S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

బతుకులో భాగం

కంప్యూటర్లు నాలాంటి వాళ్లకు చాలా కాలం క్రితమే బతుకులో భాగంగా మారాయి. చాలాకాలంగా మాలాంటి వాళ్లు వాడుతున్న నా డెస్కుటాపు ఈమధ్యన పాడైంది. దాన్ని బాగు చేయడానికి నేను ఎక్కడికి వెళ్లను. నా కొడుకు వచ్చినప్పుడు ఇద్దరమూ కలిసి దాన్ని కొంత ఖర్చు పెట్టి మరమ్మతు చేశాం. అది బాగానే పనిచేయ సాగింది. మరీ పాతది గనుక కొన్నాళ్ల తర్వాత మళ్లీ సమస్యలు మొదలయ్యాయి. ఇక దాన్ని వదలక తప్పదని నాకు అర్థం అయింది. ఈలోగా మా వారు నా కోసం ఒక అరబ్బీ గుర్రం లాంటి ల్యాప్‌టాప్ తీసుకువచ్చాడు. ఐ సెవెన్ ఎనిమిదవ జనరేషన్ అని చెబితే మా కంప్యూటర్ మిత్రుడు రంజిత్ కళ్లు ఎగరేశాడు. మా ఆవిడ మరొక ల్యాప్‌టాప్ కొన్నది. అది కూడా ఇంచుమించు గుర్రమే. ఇంట్లో మొత్తం 3 ల్యాప్‌టాప్‌లు ఉన్నాయి. రెండు టాబ్లెట్‌లు ఉన్నాయి. 3 స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. ఒక కిండిల్ ఉంది. మొత్తానికి బతుకంతా కంప్యూటర్ల మయం అయిపోయింది. ఈ ఆలోచనలు ఇలా సాగుతుంటే నా ముఖం మీద సుడులు తిరిగాయి. అంటే ఫ్లాష్‌బేక్ అని అర్థం. గతంలోకి వెళ్లిపోయాను!
నేను పనిచేస్తున్న ఆఫీసులో ఇంజనీరింగ్ విభాగంలో ఒక పెద్ద ఆఫీసర్ వచ్చాడు. అతనికి ఒక సొంత డెస్క్‌టాప్ ఉంది. అందరికీ ప్రదర్శించాలని దాన్ని ఆయన తెచ్చి తన రూమ్‌లో పెట్టుకున్నాడు. నిజానికి ఆయనకు కూడా దాన్ని బాగా వాడడం రాదు. దానికి ఏదో తంటాలుపడుతూ ఉంటాడు. ఒకనాడు మా లాంటి ఒకరిద్దరిని చూసి కంప్యూటర్ తెలియని వాళ్లు అని అర్థం వచ్చేట్టు ఇంగ్లీష్ మాట అన్నాడు. నాకు ఈ ప్రపంచంలోని అన్ని విద్యలూ నేర్చుకోవాలని ఇవాళ్టికీ కోరిక ఉండేది. చాలా విద్యలు గురువులు లేకుండా నేర్చుకున్నాను కూడా.
సరిగ్గా అదే సమయంలో ఆఫీసులో ఒక కంప్యూటర్ కొన్నారు. అది ఏ విభాగం వారికి ఇవ్వాలి అన్న ప్రశ్న తేలిక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గదిలో పెట్టారు. ఆ ఫ్లోర్‌లో ఒక చివరన నేనుంటే మరొక చివరన ఆ గది ఉంటుంది. కనుక సాయంత్రం వేళల్లో నేను వెళ్లి ఆ కంప్యూటర్‌ను వాడడం మొదలుపెట్టాను. స్మార్ట్ఫోన్ వాడుతున్న వాళ్లకు చెబుతున్న విషయాలు విచిత్రంగా వినిపించవచ్చు. మా ఇంట్లో కొత్తగా కొన్ని 2 ల్యాప్‌టాప్‌లలోనూ సిడి డ్రైవ్‌లు లేవు. వాటి కన్నా ముందు ఫ్లాపీ డిస్క్‌లు అని ఉండేవి. వాటిల్లో నిజానికి మొదట్లో రెండు రకాలు ఉండేవి. అందులో ఒకటి పెద్దదిగా ఉండేది. కంప్యూటర్ను పనిచేయించాలంటే అటువంటి ఫ్లాపీని అందించి ఆ పని జరిపించాలి. కంప్యూటర్‌లో మొత్తం 40 ఎం.బి.ల మెమరీ ఉండేది. ఇక వర్డ్‌స్టార్ అని ఒక వర్డ్‌ప్రాసెసింగ్ సాఫ్ట్‌వేర్ ఉండేది. ఒక ఉత్తరం టైప్ చేసి దాన్ని సేవ్ చేయాలంటే వేరుగా చేయడానికి ఉండేది కాదు. కంప్యూటర్‌లో ఉన్న మొత్తం డాక్యుమెంట్లు మళ్లీ ఒకసారి సేవ్ అవుతాయి. అందుకు బోలెడు సమయం పట్టేది.
