S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లోకాభిరామం

11/30/2019 - 23:18

ఒకప్పుడు పట్నంలో కూడా ప్రతి దినం కొన్ని గంటలపాటు కరెంటు ఉండేది కాదు. పల్లెల్లోనయితే ఎన్ని గంటలసేపు ఉంటుందో చెప్పగలిగితే గొప్ప! పల్లెలకు కూడా పంటల పేరున కరెంట్ ఇస్తామంటున్నారట. పట్నమంటే పెద్దలంతా ఉండి వ్యవహారం నడిపే చోటు. ఎక్కడ కరెంటు పోయినా అక్కడ పోవడానికి వీలు లేదు. అక్కడ అంతా వెలుగే. నీడలు ఉండకూడదు. నేను రాజధాని ఢిల్లీలో ఉండగా డిప్లొమేటిక్ ఏరియా పక్కన ఉండే వాడిని.

11/23/2019 - 23:26

ఆయన ఎవరో వచ్చాడు. క్షమించండి డిస్టర్బ్ చేశాను అన్నాడు. నేను అదేమీ లేదు, అన్నాను. ఆ మాట నేను ఊరికే అనలేదు. నిజంగానే అన్నాను. నా సమయం నా చేతిలో వుంటుంది. నేను చేస్తున్న పని ఆపి తర్వాత మళ్లీ ఎప్పుడైనా చేయవచ్చు. ఇంటికి వచ్చిన వారితో గౌరవంగా మాట్లాడడం కనీస ధర్మం. నేను మరెవరు ఇంటికి వెళ్లను. అదేదో గర్వంగా చెప్పడం లేదు. ఎందుకోగానీ అలవాటు లేదు. ఉంటున్న బిల్డింగ్‌లో ఇరవయి ఇళ్లు ఉన్నాయి.

11/16/2019 - 23:16

విశ్వంలాగే భూమి కూడా ప్రాచీనమయినదని చైనా వారు నమ్మారు. కనుకనే మొక్కలు, జంతువుల అవశేషాలు గట్టిపడి దొరికితే అవి ఒకనాటి జీవులని గుర్తించడానికి వారికి ఏ రకంగానూ అనుమానం లేకపోయింది. రాళ్లను కూడా గట్టితనం, రంగు ఆధారంగా వారు విభజించగలిగారు. జేడ్‌ను వారు విలువయినదిగా గుర్తించారు. ఆ రాతితో అందమయిన విగ్రహాలను, వస్తువులను మలుచుకున్నారు. చైనాలో తరుచుగా భూకంపాలు వచ్చేవి.

11/16/2019 - 23:16

విశ్వంలాగే భూమి కూడా ప్రాచీనమయినదని చైనా వారు నమ్మారు. కనుకనే మొక్కలు, జంతువుల అవశేషాలు గట్టిపడి దొరికితే అవి ఒకనాటి జీవులని గుర్తించడానికి వారికి ఏ రకంగానూ అనుమానం లేకపోయింది. రాళ్లను కూడా గట్టితనం, రంగు ఆధారంగా వారు విభజించగలిగారు. జేడ్‌ను వారు విలువయినదిగా గుర్తించారు. ఆ రాతితో అందమయిన విగ్రహాలను, వస్తువులను మలుచుకున్నారు. చైనాలో తరుచుగా భూకంపాలు వచ్చేవి.

11/09/2019 - 18:34

మేము న్యాల శెనిగె బుడ్డలు అని పిలిచే వస్తు పదార్థాన్ని మీరేమంటారు మీకు అర్థమైందా. మేము వాటిని వేరుశెనగలు అని కూడా అంటాము. నేలలో కాస్తాయి కనుక నేల శనిగలు. వీళ్లకు కాస్తాయి కనుక వేరుశనగలు. తమిళనాడులో వాటిని వేర్ కడల్ అంటారు. మన దగ్గర కొంతమంద చెనిక్కాయలు అంటారు. హైదరాబాద్ ప్రాంతంలో పల్లీలు అంటారు. అన్ని అంటే అది ఒక్కటే కాదు. చిక్కులు కూడా పల్లీలే.

