S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లోకాభిరామం

08/11/2018 - 21:41

ఎందుకు దొంగచాటు వ్యవహారం? రహస్యం కనుక. దాచవలసిన విషయం కనుక. తరచుగా మూడవ కంట పడకుండా అన్యాయంగా జరగవలసిన వ్యవహారం కనుక.

08/04/2018 - 20:52

కాలం రాయడం అంటే అందులో అన్ని విషయాలు ఉన్నాయి అని ఎంతమంది అనుకుంటారో తెలియదు. రాసేవారికి అది తప్ప ఇంకొక పని తెలియదు. చదివేవారికి హాయిగా చదవడం తప్ప రచయితలు పడే బాధలను గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. కానీ నిజంగా పత్రిక అంత అందంగా తయారయి తమ చేతిలోకి వచ్చింది అంటే దాని వెనుక ఎంతమంది కృషి ఉంది అన్న సంగతిని అందరూ గమనిస్తే ఎంత బాగుండును.

07/28/2018 - 18:20

మొన్న ఒక సాహిత్య సభకు వెళ్లాను. వేదికను అలంకరించవలసిన ఐదారుగురు నిజంగా పెద్ద మనుషులు. వయసులో కూడా పెద్దవాళ్లు. ఒకరు తప్ప మిగతావారంతా ముందే వచ్చి కూర్చున్నారు. ఇక హాలులో ప్రేక్షకులుగా వచ్చినవారిలో సగంమంది వేదికమీదకు వెళ్లి మాట్లాడగలిగిన మనుషులే. ఒకప్పుడు సాహిత్య సభలకు నావంటి మామూలు మనుషులు వెళ్లి ఎవరు లో కూర్చుని చేతనయింది విని కాసింత గోలచేసి వచ్చేసేవాళ్ళం.

07/21/2018 - 20:40

అథాతో ఆత్మజిజ్ఞాస అంటున్నది మన పద్ధతి. పరబ్రహ్మంతో పనిలేదు. ముందు మన గురించి మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు సర్వేభద్రాణి పశ్యంతు అన్న మాట ప్రకారం అందరూ హాయిగా ఉండగలుగుతారు. ఇంతకూ కథం ఇదం ఆత్మా? ఈ నేనంటే ఎవరు? ఈ మనిషి అంటే ఎవరు? ఈ మనిషికి గుర్తింపులు ఏమయినా ఉన్నాయా? ఇలాంటి ఆలోచనలు ముందుకు సాగాలి.

07/14/2018 - 22:38

అరిసి కూట్టు అత్తా మగనే, నీ కూట్టుంబోదు వెలిక్కవిల్లియో, అని ఒక తమిళ సినిమా పాట. పాపము శపించుగాక. కొంతమందికి అర్థం తెలియలేదని నాకు తెలిసింది. బియ్యం దంచే అత్తకూతురా (బియ్యం దంచేది అత్త అనుకునేరు గనుక. సాక్షాత్తు అత్తకూతురే దంచుతూ ఉంటుంది!) (మధ్యలో మాట దారి మళ్లిందా? మళ్లా క్షమించండి..) అత్తకూతురా దగ్గర కదూ అన్నాము. పాటలోనండీ! నీవు దంచుతుంటే నొప్పి పుట్టలేదా?

07/01/2018 - 02:14

ప్రతి కుటుంబంలోను వాళ్లకు మాత్రమే అర్థమయ్యే మాటలు, జోకులు కొన్ని ఉంటాయి. మా ఇంట్లో కూడా మామూలుగానే మాటలు, జోకులు కొన్ని ఉన్నాయి. కొత్తగా తెలియని తిండి పదార్థం ఏదో ఒకటి ఒకనాడు బల్ల మీదికి వచ్చినట్టుంది. మా అమ్మాయి ‘దీన్ని ఏమంటారు?’ అని అడిగింది. మామూలుగానే సరదాగా మాట్లాడే మా అబ్బాయి చటుక్కున ‘ఏమీ అనరు! తింటారు!’ అన్నాడు.

06/24/2018 - 00:35

శ్యాంబజార్ నుంచి బొన్‌హుగ్లీ వెళ్లాలంటే బస్‌లో పోవచ్చు. బొన్‌హుగ్లీకి వెళ్లాలంటే డన్‌లప్ వెళ్లే బస్ ఎక్కాలి. అక్కడ నుంచి మరింత ముందుకు సాగితే, దక్షిణేశ్వర్, బేలూర్ రామకృష్ణ మఠం వస్తాయి. అయితే మనం అంతదాకా వెళ్లడం లేదు. బొన్‌హుగ్లీ కూడా రాకముందే ఒక స్టాప్ వస్తుంది. బస్ ఎక్కిన వాళ్లు కొందరు ‘ఒనొన్నొ’ అని చప్పుడు చేయడం విన్నాను.

06/16/2018 - 23:29

ఆయననె్నవరినో ఒక పెద్ద మనిషి పట్టుకోని, నీకు ఇంత తెలివి ఎక్కడిది, అది అడిగినారంట. అందులో రహస్యం ఏముందీ? తెలియని సంగతులన్నీ ఎవరినో అడిగి తెలుసుకున్నాను, అని తేలిగ్గా కొట్టిపడేసి అమాయికంగ చూసినాడు ఆ పెద్దాయన. నేను కొంతకాలంగ, అంటే కొన్ని సంవత్సరాలుగ ఒక నియమం పెట్టుకుని బతుకుతున్నాను. వీలయినంత వరకు నేను ఎవరినీ ప్రశ్నలు అడగను. ఎవరయినా ఏదయినా చెపితే వింటాను. చెప్పని సంగతులను గురించి పట్టించుకోను.

06/10/2018 - 00:24

నోట్లో దంతాలుంటాయి. వాటిని కొంతమంది పళ్లు అంటారు. మరి కొంతమంది పండ్లు అంటారు. మాట్లాడేది ఒకే దంతం గురించి అయితే దాన్ని పన్ను అనాలి. పన్ను అని మరి ఇంకో మాట ఉన్నది. ప్రభుత్వానికి, మరొకరికి కట్టే రుసుము మొత్తాన్ని పన్ను అంటారు. జుట్టు పెంచుకుంటే పన్ను గట్టాలని ఒక ప్రభువు అన్నాడు. నా అంత నేను కష్టపడి అంతోయింతో సంపాదించుకుంటే, దాని మీద పన్ను గట్టమంటారు నేటి ప్రభువులు.

06/02/2018 - 23:18

అయిదారు వారాల కింద, జపాన్ గురించి కూడా చెప్పాలని నాకు నేనే మాట యిచ్చుకున్నాను. కలం చేతబట్టుకుని కూచుంటే ఏం రాయాలి? అని ప్రశ్న. వంద సంగతులు ముసురుకుంటాయి. అనుకున్న సంగతి మరుగున పడుతుంది. కనుక ఉన్న జపాన్ పుస్తకాలన్నీ కనిపించేట్టు పెట్టుకున్నాను. ఉన్నమాట చెప్పాలి. అన్నీ ఇంగ్లీషు ద్వారా చదవవలసిందే. కొనిచినా, సయొనారా తప్ప మరొక ముక్క తెలియదు.

Pages