నేను ఆ కంప్యూటర్‌లో మొదట డిగ్‌డగ్ అనే ఆట ఆడడం నేర్చుకున్నాను. ఆ తరువాత టైప్ చేయడం మొదలుపెట్టాను. రేడియో కార్యక్రమాల వివరాలను పత్రికలకు పంపేందుకు కనీసం అయిదారుగురు కష్టపడి పనిచేసే వారు. అటువంటిది ఒక మనిషి ఒక గంటలో చేయగలిగే వెసులుబాటును నేను ఆ రోజుల్లోనే తయారుచేశాను. కంప్యూటర్ల వాడకం అట్లా మొదలైంది.
ఇంట్లో వాడుకోవడానికి ఒక గుర్రం లాంటి కంప్యూటర్ కొన్నాను. ఆ రోజుల్లోనే 19 అంగుళాల మానిటర్ కూడా కొన్నాను. ఫోటోషాప్ చాలా రకరకాల సాఫ్ట్‌వేర్ సంపాదించి వాడడం నేర్చుకున్నాను. ఫోటోషాప్ రానప్పుడు అల్డస్ అని మరొక సాఫ్ట్‌వేర్ ఉండేది. అన్నీ డాస్ అనే ఆపరేటింగ్ సిస్టం మీద పనిచేసేవి.
ఈలోగా విండోస్ వచ్చింది. కృష్ణ ఓబరాయ్ హోటల్లో ఆ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి నాకు కూడా ఆహ్వానం అందింది. అక్కడ టీషర్ట్‌తో బాటు 12్ఫ్లపీల విండోస్‌ను ఊరికే ఇచ్చేశారు. దాన్ని కంప్యూటర్‌లో ఇన్‌స్టాల్ చేయడానికి నాన్న కష్టాలు పడవలసి వచ్చింది. మొత్తానికి అటు ఇటు తిరిగి కంప్యూటర్ మీద మంచి పట్టు సాధించారు. గదిలో కంప్యూటర్ పెట్టుకున్న ఇంజనీరింగ్ ఆఫీసర్ తనకు ఏదైనా సమస్య వస్తే నన్ను పిలిచే సందర్భాలు రావడం మొదలైంది. అదొక సరదా! అన్నీ మనకే రావాలి. అన్నీ మనం చేర్చుకోవాలి.
మధ్యాహ్నం హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో నా పుస్తకం ఒక్కటి విడుదల చేయడానికి ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు. నిజం చెప్పాలంటే ఆ పుస్తకం అచ్చయింది. కొంత కాలం అయింది. కానీ నా మిత్రుడు లాంఛనప్రాయంగా దానికి విమోచన కార్యక్రమం పోనీ ఆవిష్కారం అవడానికి అభ్యంతరం లేదు. జరగాలని పట్టుబట్టాడు. నేను సరే అన్నాను. మొదట మాట్లాడుతూ ఆ ప్రచురణకర్త మిత్రుడు నా గురించి కొన్ని మాటలు చెప్పాడు. రచయితలు అందరూ కాగితాల మీద తమ రచన రాసిన ఇస్తారు. ఆ తర్వాత కంపోజింగ్ అనే టైపింగ్ జరుగుతుంది. అందులో తప్పులు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఆ తర్వాత పేజీలు తయారుచేసే డెస్క్‌టాప్ పబ్లిషింగ్ తంతు మొదలవుతుంది. బొమ్మలు పెట్టాలంటే అది మరొక తతంగం. కవర్ పేజీ ఇంకొక సమస్య. కానీ ఈ గోపాలం అనే రచయిత మాత్రం ఈ పనులన్నీ తనే చేసి అచ్చుకు ఇవ్వడానికి సిద్ధంగా పుస్తకం అందిస్తారు. ఇటువంటి రచయితలూ మామూలుగా ఉండరు అన్నాడా పెద్దమనిషి. సభలో ఉన్న మరెవరో మీరు టైపింగ్ కోసం కూడా కొత్త టెక్నాలజీని వాడుకోవాలి అని, సలహా ఇవ్వడానికి ప్రయత్నించారు. ఆ సందర్భంగా నేను ఒక మాట చెప్పాను. నేను చేతిరాత మానుకొని చాలా రోజులైంది. ఒక డి.టి.పి. ఆపరేటర్ వచ్చి నేను డిక్టేట్ చేస్తుంటే టైప్ చేసేవాడు. ఈమధ్యన తను రావడం లేదు. మిగతావాళ్లంతా నాకు సంతృప్తిగా పనిచేయలేకపోతున్నారు. కనుక నేను నా రచనలను ఏకంగా కంప్యూటర్‌కు డిక్టేట్ చేసి టైప్ చేసే పద్ధతిని వాడుతున్నాను. ఇప్పటికే నాలుగైదు పుస్తకాలు రాశానని ప్రకటించారు. నిజం చెబితే నమ్మండి. లోకాభిరామం పేరుతో మీరు చదువుతున్న ఈ వ్యాసాలు కూడా నేను కలంతో రాయను. టాబ్లెట్‌కు చెబుతాను. అది టైప్ చేస్తుంది. అక్కడో ఇక్కడో ఒకటి రెండు తప్పులు వచ్చినా రావచ్చు. వాటిని నేనే సరిదిద్దుకున్నాను. నాకు యూనికోడ్, అనూ టైపింగ్ కూడా చేతనవును. కనుక పరీక్షలు కూడా నేనే చేసుకుంటాను. రచయిత ప్రూఫ్‌రీడింగ్ చేయడంలో కొన్ని చిక్కులు ఉన్నాయి. వాటి గురించి చెప్పడానికి ఇది సందర్భం కాదు. మొత్తానికి టెక్నాలజీని వాడుకోవడంలో ఉన్న ఆనందం నాకు బాగా తెలుసు.
