లోకాభిరామం
చేతుల్లో తేడాలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
మనిషి చేతుల యొక్క లక్షణాల ద్వారా ఎవరికి వారిని ప్రత్యేకంగా చెప్పే పరిస్థితికి అమ్మ కడుపులోనే ఆరంభం జరుగుతుంది. అవే వేలిముద్రలు. పది నుండి పదహారు వారాల వయస్సులోనే వేలిముద్రలు మొదలవుతాయి. వాటి తీరు మీద జన్యువుల ప్రభావం ఉంది. శంఖాలు, చక్రాలు, ఇవిగాక ఆర్చెస్ అనే నిర్మాణాలు అన్నీ అక్కడే మొదలవుతాయి. పిండంగా ఉన్నప్పటి నుంచి చేతుల మీద పడిన వివిధ ప్రభావాల కారణంగా వీటి తీరు నిర్ణయం అవుతుంది. కనుకనే ఒకే రకంగా ఉన్న కవలల వేలిముద్రలు మాత్రం వేరువేరుగా ఉంటాయి.
మనిషిని గురించి మనం రకరకాల సంగతులు చెప్పుకున్నాము. అన్నింటా జాతి ప్రత్యేకత తెలుస్తున్నది. చేతులే లేకుంటే మనిషి ఇట్లాగ ఉండేవాడు కాదన్న వారున్నారు. ఆడ, మగ మధ్యన చేతుల్లో కూడా తేడాలు ఉన్నాయి. ఆడవాళ్లకు వేళ్లు చిన్నవి గనుక వాటికి గల గ్రహణ శక్తి ఎక్కువ అన్నారు. స్ర్తి, పురుషుల చేతుల మధ్యన మరో రకంగా కూడా తేడాలు ఉన్నాయి. మగవాళ్లలో చూపుడు వేలు ఉంగరపు వేలుకన్నా చిన్నదిగా ఉంటుంది. ఆడవారిలో అవి రెండూ ఇంచుమించు సమానంగా ఉంటాయి. ఈ రెండు వేళ్ల పొడుగు ఆధారంగా ఆ వ్యక్తి కడుపులో ఉన్నప్పుడు టెస్టస్టిరోన్ అనే హార్మోన్ చూపిన ప్రభావం గురించి చెప్పవచ్చును అంటున్నారు. ఇటీవలి పరిశోధనలు ఈ అంశాన్ని అంత సులభంగా అంగీకరించడం లేదు. మొత్తానికి ఈ విషయంగా వందల పరిశోధనలు జరిగాయి. వేళ్ల నిడివికి మరెన్నో లక్షణాలకు సంబంధం ఉందంటున్నారు. వాటిలో లైంగికత కూడా ఒకటి. మగతనం ఎక్కువగా ఉన్నవారికి ధైర్యంగా పనులు చేపట్టే గుణం ఉంటుంది. అలాగే డబ్బు విషయంలో మంచి తెలివితేటలు, ఆటలలో ఒడుపు కూడా ఉంటాయి.
మనిషి చేతుల యొక్క లక్షణాల ద్వారా ఎవరికి వారిని ప్రత్యేకంగా చెప్పే పరిస్థితికి అమ్మ కడుపులోనే ఆరంభం జరుగుతుంది. అవే వేలిముద్రలు. పది నుండి పదహారు వారాల వయస్సులోనే వేలిముద్రలు మొదలవుతాయి. వాటి తీరు మీద జన్యువుల ప్రభావం ఉంది. శంఖాలు, చక్రాలు, ఇవిగాక ఆర్చెస్ అనే నిర్మాణాలు అన్నీ అక్కడే మొదలవుతాయి. పిండంగా ఉన్నప్పటి నుంచి చేతుల మీద పడిన వివిధ ప్రభావాల కారణంగా వీటి తీరు నిర్ణయం అవుతుంది. కనుకనే ఒకే రకంగా ఉన్న కవలల వేలిముద్రలు మాత్రం వేరువేరుగా ఉంటాయి.
