AADIVAVRAM - Others

చిన్న మాట(సండేగీత)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతి చిన్న మాటకి విలువ ఉంది.
బలం ఉంది.
మనం చదివిన ఏదో చిన్న పేరాలోని అంశమో మనల్ని ప్రభావితం చేయవచ్చు.
ఓ కవితలోని రెండు చరణాలను మనకు స్పూర్తిని ఇవ్వవచ్చు.
ఓ ప్రకటనలోని అంశం కూడా మనల్ని ఆకర్షించవచ్చు.
ప్రతి చదువుకి
ప్రతి మాటకి
ప్రతి దయకి
ప్రతి ప్రార్థనకి
ప్రతి సంభాషణకి
ప్రతి సమావేశానికి ఎంతో విలువ ఉంది.
కొన్నిసార్లు మనకు సమయం ఉండకపోవచ్చు. భార్యా పిల్లలతో గడపటానికి రెండు నిముషాలే సమయం ఉండవచ్చు.
పర్వాలేదు.
రెండు నిముషాలైనా పర్వాలేదు.
చిన్నది ఏదైనా పర్వాలేదు. పెద్ద వాటి కోసం ఎదురుచూడటం కన్నా చిన్న వాటితో మొదలుపెట్టండి.
అవి పెద్దవాటి వైపు దారి తీయవచ్చు.
చిన్న సహాయం కూడా
పెద్ద సహాయం కావొచ్చు.

మంగారి రాజేందర్ ‘జింబో’ 94404 83001