పుస్తకంలో బొమ్మలు పెట్టడం ఒక పెద్ద కళ. ఒకప్పుడు ఒక్కొక్క బొమ్మకు బ్లాకులు తయారుచేయవలసి వచ్చేది. ఇప్పుడు కొత్తగా వచ్చిన పద్ధతుల పుణ్యమా అని ప్రతి పేజీలోనూ బొమ్మ పెట్టుకున్నా కష్టం కాని పరిస్థితి వచ్చింది. నా పుస్తకాలలో బొమ్మలు అన్నీ నేనే ఎంపికచేసి అవసరమైన చోట ఏర్పాటు చేయడం నేర్చుకున్నాను. నీ పుస్తకాలు చాలా అందంగా ఉంటాయి. అన్న మిత్రులకు ఒక చిరునవ్వు మాత్రమే జవాబుగా దొరుకుతుంది తప్ప, నేను పడుతున్న బాధ గురించి వివరణ ఉండదు.
కంప్యూటర్ కేవలం రాతలకు మాత్రమే పనికొస్తుంది అంటే అది అర్థం లేని మాట. నా మిత్రుడు శ్రీనివాసన్ ఒకప్పుడు మీ దగ్గకు రావడం దండగ. ఎంతసేపు సబ్బు రుద్దుతూ ఉంటారు. అని చమత్కారంగా అన్నాడు. ఆయన చెప్పే సబ్బు మా చేతులలో ఉండే వౌస్ అన్నమాట.
పొద్దునే్న లేచి కంప్యూటర్ వేస్తే ముందుగా మెయిల్ చూడాలి. గూగుల్ లేనప్పుడు యాహు మెయిల్ చాలా గొప్పగా ఉండేది. అందులో ఆలం అనే పేరుతో నేను మెయిల్ బడి తయారుచేసుకున్నాను. ఆ తరువాత ఒక సమయంలో నాకు మొత్తం 13 ఈమెయిల్ ఐడిలు ఉండేవి. ప్రపంచంతో ఉత్తరప్రత్యుత్తరాలు నడపడం చాలా సులభంగా మారింది.
కొంత కాలం తర్వాత కంప్యూటర్లో సంగీతం అన్న అంశం మొదలైంది. నా దగ్గర ఉన్న కాసెట్లు మొత్తం కంప్యూటర్‌లోకి మార్చేశాను. శ్రీనివాసన్ కాసెట్లు కూడా అన్నీ తెచ్చి బోలెడంత కర్నాటక సంగీతాన్ని కంప్యూటర్‌లో ఎక్కించాను. ఆ తర్వాత సంగీత ప్రియ వచ్చింది. అక్కడ చాలా మంది మిత్రులు వచ్చారు. వాళ్లు నాకు టెక్నాలజీ పరంగా ఎంతో సాయం చేశారు. కాసెట్లు, రికార్డులలోని సంగీతాన్ని కంప్యూటర్‌లోకి మార్చడం, రికార్డింగ్‌లో నాణ్యత పెంచడం మొదలైనవన్నీ నేర్చుకున్నాను. వీడియో ఉంటే అందులోంచి కేవలం పాటలు మాత్రం బయటకి తీసే విద్య కూడా చాలా కాలం క్రితమే నేర్చుకున్నాను. వీడియో ఎడిటింగ్ నేర్చుకున్నాను.
ఈనాడు టెలివిజన్‌లో నేను చాలా కార్యక్రమాలు చేశాను. కానీ అప్పటికి ఇంకా కంప్యూటర్‌లో వీడియో ఎడిటింగ్ అన్న పద్ధతి రాలేదు. ఆడియో రికార్డింగ్ మాత్రం కంప్యూటర్‌లో చేసి మాటలను వీడియోతో జతపరిచే పద్ధతి అప్పటికే వచ్చింది. అని నేను చాలా బాగా చేసేవాడిని అని అక్కడి టెక్నీషియన్లు కూడా అన్నారు.

-కె.బి.గోపాలం