ఇక వేలిముద్రలు ఎందుకూ అన్న ప్రశ్నకు మాత్రం మరోచోట జవాబు వెతకాలి. వాటివల్ల స్పర్శలో నిశితత్వం వస్తుంది అన్నారు. అక్కడి చర్మం విస్తరించేటందుకు వీలు కలిగి వేలి చివరలకు రక్షణ కలుగుతుంది. ఇలాగే వాటి ఉపయోగాలుగా మరికొన్ని విషయాలు చెప్పారు. ఒకటి మాత్రం చిత్రమయిన పరిస్థితి. వేలిముద్రల వలన చేతికి పట్టు పెరుగుతుంది అనుకున్నారు కానీ, అది అబద్ధం అని తెలిసింది. మనిషి జీవితకాలంలో వేలిముద్రలు మారవు. మొత్తానికి గోళ్లను చూచి మనిషి ఆరోగ్యం, ఆహారాల సంగతి చెప్పవచ్చు. వాటి రంగు, నునుపు, ఆకారాల ఆధారంగా ఎన్నో విషయాలు చెప్పవచ్చు. గోళ్లలో గీతలు కనిపిస్తాయి. అవి వ్యాధులకు సూచనలు కాకపోవచ్చు. కానీ విటమిన్ లోపం వల్ల అవి వస్తాయని గట్టిగా చెప్పవచ్చు. గుండె జబ్బులు, కేన్సర్ గలవారికి గోళ్లల్లో తేడాలు వస్తాయని గమనించారు. కొంతమందికి గోళ్లు పసుపుబారతాయి. చక్కెర వ్యాధి గలవారిలో ఈ లక్షణం ఎక్కువగా కనపడుతుంది. లివర్, మూత్రపిండాల జబ్బులు గలవారి గోళ్లు కొంత నల్లబారతాయి. గోళ్లలో వచ్చిన గీతలను గురించి అవి లోతుగా ఉంటే అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వయసు పెరిగిన కొద్దీ కూడా గోళ్లలో తేడాలు కనిపిస్తాయి.
వెనక నుంచి వచ్చిన వారు కళ్లు మూసి ఎవరో చెప్పుకో చూద్దాం అన్నట్టు సవాలు చేస్తారు. వాళ్లు మాట్లాడితే గొంతు తెలుస్తుంది. ఇక తెలియకుండానే ఆ కళ్లుగల వ్యక్తులు ఆ చేతులను తడుముతారు. చాలా సందర్భాలలో చేతులను బట్టి మనుషులను గుర్తిస్తారు కూడా. శరీరంలోని మిగతా భాగాలు ఎలాగున్నా, చేతులు ఎవరికి వారికి ప్రత్యేకం అని మరోసారి చెప్పుకోవచ్చు. నిజానికి ఇంత ప్రత్యేకమయిన వ్యక్తిగతమయిన శరీర భాగాలను మనిషి బాహాటంగా ప్రదర్శించడం మాత్రం విచిత్రం. చేతికి ఉంగరాలు వేసుకుంటారు. కడియాలు, గడియారాలు పెట్టుకుంటారు. గోళ్లకు రంగులు పూసుకుంటారు. వాటికి మించి మణికట్టు మీద ఉన్న గీతల ద్వారా ఏవేవో చెప్పడానికి ప్రయత్నిస్తారు. మొత్తానికి మిగతా వారికి కూడా అంతగా మన శరీరం గురించి తెలుస్తుంది అంటే ఆ వరుసలో చేతులే ముందు ఉంటాయి. ఒక విషయం బాగా తెలుసు అనడానికి ఇంగ్లీషులో చేతి వెనుక భాగం తెలిసినంతగా.. అని అర్థం వచ్చే మాట కూడా ఉంది.
చిత్తర్వులలో కాళ్లను ఎంతగా చిత్రించిందీ పరిశీలించడం బాగుండదు. అయినప్పటికీ కాళ్లు కూడా ఎంతో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తాయి. అవి చిత్రంగా, వికృతంగా కూడా ఉంటాయి అంటే ఎవరికీ కోపం రానవసరం లేదు.
కాళ్ల గురించిన పరిశోధన జోళ్ల ఆధారంగా కొనసాగింది. కాలిజోళ్లను మాత్రమే పరిశీలించిన పురావస్తు శాస్తవ్రేత్తలు ఉన్నారంటే ఆశ్చర్యం లేదు. స్విట్జర్లాండ్‌లోని లౌసాన్ నగరంలో షూ మ్యూజియం ఒకటి ఉన్నది. 16వ శతాబ్దినాటి నుంచి కాళ్ల గురించి పరిశోధనలు జరుగుతున్నాయి. అప్పట్లోనే బూట్లకు మడమల కింద వేసుకునే సోల్స్ మందం పెరగడం మొదలయింది. అది నగరవాసులు మాత్రమే పాటించిన పద్ధతి అని గుర్తించారు. అందం, ఫ్యాషన్ పేరున ముందుగా ఆడ, మగ ఇద్దరూ కాలిజోళ్లను మార్చుకోసాగారు. నడకలో తేడాలు చూపించసాగారు. అడుగు ఎత్తు మడమలు కూడా వేసుకున్నారు. అంటే ఇక ఆ విషయం గురించి ఆలోచించవచ్చు. ఎంత ఎత్తు జోళ్లు వేసుకుంటే సమాజంలో అంత ఎత్తు వర్గానికి చెందిన వారుగా అప్పట్లో మనుషులకు గుర్తింపు ఉండేది. కానీ అటువంటి జోళ్లు సౌకర్యంగా మాత్రం ఉండేవి కావు.
