లోకాభిరామం

తెలియని కథ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కవిత్వంకన్నా ప్రేమలో లెక్కలు ఎక్కువ. అవి ఆత్మకు సంబంధించిన లెక్కలు.. - విలియం ఛార్ల్స్
* * *
ప్రేమ ఫలించలేదు అనగానే అందరికీ లైలా మజ్ను గుర్తుకు వస్తారు. ఈ కథ సినిమాగా కూడా వచ్చిందట. అట అంటున్నాను. అంటే నేను ఆ సినిమా చూడలేదు అని అర్థం. రాజశేఖరా అన్న పాట మాత్రం విన్నాను. ఇక ఉత్తర భారతదేశంలో హీర్ రాంఝా అనే మరొక జంట గురించి కథ చెబుతారు. ఈ కథ కూడా సినిమాగా వచ్చింది. నేను చూడలేదు. పోతే నా అభిమాన రచయిత శరత్ చంద్ర చటర్జీ సృష్టించిన దేవదాసు కథ మాత్రం నాకు బాగా తెలుసు. ఈయనే దేవదాసు అయి ఉంటాడు అనిపించే విధంగా ఏ.ఎన్.ఆర్. నటించిన సినిమా చూడడం కాదు, స్టడీ చేశాను. వీటన్నింటినీ మించి రోమియో జూలియట్ అని ఇంకొక కథ ఉన్నది. దానిని గురించి వినడం, తెలియకుండానే మాట్లాడటం తప్ప వివరాలు నాకు ఈ మధ్య వరకు తెలియవు. అయితే ఏమిటట అనకండి! ఈ ప్రపంచంలో చాలా విషయాలను గురించి మనము వివరాలు తెలియకుండానే మాట్లాడుతూ ఉంటాము. వాల్మీకి రామాయణం గురించి ముక్క కూడా తెలియకుండా కేవలం సినిమాల మీద ఆధారంగా రామాయణం తెలుసు అనుకునే వాళ్లు చాలామంది ఉన్నారు. 24వేల శ్లోకాలతో వాల్మీకి రాసిన రామాయణంలో చిత్రవిచిత్రమైన వివరాలు ఉన్నాయి అన్న సంగతి చాలామందికి పట్టదు. నేను కూడా ఆ చాలామందిలోనే ఉన్నాను కానీ, కొన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశాను.
చదవడం ఒక బలహీనత కనుక ఎదురుగా వచ్చిన ప్రతి పుస్తకాన్ని చదువుతుంటాను. ఆ కార్యక్రమంలో ఎన్నో వింత విషయాలు ముందుకు వస్తాయి. షేక్స్‌పియర్ కూడా ఇదే పద్ధతిలో నా ముందుకు వచ్చాడు. ఈయన పేరు కూడా ఈ ప్రపంచంలో ఇంచుమించు అందరికీ తెలిసి ఉంటుంది. కానీ రచనలను గురించి పట్టించుకున్న వారు మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు. వాల్మీకి రామాయణం పద్ధతి ఇది కూడా. ఎక్కడ విన్న యు టూ బ్రూటస్ అనే డైలాగు నాకు గుర్తుంది. నమ్మినవాడు మోసం చేసినప్పుడు ఈ మాట చెబుతుంటారు. జూలియస్ సీజర్‌కు బ్రూటస్ ఈ రకంగా మోసం చేశాడు.