11/02/2019 - 19:32

ఒడుపు అనే ఈ మాట ఎంత మందికి గుర్తుందో చెప్పలేను. చేతులకు ఈ ఒడుపు ఉంది కనుకనే మనిషి జాతి మిగతా అన్ని జంతువులకన్నా అందులో మిగతా ప్రైమేట్స్ కన్నా చాలా ప్రగతి సాధించగలిగింది. మనిషికి సాంకేతిక నైపుణ్యం చేతనైంది. పనిముట్లు తయారుచేసుకునే శక్తి అలవడింది. పనిముట్లు తయారు చేయాలంటే, ఎంతో ఊహాశక్తి ఉండాలి. అంతకన్నా ముందు చూపు ఉండాలి.

10/26/2019 - 18:28

లెక్కలు ఎక్కడికి పోయినయో తెలియదు. జీవితంలోకి సాహిత్యం, కవిత్వం ప్రవేశించాయి. సౌందర్య పిపాస అంతకన్నా ఎక్కువ ప్రవేశించింది. పెయింటింగులు, నిర్మాణాలను పరిశీలించడం ఒక లక్షణంగా నిలబడింది. అందమైన ఫొటోలు తీయడం హాబీగా నిలబడింది.
లెక్కలు బయటికి కనిపించకుండా అని ఒక క్రమం ఉంటుంది. సౌందర్యంలో కూడా ఒక లెక్క ఉంటుంది. అది తిక్క కాదు. అసలు సిసలైన అంకెల మీద ఆధారపడిన లెక్క.

10/19/2019 - 18:35

తొమ్మిదవ తరగతి అయిపోయింది. పదవ తరగతి నుంచి ఆపైన చదవబోయే రంగాన్ని ఎంచుకోవాలి. పదవ తరగతిలో మొదటి రోజు మామూలుగా గడిచిపోయింది. మరునాడు ఉదయానికి ఆప్షనల్స్ ఎంచుకునే అప్లికేషన్ ఇవ్వాలి. మా బడిలో అయిదు ఆప్షన్స్ ఉండేవి. వాటిలో ఒకటయిన వ్యవసాయం చదువుకోవాలని నాకు గట్టి కోరిక ఉండేది. మేము వ్యవసాయదారులం అని చెప్పుకోవడానికి నాకు ఇప్పటికీ చాలా సంతోషంగా ఉంటుంది.

10/12/2019 - 17:33

మనిషికి చదువు, తెలివి, మనం, పట్టాలంటే తగిన వాతావరణం ఉండాలి. ఇంట్లో వాళ్లంతా ఒక రకంగా ఉంటూ పిల్లలను మాత్రం చదవండి అంటే వాళ్లకు అందులో రుచి కలగదు గాక కలగదు. కొన్ని కుటుంబాల సంగతి వేరు. బ్రాహ్మణులు అనగానే అందరూ దుమ్మెత్తి పోయడం బాగా నేర్చుకున్నారు. వాళ్లు వెనకటి ఏవో నేరాలు ఘోరాలు చేస్తే చేసి ఉండవచ్చు. కానీ మధ్యలో వాళ్లకు ఒక విషయం అర్థం అయింది.

10/05/2019 - 18:43

లోకాభిరామంలో చెప్పుకునే సంగతుల గురించి నేను పడుతున్న బాధ చాలా మందికి తెలుసు. అందరికీ కనీసం ఆసక్తికరంగా ఉండే సంగతులు అందించాలని ప్రయత్నం. నా జన్యుశాస్త్ర పరిశోధనలో భాగంగా కొంత మానవీయ శాస్త్రంలో ఆసక్తి కలిగింది. ఆ రకం సమాచారం మీకు కూడా అందించాలనిపించింది. నా వంతు నేను చేస్తున్నాను. తరువాత మీ ఇష్టం.

Pages