S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లోకాభిరామం

10/15/2016 - 22:10

భారతదేశానికి అసలయిన ఆర్థిక మంత్రి రుతుపవనాలు, అని అర్థం వచ్చే మాట ఈ మధ్యన ఎక్కడో చదివాను. ఆ తరువాత, అలవాటుగా మరికొన్ని పుస్తకాలు చదువుతున్నాను. మంచి విషయం, అంటే తెలివిగా చెప్పిన ఏ విషయం చదివినా అందరితో పంచుకోవాలనిపిస్తుంది. లోకాభిరామమ్‌లో ఎన్ని సంగతులని చెప్పగలను? పైగా, ఆ మధ్యన ఒక మిత్రుడు ఫోన్ చేసి ‘లోకాభిరామం’ గురించి మాట్లాడాడు. ఆయన మొదటి నుంచి, కాలంను చదువుతున్న శ్రేయోభిలాషి.

10/08/2016 - 23:04

ఒక విషయాన్ని ఎత్తుకుంటే, దాని గురించి ఎంత దూరమయినా రాయవచ్చు ననిపిస్తుంది. కానీ, ప్రపంచంలో ప్రతి పనికి పరిధులు కూడా ఉండాలి. ఉంటేనే మేలు. విషయాన్ని ఇంకొకసారి ఎత్తుకోవడానికి అవకాశం మిగులుతుంది. సంగీతం నాకిష్టం. కనుక అది అందరికీ ఇష్టం అనుకుంటే తప్పు. కవిత కూడా నాకు నచ్చుతుంది. ఒకనాడు గాలిలో పాట తేలియాడుతుంది. మరొకనాడు కథ, ఇంకొకనాడు కవిత. ఆ మరునాడు ఒక గీత, అంటే బొమ్మ.

10/01/2016 - 21:06

బాగా గుర్తుంది. 11వ తరగతిలో ఉండగా నాగభూషణం గారని ఒక పంతులుగారు సోషల్ స్టడీస్ బోధించారు. ఒకప్పుడు చరిత్ర, భూగోళం అని రెండు విషయాలు వేరుగా చెప్పేవారు. పద్ధతి ఎప్పుడు మారినదీ గుర్తులేదు. ఎక్కడో ఒకచోట ‘జూడర్జీతో డచ్చివారు’ అని ఒక పాఠం చదివినట్టు మాత్రం మెదడులో ఒక ముడి నిలబడి మిగిలింది. ఇంతకూ ఒకనాడు నాగభూషణం గారికి ఒకనాడు, నేను పాఠం ధ్యాసతో వినడం లేదని అనుమానం వచ్చింది.

09/24/2016 - 22:36

సినిమా పాట నిజానికి పల్లెకు పోదామని ఉంది కదూ! ఆ తరువాత పారును చూద్దాం అని కూడా ఉంది. దేవదాసు సినిమాలో హీరోయిన్ పేరు పార్వతి. అప్పట్లో సినిమా పాటలు సినిమాలో అతికినట్టు రాయించుకునే వారన్నమాట. మరి లోకాభిరామంలో వ్యాసాలు కూడా అతికినట్టే రాయాలి కదా! కనుక పక్క కొమ్మల మీదికి ఎక్కకుండా అనుకున్న పద్ధతిలో పెళ్లిళ్ల గురించే చెప్పుకుందాం.

09/18/2016 - 21:55

మంచికో, చెడుకో మనిషికి ఒక పేరు వస్తుంది. అది బహుశా సులభంగానే వస్తుంది. అందరికీ అంత సులభంగా రాకపోవచ్చు. కొంతమంది పేరు చెప్పగానే అందరూ మొహం అదోలాగ పెడతారు. అటువంటి పేరు కూడా చాలాకాలం కొనసాగుతుంది. ఆ మనిషి ‘నేను మారానంటే నమ్మరేం’ అంటూ గడ్డం పెంచుకుని పాటలు పాడినా ఎవరూ అతగాడిని నమ్మరు. అది వేరే సంగతి. ఇక కొంత మంచి పేరు వస్తుంది. ఆ వచ్చిన మంచి పేరును నిలబెట్టుకోవడం అసలు సిసలయిన సమస్య.

09/10/2016 - 23:38

సైన్సు ఎందుకు రాస్తున్నావు అని ప్రశ్న. బుద్ధిలేక అని నేరుగా జవాబు. వెతికితే ఇంగ్లీషు పత్రికలలో కూడ ఇటీవలి సైన్సు గురించి చదవడానికి ఏమీ కనపడదు. సైన్సు పత్రికలు దేశ స్థాయిలో కూడా లేవు. అయినా పట్టువదలని వక్రమార్గుడి వలె నేను ఎందుకు సైనే్స రాస్తున్నాను. ఈ మాటలకు జవాబు చెపితే నాలాంటి మరి కొందరిని కూడ ఇదే ప్రశ్న అడిగి అందరి జవాబులను ఒక పుస్తకంగా అచ్చేస్తారట.

09/02/2016 - 22:15

వానికి గోపియను పేరు పెట్టిరి. వాడు వాస్తవముగనే ముక్కుమీద గోపము గలవాడాయెను. వాడు నాకు చాలా గొప్ప పేరున్నదనును. ఆ పేరెక్కడనున్నదని ప్రశ్న బుట్టును. కొందరికి వారి పేరు గోడ మీద నుండును. గోడ మీదకన్నను, గోడకు తాపితము జేసిన నొక జెక్క మీద చెక్కబడి యుండుననిన కడు సమంజసముగా నుండును. వీనికట్టి పేరు లేదు. అట్లున్న పేరు గొప్ప పేరెట్లగును? అది చెక్క మీద పేరగును. ఒకనికి గొప్ప పేరున్నదన్న నేను భావము?

08/27/2016 - 22:49

మనిషి చెట్ల మీద నుంచి దిగి బతకాలని అనుకోవడం ఒక తప్పు అన్నారు. ఇక జీవం సముద్రంలో నుంచి నేల మీదకు రావడమే తప్పు అన్నారు మరి కొందరు - డగ్లస్ ఆడమ్స్
* * *

08/20/2016 - 22:00

నిప్పు జీవంగలది. అది శ్వాసిస్తుంది, అందిన దాన్ని తింటుంది, అసహ్యించుకుంటుంది. మంటను గెలవాలంటే మనమూ దానిలాగే మెలగాలి. దానిలాగే ఎటుపడితే అటు కదలాలి. మండే పదార్థాలు ఉన్నాయని మంటకు తెలియదు. మంట ఉందని మండే పదార్థాలకు తెలియదు. మంట, నిప్పు కలిసి మన ప్రపంచాన్ని మార్చేశాయి. ఒకానొక సినిమాలో ఒకానొక పాత్ర అన్న మాటల ఆధారంగా.
* * *

,
08/12/2016 - 23:07

వెయ్యి గొంతుల మధ్యన కూడా తెలిసిన గొంతు వెంటనే వినిపిస్తుంది. ఇష్టమున్న గొంతు మురిపిస్తుంది. - ఎవరన్నారో తెలియదు.
* * *

Pages