షేక్స్‌పియర్ రాసిన నాటకాలలో హామ్లెట్ అనేది చాలా పేరు పొందినది. మిగతా నాటకాలు కూడా ఇంచుమించు అంతే పేరు గలవి. ఆ కవి సానెట్స్ అనే కవితలను కూడా రాశాడు. అప్పు చేయవద్దు, ఇవ్వవద్దు అంటూ పొలోనియస్ అనే ఒక తండ్రి తన కొడుకు సలహా ఇచ్చిన కవిత మాకు డిగ్రీ స్థాయిలో పాఠంగా చెప్పినట్టు ఉన్నారు. ఆ వానాకాలం చదువులో చదివినది ఏదీ నాకు గుర్తుండదు. కానీ రోమియో జూలియట్ గురించి కొంచెం కుతూహలం మాత్రం చాలాకాలంగా ఉంది. ఈ కథను షేక్స్‌పియర్ సొంతంగా సృష్టించలేదు అని తెలిసినప్పుడు ఆశ్చర్యం కలిగిన మాట వాస్తవం. నిజానికి ఇంగ్లీషు సాహిత్యంలో ఈ కథ ముందు నుంచే ఉందట. ఆర్థర్ బ్రూక్స్ అనే ఒక రచయిత ఈ కథను పాఠకులకు పరిచయం చేశాడు అంటున్నారు. అది కవిత రూపంలో వచ్చింది. బ్రూక్స్ కూడా కవితకు అవసరమైన కథను మరి ఎక్కడినుంచో అరువు తెచ్చుకున్నాడు. షేక్స్‌పియర్ మాత్రం కథను చిన్నచిన్న వివరాలతో సహా తన నాటకానికి వాడుకున్నాడు. ఈ కవి మొత్తం రచనలు ఈ రకంగా అరువు తెచ్చుకున్న కథల మీద ఆధారపడినవే అని పరిశోధకులు తెగేసి చెబుతున్నారు. నాటకంగా మలిచి దానిని ప్రదర్శించడంలో కవి తన తెలివితేటలను ప్రదర్శించాడు. షేక్స్‌పియర్ అన్న మాటను మళ్లీ మళ్లీ రాయనవసరం లేకుండా నేను కవి అంటున్నానని మీరు గమనించే ఉంటారు. నేను మాత్రం వేరొక సంగతి గమనించాను. స్వారోచిషమనుసంభవము అనే మనుచరిత్ర అల్లసాని పెద్దన కలం నుంచి అందంగా జాలువారిన రచన. అయితే ఆ కవిపుంగవుడు మార్కండేయ పురాణంలోని ఒక చిన్న కథ ఆధారంగా కావ్యాన్ని అల్లి తెలుగు వారికి అందించాడు. అంతకు ముందు కృష్ణదేవరాయలకు అందించాడు. కట్టే కొట్టే తెచ్చే పద్ధతిలో కథ చెప్పేవారు కథ ఎక్కడి నుంచి తెచ్చినా లాభం ఉండదు. కానీ కమ్మని పద్యం అల్లి కవితను పండించగల మహాకవి ఆ చిన్న కథకు గొప్ప గౌరవాన్ని కలిగించాడు. వసుచరిత్ర అయినా అంతే, మరొక కావ్యం అయినా అంతే. ఆధారం ఎక్కడో ఉండి తీరుతుంది.
అన్ని భాషల సాహిత్యంలోనూ ఈ రకం పద్ధతి కొనసాగిందని చెప్పడానికి మరింత చదవవలసి ఉంటుంది. సినిమా రామాయణం తెలిసిన వారికి వాల్మీకి చెప్పిన ఎన్నో విషయాలు తెలియనట్టే మనకు కూడా ప్రపంచ సాహిత్యం గురించి కేవలం కొన్ని సంగతులు తెలుసు. అంతేకానీ వివరాలు పట్టనే పట్టవు.
ప్రేమ విఫలమైతే అది దుఃఖాంతం అనబడుతుంది. అటువంటి కథలను తీసుకొని పాఠకుల మనసులను కదిలించడం రచయితలకు ఎందుకు నచ్చుతుందో తెలియదు. నాకు అసలు ప్రేమ, చీమ, దోమ లాంటివే అంతగా పట్టవు. కానీ తెలుసుకోవాలి గనుక రోమియో జూలియట్ కథ గురించి వివరం వెతికాను. నాకు అక్కడ కొంత నిరాశ ఎదురైంది. రెండు ధనిక కుటుంబాలు ఏదో కారణంగా పోటీ పడుతున్నాయి. వారిలో ఒక అబ్బాయి, అమ్మాయి ప్రేమించుకున్నారు. పెద్దలకు చెప్పకుండా పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ కథ దుఃఖాంతం అయింది. ఇప్పటివరకు, మన సినిమాలలో కథను కష్టాలతో ముగించి చివరికి శుభం అని కార్డు వేసే పద్ధతి అంత బలంగా రాలేదు. కనుక సరిపోయింది కానీ, మన దగ్గర ఎన్ని సినిమాలలో వెతికినా ప్రేమకథ ఇదే రకంగా కథ ఉంటుంది!
