విపత్తు(సండేగీత)
Published Sunday, 22 March 2020కరోనా వైరస్ మరణాలు, దాని తీవ్రత తెలిసినప్పటి నుంచి అందరిలో ఆందోళన మొదలైంది.
షేక్‌హాండ్ ఇవ్వాలంటే భయభ్రాంతులవుతున్నారు. దేనిని ముట్టాలన్నా ఆలోచిస్తున్నారు.
సాంఘిక దూరం (సోషల్ డిస్టెన్స్) మనుషుల మధ్య మొదలైంది.
ఎవరికి వాళ్లు శుభ్రంగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు.
తమలాగా ఎదుటివాళ్లు శుభ్రంగా ఉంటున్నారా లేదానన్న అనుమానం ప్రతి ఒక్కరినీ వెంటాడుతోంది. పరిశుభ్రత పేరు మీద మనుషులని దూరంగా వుంచలేం. రోజులు గడవవు. పనిమనిషి, డ్రైవర్ లాంటి వాళ్లు లేకుండా రోజు గడవదు.
అదేవిధంగా ఆఫీసులో కొలీగ్స్‌తో మాట్లాడకుండా క్షణం గడవదు.
మరి వారితో కనెక్ట్ అయ్యేది ఎలా?
కన్నులతో చూసి మాట్లాడవచ్చు.
చిరునవ్వుతో మాట్లాడవచ్చు.
మాట్లాడి వాళ్లతో కనెక్ట్ కావొచ్చు.
మెసేజీల ద్వారా కనెక్ట్ కావొచ్చు.
ఇలా ఎన్నో విధాలుగా కనెక్ట్ కావొచ్చు.
విపత్తులోనే మనిషిలోని చెడు కన్పిస్తుందని అంటారు.
విపత్తులోనే మంచిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం.
ఏ విపత్తు అయినా తాత్కాలికమే.
మానవత్వమే శాశ్వతమేమో..
కరోనాలో కరుణ చూపించాలి.
కరోనా చూపించదు..
మనుషులం మనం చూపించాలి.