S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

తనొక సైన్యం..!

ఇది గమనించావా!
నువ్వు పారేసుకున్న
బతుకు పుస్తకాన్ని
రెండు చేతులు ఎత్తుకున్నాయి!
ప్రతి పేజీకి పసుపు పూస్తూ..
కొత్త కాగితాలను శ్రద్ధగా చేరుస్తున్నవి!
తననూ.. నిన్నూ చూస్తుంటే..
ఆ మార్పు చైత్రాలనిలా
లిఖించాలనిపించింది!
రాత్రి వొలికిన నీ కన్నీటి కలలు
రెప్పల దారాల చివర సాలీళ్లై వేలాడుతుంటే..
ఆ వేకువ మిణుగురొచ్చి
చిటికెడు కాంతి పూసింది!
వేలు విడిచిన నీ ఊహలు
ఒంటరి నఖాలు దిగి
దిగుళ్ల నెత్తురు చిందుతుంటే...
ఆ పదాల పెదవులొచ్చి
సాంత్వన పలుకొకటి పూసాయి!
కుదించబడ్డ నీడలు
నీవైన నిజాల్ని మింగేస్తుంటే...
ఆ మోదుగ వనం
పిడికిలి బిగించింది!
లుంగలు చుట్టుకున్న
నీ పేగులు
ప్రశ్నల గుర్తులై మూలుగుతుంటే...
ఆర్ద్రతా స్వరం వాటికి జీవానద్దింది.
చీకటి కప్పుకున్న
దగా వస్త్రం
నీ ఆశల్ని
కబళిస్తుంటే..
ఆ చైతన్య శరం
నిప్పు కణికల్ని రాజేసింది!
నీకోసం...
తనింత చేస్తుంటే...
శూన్యమై వేళ్లాడుతావేం..!
ఇంకా అస్థిర అడుగులపైనే
నిలిచుంటావేం..
వెలుగు తోవ విచ్చుకుంటుంటే...
ఇంకా కనులు మూసుకుంటావేం...
స్వప్నాలు రెక్కల్ని ధరిస్తుంటే..!
నీటి కొంగొకటి దొంగలా
నీ వ్యక్తిత్వాన్ని మింగేయక ముందే
తనతో
ఎదురీత నేర్చుకో..!
మాటు వేసిన చొరబాటు పులి
నీ పొదరింట్లోకి కాలుమోపక ముందే...
కుందేటి తలకు
తనని
వాడి కొమ్ముగా మొలిపించుకో...!
నువ్వెవరని ప్రశ్నించే
ఎర్రటి సిరాను
తన గుండె ధైర్యపు కలంలో బంధించి...
నీదైన మెరుపు వాక్యమొకటి రాసుకో..!
సాహిత్యం కన్నా సన్నిహితుడెవరూ..!
పద్యం కన్నా చైతన్య సైన్యమేదీ..!
*

-డి.నాగజ్యోతి శేఖర్.. 9492164193