వెరోనా అని ఒక నగరం. అందులో కాపులెట్, మోంటగూ అని రెండు కుటుంబాలు. రెండు కుటుంబాలు కూడా కలిగిన వాళ్లు. పేరున్నవాళ్లు. గనుక నేరుగా యుద్ధానికి దిగలేదు. ఈ కుటుంబాల పనివాళ్ల కొట్లాటతో నాటకం మొదలవుతుంది. కొట్లాట కొంతకాలం సాగుతుంది. చివరికి యువరాజు కూడా కలుగజేసుకుంటాడు. మోంటగూ కొడుకు పేరు రోమియో. అతను రోజలిన్ అనే ఒక అమ్మాయిని మెచ్చి ప్రేమించే ప్రయత్నంలో ఉన్నాడు. ఆ అమ్మాయికి మాత్రం రోమియో మీద ప్రేమ లేదు. కనుక మిత్రుడు ఒకతను వచ్చి పిచ్చి ప్రేమ మానుకో అంటాడు. అటు కాపులెట్‌కు ఒక కూతురు ఉంది. వింతేమీ లేదు, ఆమె పేరు జూలియట్. రాజకుటుంబంలోని ఒక అతను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అంటాడు. కానీ అమ్మాయి చాలా చిన్నది. పనె్నండు ఏళ్లు మాత్రమే. కనుక కొంతకాలం ఆగాలి అనుకుంటారు. ఆ నిర్ణయంతోనే కొంప మునుగుతుంది. కాపులెట్ కుటుంబంలో ఏటా మామూలుగా ఒక విందు జరుగుతుంది. ఈసారి కూడా విందుకు అతిథుల పట్టిక తయారవుతుంది. అది మన కథానాయకుని దృష్టిలో కూడా పడుతుంది. ప్రత్యర్థుల కుటుంబం అని తెలిసి కూడా ఏదో రకంగా విందుకు వెళతాడు. అక్కడ జూలియట్‌ను చూస్తాడు. అంతకు ముందటి అమ్మాయిని మరిచిపోయి తలమునకలుగా ప్రేమలో పడతాడు. ఈ మధ్యన మరి ఎన్నో జరుగుతాయి కానీ ఒక మతాచార్యుల ఆశీర్వాదంతో వీళ్లిద్దరూ దొంగచాటుగా పెళ్లి చేసుకుంటారు. శోభనం కూడా జరుగుతుంది. జూలియట్ కుటుంబంలో రోమియో మీద కోపగించుకున్న ఒక యువకుడు అతడిని ద్వంద్వ యుద్ధానికి పిలుస్తాడు. అక్కడ రోమియో చేతిలో మరొక వ్యక్తి చస్తాడు. అచ్చంగా రామాయణంలో లాగే ఇక్కడ కూడా కథలో ఎన్నో మలుపులు, మెరుపులు, చమక్కులు ఉంటాయి. దొంగ పెళ్లి గురించి తెలియక జూలియట్ తండ్రి ఆమెకు నాలుగు రోజులలో పెళ్లి నిశ్చయిస్తాడు. ఇక్కడ నిజంగా నాటకంలో ఒక నాటకం జరుగుతుంది. జూలియట్‌లో తప్పించాలంటే ఆమె ఏదో మందు తాగి చనిపోయినట్లు నటించాలని మిత్రురాలు సూచిస్తుంది. ప్రియురాలు చనిపోయిందని తెలిసిన రోమియో విషం తీసుకుని ఆమె సమాధి దగ్గరకు వెళతాడు. అక్కడ ఎదురయిన మరొక పెళ్లికొడుకుని చంపుతాడు. విషం తాగి తాను చస్తాడు. కానీ నటిస్తున్న జూలియట్ లేచి కూర్చుంటుంది. విషపూరితమైన అతని పెదవులను ముద్దు పెట్టుకున్నా చావు రాకపోవడంతో, అతని కత్తిని ఎదలో గుచ్చుకుని జూలియట్ చనిపోతుంది. రెండు కుటుంబాల వారు వచ్చి, తమ పిల్లల పరిస్థితిని గమనించి పాత శత్రుత్వాన్ని మరిచిపోవాలని, విఫల ప్రేమికుల బంగారు విగ్రహాలను నిలబెట్టాలని నిర్ణయం చేస్తారు.