ఫ్రెంచ్ విప్లవం తరువాత కాలిజోళ్ల మడమల ఎత్తు మళ్లీ నేలకు చేరసాగింది. ఆ తరువాత మరొకసారి ఆడవాళ్లు మాత్రం ఎత్తు మడమలు వేసుకోసాగారు. నడకలో వయ్యారం చూపించడానికి ఎత్తుమడమల జోళ్లు ఉపకరించినట్టు అప్పటివాళ్లు భావించారు. ఎత్తు మడమల జోళ్లు వేసుకున్నందుకు కొన్ని రకాల లాభాలు ఉన్నట్లు ఈ మధ్యన జరిగిన పరిశోధనలలో కూడా కనుగొన్నారు.
నిజానికి జోళ్ల మడమలు ఎత్తుగా ఉండడం ఏమంత మంచిది కాదు. పైగా షూ వేసుకోవడం వలన కాలి వేళ్లు కూడా ఒకచోటికి నొక్కుకుపోతాయి. బునియన్ అనే ఒక రకమయిన పరిస్థితిని పాతకాలం నాటి యూరోపియన్ అస్థిపంజరాలలో కూడా గమనించారు. అమెరికాలో ఆ మధ్యన ఆడవాళ్ల జోళ్ల గురించి పరిశోధనలు జరిగాయి. చాలామంది తమ కాలిసైజుకన్నా తక్కువగా ఉండే జోళ్లను వేసుకున్నట్టు అక్కడ తెలిసింది. అందువల్ల నొప్పి పుట్టిందని చెప్పిన వారు కొంత తక్కువగా ఉన్నట్టు తెలిసింది.
మానవుని కాళ్ల నిర్మాణంలో గొప్ప రహస్యాలు, ఆశ్చర్యాలూ లేవు. అయితే అది మామూలు నిర్మాణం మాత్రం కాదు. ఒక కాలిలో మొత్తం 26 ఎముకలు ఉంటాయి. నూటికి పైగా కండరాలు, టెండన్‌లు, లిగమెంట్‌లు కూడా కాలిలో ఉంటాయి. ఇక కాలు సాగే లక్షణం కలది. అమ్మాయిల కాళ్లు పొడుగ్గా ఉంటే అందంగా ఉంటాయని అందరూ అనడం తెలిసే ఉంటుంది. అయితే చైనాలో మాత్రం అమ్మాయిల పాదాలు ఎంత చిన్నవిగా ఉంటే అంత గొప్పగా ఉంటాయి అనుకుంటారు. ఈ విషయంగా జానపద గాథలు కూడా ఉన్నాయి. ఇప్పటికీ కొన్ని కుటుంబాలలో ఆడకూతుళ్ల కాలికి కట్లు కట్టి అవి పెరగకుండా చేస్తారు. పాదాలు చిన్నవిగా ఉన్నందుకు ఆ అమ్మాయి నడకలోనూ, నిలబడడంలోనూ నిలకడ తగ్గుతుంది అని ఎక్కడా చెప్పినట్టు కనిపించదు.
కాళ్ల తీరు కొంత జన్యువుల ద్వారా, కొంత వాతావరణం ద్వారా ప్రభావితం అవుతుంది. ఇప్పటివరకు ఈ విషయంగా జరిగిన పరిశోధనలు పడమటి ప్రపంచానికే పరిమితం అయ్యాయి. నడక నేర్చినప్పటి నుండి షూస్ వేసుకోవడం, ఆ దేశాలలో అలవాటుగా సాగింది. చలి దేశాలలో కూడా కాళ్లను నిండుగా కప్పుకునే అవసరం కనుక అలవాటు ఉన్నాయి. ఉష్ణమండలంలోని మన దేశంలాంటి చోట్ల చాలామంది అసలు కాళ్లకు చెప్పులు కూడా వేసుకోరు. కాళ్ల మీద బలం పడుతుంది. అవి విస్తరించకుండా ఆపడానికి చెప్పులు ఉండవు. కనుక మన దేశంలో ముఖ్యంగా పల్లెవారి పాదాలు బాగా వెడల్పుగా ఉంటాయని గమనించవచ్చు. కాలి వేళ్ల మధ్యన సందులు కూడా ఉంటాయి. ఇక షూస్ వేసుకున్న వారికి కాలు ఒక ఆకారంలోకి వస్తుంది. వేళ్లు కూడా ప్రయత్నపూర్వకంగా అమర్చినట్టు దగ్గర దగ్గరగా చేరి ఉంటాయి.
ఎక్కువ దూరాలు పరుగెత్తేవారు కూడా చాలాకాలం పాటు జోళ్లు లేకుండా పరుగెత్తారు. ఆఫ్రికాలో ఈనాటికీ కొన్ని జాతుల వారు జోళ్లు లేకుండానే ఎంతెంతో దూరాలకు పరుగులు పెడుతూ ఉంటారు. ఈ రకంగా పరుగు పెట్టేవారి కాళ్లు ఎత్తి ముందుకు వేసినప్పుడు ఏ భాగం నేలకు తగులుతుంది అన్నది మరొక విచిత్రమయిన విషయం. కెన్యా దేశంలో పరుగుల వారు ముందు వేళ్లను నేలకు తగిలిస్తారట. జోళ్లు వేసుకునే వారి తీరు మరొక రకంగా ఉంటుంది.