S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లోకాభిరామం

03/23/2019 - 18:44

ఆయన ఇంకొంచెం తక్కువ చదువుకుని ఉంటే, అంతులేనంత బాగా చెప్పగలిగేవాడు - ఛార్ల్స్ డికెన్స్
నిజమే, అవసరమయిన మేరకు మాత్రమే మాట్లాడడానికి మరీ ఎక్కువ తెలివి అడ్డు తగులుతుంది.
* * *
మనిషి ప్రత్యేకతల గురించి ఎంత చెప్పినా తరిగేట్లు లేదు. తప్పేముంది గనుక ముందుకు వెళదాము. ఎక్కిళ్లు ఎందుకు? అని ఎప్పుడయినా అనుమానం వచ్చిందా?

03/16/2019 - 18:11

చరిత్ర రాయడం చాలా సులభం. కానీ రాసిన తరువాత దాని నుంచి ఏదయినా తెలుసుకోవాలి. తేల్చుకోవాలి అంటే మాత్రం చాలా కష్టం. -వాల్తర్ నెర్న్‌స్ట్. ఈయన జర్మనీకి చెందిన వైజ్ఞానికుడు.
* * *

03/09/2019 - 22:44

విషయానికి రాగలగడం చాలా గొప్ప విషయం - మెక్ లియోడ్ జి ప్రెస్టన్ (ఈయనగారెవరో తెలియదు. కానీ చాలా గొప్ప మాట అన్నారు.)
* * *

03/09/2019 - 22:43

-రాతి మీద కాలి గుర్తులా? ఎంత బాగుంది! ఎంత వింతగ ఉంది! అన్నాడట ఎడ్వర్డ్ హిచ్‌కాక్. ఈయన సినిమాల మనిషి కాడు. అతను వేరు. పేరు ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్.
* * *

02/23/2019 - 19:05

పాట విని చాలా బాగుంది అంటుంటారు. బాగా పాడారు అంటే ఏమిటి అర్థం? ఆ పాట అంతకు ముందే మరెవరో పాడి ఉంటారు. దాన్ని మరొకరికి నేర్పించి ఉంటారు. లేదా ఈ పాడిన వారు ఆ పాట విని మాత్రమే పాడి ఉంటారు. అటువంటి పాట బాగుంది అంటే అందులో అర్థం, అంతరార్థం ఏమిటి? నన్ను అందరూ కోడిగుడ్డు మీద అదేదో చేస్తున్నాడు అని తప్పు పట్టకండి గాని, కొంచెం నా మీద సానుభూతి చూపి ఈ ప్రశ్న గురించి ఆలోచించండి.

02/16/2019 - 18:31

పల్లె బతుకులో పాటకు ప్రధానమైన స్థానం ఉంది. అక్కడ అడుగడుగునా పాట వినిపిస్తుంది. వ్యవసాయ కార్యక్రమంలో పాట లేనిదే ఏ పనీ జరగదు. నాట్లకు పాట, కలుపులకు పాట, పంట కోతలకు పాట, బంతి కట్టేందుకు పాట, బాయి నుంచి నీరు తోడేందుకు పాట! పశువులను కాస్తూ పని లేకుండా ఉండే కాపరి నోట పాట వినిపిస్తుంది.

02/09/2019 - 18:38

వేటాడే మనిషికి పరుగుతోబాటు ఆయుధాన్ని విసరవలసిన అవసరం కూడా ఎదురయింది. ఒక వస్తువును చేతితో పట్టుకుని విసరడం ప్రైమేట్ జాతి జంతువుకు మాత్రమే వీలవుతుంది. కానీ చింపాంజీలు, ఒరాంగ్ ఉటాన్‌లు, కోతులకు ఒక వస్తువును విసరడానికి మనిషికి ఉన్న వీలు లేదు. చేతిని పైకి ఎత్తి గుండ్రంగా తిప్పి క్రికెట్ బంతిలాగ విసరడం వీటికి చేతకాలేదు. ఒకవేళ విసిరినా గురి కుదరదు.

02/02/2019 - 17:32

గొప్పదనం ఎక్కడ ఉన్నా గొప్పగానే ఉంటుంది. దాన్ని చూడగలగటమే కష్టం. ప్రొఫెసర్ రామ్మూర్తిగారిని నేను చూసినట్టే జ్ఞాపకం. ఎక్కడ చూశాను అన్నది మాత్రం చటుక్కున గుర్తు రావడం లేదు. ప్రొఫెసర్ రామ్మూర్తిగారు అంటే నాకు వెంటనే ఇద్దరు గుర్తుకొస్తున్నారు. ఇద్దరినీ చూశాను. వారిలో ఒకరితో మాట్లాడాను కూడా. మాట్లాడిన ప్రొఫెసర్ గారు వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్‌గా చేశారు.

01/28/2019 - 22:38

లండన్‌ నుంచి ప్రసాద్ వచ్చాడు. ప్రసాద్ అంటే మా అన్నయ్యగారి పెద్ద కొడుకు. అందరము కలిసి కూర్చుని సరదాగా మాట్లాడుకున్నాము. ఆ సందర్భంగా ప్రసాద్ ఒక వింత అనుభవం చెప్పాడు. ఒక పెద్ద మనిషి లండన్‌లో విమానం ఎక్కాడు. విమానం వాళ్లు ఒకటి రెండు చిన్న సంచులను మనతోపాటు వెంట తేవడానికి అనుమతిస్తారు. పెద్ద సంచులను వాళ్లు ప్రత్యేకంగా తీసుకుని వేరుగా పెట్టి మనకు కనిపించకుండానే మనతోపాటు తెస్తారు.

01/19/2019 - 23:41

పథికుడా, నీవు ఈ మార్గాన మరొకసారి నడచి రావేమొ కానీ, నీ పాదముద్రలు ఇందు కలకాలము నిలిచి యుండు.’ ఈ మాటలు ఎవరో అన్నవి కావు. నేనే అంటున్నాను. ఒక నిజమైన యాత్రికుడు మన ముందు నుంచి నడిచి వెళ్లిపోతాడు. అతను తిరిగి రాడు. కానీ కాలి గుర్తులు మాత్రమే ఉండిపోతాయట. కవిత్వ ధోరణిలో ఉన్నప్పుడు నా మనసులో సంచరించిన మాటలు ఇవి. అందరూ యాత్రికుల కాలి గుర్తులు అట్లాగే నిలుస్తాయి అంటే నాకు కూడా నమ్మకం లేదు.

Pages