కథ నిజానికి నేను చెప్పినంత పొడిగా ఉండదు. మధ్యలో మరెన్నో పాత్రలు వస్తాయి. చిత్ర విచిత్రమైన ప్రవర్తనలో మాటలు కనిపిస్తాయి వినిపిస్తాయి. నాటకం రక్తి కడుతుంది. షేక్స్‌పియర్ కవితా పటిమ మొత్తం అక్కడ కనిపిస్తుంది. కనుకనే ఇంతకాలమైనా ఆ రచనకు ఇంకా గౌరవం ఉన్నది. షేక్స్‌పియర్ నిజానికి ఆ రచనలన్నీ చేయలేదని, మరెవరో చేసిన రచనలు అతని పేరున చెలామణి అయ్యాయని ఇవాళటి వరకు కూడా వాదం ఉన్నది. నిజంగా రచనలు చేసిన వారు అంటూ ఒకరిద్దరు పేర్లను కూడా సూచించారు. అయితే, పరిశోధకులు ఈ వాదాన్ని అంత సులభంగా అంగీకరించలేదు.
షేక్స్‌పియర్ వ్యక్తిగత జీవితం గురించి అంతగా తెలియదు. అతను నిజానికి తనకంటే పెద్ద వయసు గల ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ముగ్గురు పిల్లలను కూడా కన్నాడు. ఆ తరువాత కుటుంబాన్ని వదిలిపెట్టి లండన్ వచ్చాడు. నాటకాల రచయిత, ప్రదర్శకుడిగా అక్కడ ఎంతో పేరు సంపాదించుకున్నాడు. ప్రపంచంలోనే అందరికన్నా గొప్ప కవి అని కూడా అనిపించుకున్నాడు. అటువంటి కవి అసలు లేనే లేడు, ఆ రచనలు మరొకరివి అనడంలో కూడా ఆశ్చర్యం కలిగించలేదు. మనకు సంగీత ప్రపంచంలో స్వాతి తిరునాళ్ అని ఒక గీతకర్త ఉన్నాడు. ఆయన నిజానికి తిరువనంతపురం రాజ కుటుంబానికి చెందినవాడు. ఆయన ఉన్నాడు కానీ, ఆయన పేరున ఇప్పటికీ గాయకుల గొంతుల నుండి వెలువడుతున్న రచనలు మాత్రం మరెవరో చేసినవి అంటూ పెద్ద సంగీత విద్వాంసులు ఆ మధ్య కోర్టుల దాకా వెళ్లిపోయారు. అచ్చం బార్డ్ అనిపించుకున్న షేక్స్‌పియర్ విషయంలో లాగే ఇక్కడ కూడా వివాదం మధ్యలోనే ఆగిపోయింది. నా వంటి వారి కుతూహలం మాత్రం ఒకేచోట నిలబడి ఉన్నది. స్వాతి తిరునాళ్ సంస్కృతం, హిందీ, తెలుగులో కూడా రచనలు చేసినట్టు సంగీతం విన్న వాళ్లకి తెలుస్తుంది. ఆ పాటలు చాలా బాగుంటాయి. అటువంటి పాటలు నిజంగా ఎవరు రాసినది తెలుసుకోవాలని ఉండటంలో ఆశ్చర్యం లేదు.
నాకు రోమియో జూలియట్ నాటకం ఆసాంతం చదవాలన్న ఆసక్తి బాగా పెరిగింది. కానీ కవిత రూపంలో ఉన్న ఆ నాటకం చదివితే అర్థం కాదేమో అన్న అనుమానం కూడా ఉన్నది. కనుక వచన రూపంలో ఆ కథలను గురించి వెతుకుతున్నాను. లాంగ్ దంపతులు షేక్స్‌పియర్ రచనలను సులభ పద్ధతిలో రాసినట్టు తెలుసు. ఇక్కడే చిక్కు వచ్చింది. ఎన్నో సంగతులు తెలుసు కానీ, వాటిని అనుసరించి ఆయా రచనల గురించి తెలుసుకోవడం మాత్రం తెలియదు. ఎంతని చదువుతాము? ఎన్ని గుర్తుంచుకుంటాము? కానీ కొన్నింటి గురించి తెలుసుకోవడం చాలా అవసరం ఏమో?

-కె.బి.గోపాలం