలో ఉన్న ఫైర్‌ని మండిస్తున్నామా లేదానని.

మంగారి రాజేందర్ ‘జింబో’ 94404 83001