S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
లోకాభిరామం
పాత పేపరు: ఈ మధ్యన ఒక ప్రకటనలో ఒక వింత సంగతి చూచాను. ఒకానొక సరికొత్త మాడల్ మొబైల్ ఫోన్ (సెల్‌ఫోన్ అంటే సులభంగ అర్థమవుతుందేమో!?) కొంటే, ఆ సందర్భంలో మన దగ్గరున్న పాత ఫోన్ తిరిగి ఇస్తే, కొత్త ఫోన్ ధరలో తొమ్మిది వేల రూపాయలు తగ్గిస్తాడట! రట! ఇందులో వింత ఏముందని అడగదలుచుకున్న వారికి దండాలు. నాకు అన్ని విచిత్రంగనే వింతగనే కనిపిస్తయి మరి! అంత తగ్గిస్తరంటే అసలు ఆ ఫోను ధర ఎంత ఉంటుంది.
నినాదాలు: టీవీ చూడాలంటే భయమవుతుంది. తెలుగు టీవీల్లో భాష ముందు భయపెడుతుంది. పండితులు వచ్చి ‘అయినటువంటి’ అంటారు. ఆ మాట లేకుండా ఒక్క వాక్యం ముందుకు నడవదు. రిపోర్టర్‌లు వచ్చి ‘నేపథ్యం, పరిస్థితి’ అంటారు. నాయకులు, నాయకులు అనుకునే వాళ్లు వచ్చి ‘చెప్పడం జరిగింది’ అంటారు. తల తిరుగుతుంది. ఛానల్ మారుతుంది. ఇక దిల్లీ గల్లీలలో జరిగిన సంగతుల గురించి ప్రపంచం మునిగింది, అన్నంత గోలగా చర్చలు జరుగుతుంటాయి.
యజమాని, యజమానురాలు, ‘జక్కడిని జాతరకు పంపించాలె’ అని మాట్లాడుకుంటున్నరట. ఆ మాటలు జక్కని చెవులలో పడినయి. జక్కడు, అర్థానికి యక్షుడయినా, వాస్తవానికి ఆ ఇంట్లో జీతగాడు. అంటే జీతము దీసుకోని పనిజేసేవాడు. ఈ లెక్కన సర్కారు కింద, కంపెనీలలో నౌకరీ చేసేటి వాండ్లందరు గూడ జీతగాండ్లే గదా! మాటల ఎనుక నడిస్తే, అసలు మతులబు మరుగున వడుతుంది. మనము జక్కని ఎంట, అంటే వెనుక, అంటే అనుసరించి పోదము.
కృష్ణమోహన్‌గారు, నేను, అప్పుడప్పుడు, నారాయణగూడ తాజ్‌మహల్ హోటేల్లో కలిసి భోజనం చేస్తూ, వీలయినంతసేపు మాట్లాడుకోవటం అలవాటు. అప్పుడప్పుడు ఆయన ఒక అనుకోని మిత్రుడిని కూడా పిలుస్తారు. కృష్ణమోహన్, నేను మంచి స్నేహితులం. అట్లని సమవయస్కులం మాత్రం కాదు. ఆయన కొడుకు ఇంచుమించు నా వయసు వాడు. ఒకనాడు ఆయనతోబాటు, ఇంచుమించు ఆయనంత వయసున్న పెద్ద మనిషి ఒకరు వచ్చారు. లాంఛనంగా పరిచయాలు జరిగినయి.
అంతా ప్రశాంతంగానే ఉంది. అంతట్లో ప్రార్థనకు సమయం అవుతుంది. ఒకసారి కాదు. దినంలో అయిదుసార్లు అవుతుంది. ఇక ఆస్తికులను పిలిచే కార్యక్రమం మొదలవుతుంది. ఊరికే పిలిస్తే అభ్యంతరం లేదు. మైకుల గోల మొదలవుతుంది. అవి మామూలు స్థాయిలో ఉంటే అభ్యంతరం లేదు. మైకులు మరీ ఎక్కువగా అరుస్తాయి. మైకులు ఉన్నాయని తెలియని ఆ మువజ్జిన్ మరింత గట్టిగా అరుస్తాడు. ఒకరే అరిస్తే ఫరవాలేదు.
అప్పుడెప్పుడో ఒక పుస్తకం గురించి సమీక్ష రాయవలసి వచ్చింది. రాశాను. వరుసగా చాలా పుస్తకాలకే సమీక్షలు రాశాను. ఇప్పుడు గుర్తు వచ్చిన ఈ పుస్తకం మరీ బాగుందని బహుశా మా అబ్బాయికి ఇచ్చినట్టున్నాను. అది అమెరికాలో ఉంటే, నేను ఇంట్లో వెతికితే దొరకదు. ఇంట్లో పోయిన సూదిని ఆవిడెవరో బజారులో లైటు కింద వెతికిందట! అదేమిటని అడిగితే, ఇంట్లో మరి లైటు లేదు గదా అన్నదట!
పోలీసులను చూస్తే నిజానికి మన దేశంలో కనీసం అందరూ భయపడతారు. వాళ్ల నుంచి దూరంగా ఉండడం మాత్రమే మంచిదని అందరికీ గట్టి నమ్మకం. వాళ్లు మాత్రం రక్షకులు. ఎవరినీ ఎప్పుడు ఎట్లా రక్షిస్తారన్నది అందరికీ అర్థంకాదు. నాకు కూడా పోలీసుల నుంచి దూరంగా ఉండడమే అలవాటు. అందరిలో నేనూ ఒకణ్ణి కనుక నాకు ఆ రకమయిన ఆలోచన వచ్చి ఉంటుంది. అది నా స్వంత ఆలోచన కాదు. సమాజం నాకు రుద్దిన ఆలోచన.
గురువులు అన్న మాటకు చీకటిని పారద్రోలుతాడని, మరొకటని నానా కష్టాలూ పడి నిర్వచనాలు చెపుతూ ఉంటారు. గురువులు అనే మాటకు దేశికులు అనే మరొక రూపం కూడా ఉంది. ఆ మాటకు అర్థం చెప్పుకుంటే, మరింత లోతుకు పోవచ్చు. మొత్తానికి దారి చూపించేవారు గురువులు అని ఒక్క మాటలో చెప్పుకోవచ్చు. అమ్మానాన్న అసలు గురువులు. వాళ్ల వల్ల మనకు మన పేరుతో మొదలు మరెన్నో సంగతులు తెలుస్తాయి. ఆ తరువాత విద్యా గురువులు వస్తారు.
జిహ్వకొక రుచి, పుర్రెకొక బుద్ధి అన్నారు. ఎందుకన్నారో నాకు తెలియదు. బహుశా నా గురించే అని ఉంటారు. నా పుర్రెకు ఒకటి రెండు విషయాలు మాత్రమే తెలుసు. తెలిసింది పుర్రెలోని మెదడుకు. దాన్ని మరి బుర్ర అంటారేమో! సొరకాయ బుర్రలో లోపల ఖాళీ ఉంటుంది. పుర్రె అనే బుర్రలో బుర్ర ఉంటుంది. ఆ బుర్రలో పదార్థం ఉంటుంది. అందులో ఆలోచనలు ఉంటాయి! కన్యాశుల్కంలోని వెంకటేశానికి చేగోడీలు, గేదె పెరుగు తెలుసు.