కరోనా
Published Monday, 9 March 2020కంప్యూటర్
వైరస్‌ని
మైక్రోస్కోప్‌తో
చూసే మహారాజులు
ఆధునిక యుగంలో
భయాన్ని
నూరిపోస్తూ
ప్రసంగాల హోరు
సందు దొరికితే
మంది తిండిపై
ఏడ్చే హ్రస్వ దృష్టిగాళ్లు
ఏ తిండిలో
ఏమున్నాయో ఎంతెంతపాలున్నాయో
ప్రొటీన్లు విటమిన్లు
ఎరుగని మహాసభాశీనులు
రాజ్యం నిండా
కరోనా విగ్రహాల పూజలు షురూ
మతరాజ్య హుంకారం
సామాన్య శాస్త్రం సాంఘిక శాస్త్రం
ఓనమాలు నేర్వని
సంస్కృత భాష శ్లోక తాత్పర్య బూతుని
లొట్టలు వేసుకునే రసికులు
వైరసా విగ్రహావిష్కరణల జాతరలో
ప్రపంచమంతా వైరస్ మందు కోసం
పరిశోధనల్లో మునిగి తేలుతుంటే
మనరాజ్యం భక్తి పూనకంలో
మునగమంటుంది
మొన్నామధ్య
భూతవైద్యం విద్య ఆరంభం
పసుపు కుంకుమ అణగారిన వర్గాల
రక్తం పుర్రెలతో
కరోనా పరారే అంటారేమో!!