S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లోకాభిరామం

06/15/2019 - 17:41

ఈ మధ్యన మా వీధిలో మా ఇంటికి ఎదురుగా ఉన్న ఒక ఇంటిని స్వంతదారులు అమ్ముకున్నారు. భార్యాభర్తలు ఇద్దరే కనిపించేవారు. బహుశా పిల్లలు విదేశాలలో ఉండే ఉంటారు. నా పిల్లలలాగే. నాకు ఇంకా ఆ పరిస్థితి రాలేదు కానీ ఈ దంపతులు ఇల్లు అమ్ముకుని వెళ్లిపోయినట్టు ఉన్నారు. మా వీధిలో ఉన్న ఇళ్లు చాలా మటుకు ఒకటి కన్నా ఎక్కువ అంతస్తులు గలవి. ఈ ఇల్లు మాత్రం ఒకే అంతస్తు ఉండేది. వెనుక ఒక పెద్ద మామిడి చెట్టు ఉండేది.

06/08/2019 - 19:10

ఎండలు ఎన్నడూ లేనంతగా బాధ పెట్టినయి ఈసారి. ఎండలు ఎన్నడూ లేనంతగా ఉన్నవి అని నేను అనడం లేదు. హైదరాబాద్ నగరంలో 44 డిగ్రీల ఎండలు రావడం నాకు గుర్తుంది. ఐదవ అంతస్తు పైన ఆకాశం కింద, చాప పరచుకొని పండుకోవడం మనసులో తాజాగా ఉంది. తెల్లవారుజామున చలి పెట్టి దుప్పటి కప్పుకొన వలసిన అవసరం వచ్చేది. గాలి మరీ ఎక్కువగా ఉండటంతో పైన పడుకోవడం అంత సుఖంగా లేకుండా మారింది.

06/03/2019 - 22:12

కార్నియా ఉపరితలం మీద ఒక సన్నని పొర ఉంటుంది. క్రమంగా కణాలు మారినందుకు అది ప్రతి 7 నుంచి 10 రోజులకు ఒకసారి మారిపోతుంది.

05/25/2019 - 19:05

కవిత్వంకన్నా ప్రేమలో లెక్కలు ఎక్కువ. అవి ఆత్మకు సంబంధించిన లెక్కలు.. - విలియం ఛార్ల్స్
* * *

05/18/2019 - 23:21

ఒక రాతికి శిల్పవిద్య ఎంతో, మనిషి ఆత్మకు చదువు అంటే
- జోసెఫ్ అడిసన్
* * *

05/11/2019 - 19:14

మొక్కలు, జంతువులలో లాగే జీవం లేని వాటిలోనూ దిక్కుమాలిన వైవిధ్యం ఉంది. ఎన్ని మూలకాలు, ఎన్ని ఖనిజాలు, ఎనె్నన్ని నక్షత్రాలున్నాయి - సర్ జాన్ ఆర్థర్ థామ్సన్
* * *
లోకాభిరామం కాలంలో నాస్టాల్జియా వాసన బలంగా వస్తుందని మిత్రులు ఒకరిద్దరు అనడం గుర్తుంది. అవును మరి, గతం గురించి గుర్తు చేసుకోవడం చాలా బాగుంటుంది కదా!

05/04/2019 - 17:17

కాలం అంటే స్థలానికి మెదడు. స్థలం అన్నది కాలానికి శరీరం - అలెగ్జాండర్ సాముయెల్
* * *

04/27/2019 - 19:59

అప్పట్లో దీపాలంటే చమురు దీపాలే. ప్రమిదలో పత్తి వేసి, నూనె లేదా ఆముదం వేసి దీపం పెట్టుకునేవారు. అలా నడుస్తుంటే ఈ మట్టి నూనె రంగప్రవేశం చేసింది. దాని పేరే కిరోసిన్, గ్యాస్ నూనె, కిరసనాయిలు వగైరా వగైరా. దాన్ని కూడా ఓ పెద్ద మూకుడులో వేసి గుడ్డతో వేలంత వత్తి చేసి వెలిగించాడట ఒక ప్రబుద్ధుడు. ఇంకేముంది? క్షణాల్లోనే గుడిసె గుడిసంతా దీపమయి వెలగసాగిందట. ఇక్కడ తప్పెవరిది? నూనెదా?

04/20/2019 - 19:18

కేవలం కొన్ని వాస్తవాలను ఎంత బాగా అమర్చి పెట్టినప్పటికీ, వాటిలోనుంచి ముఖ్యమయిన అంశాలు బయటకు రానే రావు. -జార్జ్ హోవార్డ్ డార్విన్ - గణిత, ఖగోళ నిపుణుడు
* * *

04/13/2019 - 21:55

నేను డెంటిస్టు దగ్గరకు వెళ్లాను. నిజానికి పంటినొప్పి లేనే లేదు. కానీ అనుభవం మరొక రకంగా ఉంది. నొప్పి తెలిసే సమయానికి ఏదో ఒక పంటిలో కొండగుహంత రంధ్రం తయారవుతుంది. -రాబర్ట్ సన్ డేవిడ్, నవలాకారుడు.
* * *

Pages