S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
లోకాభిరామం
చెప్పిన కథ చెప్పకుండా చెపుతున్నాను. కించిత్తు గాత్ర సౌలభ్యం చెడింది, అని కథాకారుడు, పాలు, మిరియాలు అడుగుతాడు. నేను కొన్ని విషయాలను గురించి మాత్రమే అట్టు అటువేసి, ఇటు వేసి అన్నట్టు రాస్తున్నాను. కొంచెం కలం అరిగినట్టు నాకే ఒకోసారి అనిపిస్తున్నది. చెప్పవలసినవి చాలా ఉన్నాయని ఎప్పుడూ అనిపిస్తుంది. ఏం రాయాలి అనే నిర్ణయానికి వచ్చే సమయానికి అనుమానాలు మొదలవుతాయి. ఆదివారంనాడు ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు.
ఆగే బఢ్‌తే అంటే ముందుకు సాగుతూ అని అర్థం. అతను నడుస్తూనే ఉన్నాడు. ముందుకు కదులుతున్నాడు కూడా. నాలుగు అడుగులు నడిచే లోపల ఆలోచనలు మరెంతో దూరం ముందుకు, వెనుకకు వెళ్లి వస్తుంటాయి. అందుకే అతను హాయిగా ఆలోచిస్తూ ఒంటరిగా నడుస్తాడు. అట్లాగని అతని వెంట నడవడానికి అందరూ సిద్ధంగా నిలబడి ఉన్నారని కాదు. పక్కన మనిషి ఉంటే మాటలు మొదలవుతాయి.
రేడియోలో అవసరం కొద్దీ సైన్స్ రాశాను. చదివాను. నాతో నేనే పోటీ పడి ఏవేవో వింత పనులు చేసి ఆనందం పొందాను. విన్నవారు కూడా ఆనందంగా ఉందన్నారు. అటు
తరువాత పత్రికలలో రాయవలసిందిగా మిత్రులు ప్రోత్సహించారు.
సీరియల్ ఒకటి సీరియస్‌గా నడుస్తున్నది. అందులో బరువు డయలాగులను చాలా తేలికగా చెప్పేస్తున్నారు. ‘మెదడంటూ ఉండాలే గానీ, మనసును కట్టిపడేయడం తేలిక పని!’ అన్నది ఒకావిడ. ‘ఎవరూ ప్రయత్నించి ప్రేమించరు. ప్రేమ అనుకోకుండా జరుగుతుంది’ అన్నది ఇంకొక అమ్మాయి. ఎంతటి మాటలు? ఇలాంటి బరువు మాటలను సినిమాల్లో అంతగా విన్న గుర్తులేదు. సీరియల్స్ కూడా విన్న గుర్తు లేదు. అందుకు కారణం అతి సింపుల్.
కొండ కొమ్మున ఒక ఇల్లు. ఇంట్లో ఇద్దరే ఉంటారు. అందులో ఒకతను దొంగ. ఇప్పుడు దొంగతనాలు మానుకుని హాయిగా బతుకుతున్నాడు. బయట ఎక్కడో అచ్చం అతని తరహాలోనే దొంగతనం జరిగిందని పోలీసులు అతని కోసం వస్తారు. ఇంట్లోని ఇద్దరు కనిపించి, కనిపించకుండా పోతారు. పోలీసులు వేచి ఉంటారు. అంతలో ఇంటి నుంచి కారు ఒకటి వేగంగా బయలుదేరిపోతుంది. పోలీసులు అందరూ, ఉండేది ముగ్గురే అనుకుంటా, వెంటపడి తరుముతారు.
అతను అయిదవ అంతస్తు అనే ఆకాశంలో నుంచి నేల మీదకు దిగి నడుస్తున్నాడు. మరీ ఎక్కువ దూరం నడిచినట్లేమీ లేదు. పార్కులో పెద్ద మనుషుల చర్చ వినిపించదు గానీ కనిపిస్తుంది. వాళ్లు కొంపలు ములిగితే కాపాడుతున్నాము అన్నంత సీరియస్‌గా మాట్లాడుతుంటారు. పార్కులో చుట్టూ ఒక బాట వేశారు. అది వాకర్స్ ట్రాక్. అంటే నడవదలచుకున్న వారికొరకన్న మాట.
నేను ఇన్ని పుస్తకాలు రాశాను గానీ, ఏనాడూ ఒక ఆవిష్కరణ సభ పెట్టాలని, అందరి ముందు మాట్లాడాలని అనుకున్నది మాత్రం లేదు. విశాలాంధ్రలో మొదటి పుస్తకం వచ్చినప్పుడు సభ పెట్టాలన్న ప్రతిపాదన వచ్చింది. కానీ నేనే వద్దన్నాను. మొత్తానికి ఎవరో ఒకరు వచ్చి నా పద్ధతిని పక్కదారి పట్టిస్తారని నేనెప్పుడూ అనుకోలేదు. కానీ అది జరిగింది. పుస్తకం ఆవిష్కరణ పేరున గుంటూరు దాకా ప్రయాణం చేయవలసి వచ్చింది.
నాన్న ఒక ట్రాన్సిస్టర్ రేడియో కొని తెచ్చాడు. ఇక నేను అదే పనిగా సిలోన్‌లోనూ, ఇతర స్టేషన్‌లలోనూ సినిమా పాటలు వినసాగాను. సంగీతం వింటే మాగుంటుందని నాన్న చూచాయగా మాత్రమే చెప్పాడు. నిజానికి ఆయన శాస్ర్తియ సంగీతం అంతగా విన్నట్టు గుర్తు లేదు.
................
పోలికల ప్రకారం చూస్తే చింపాంజీలు మనుషులకు
అన్నింటికన్నా దగ్గర రకం. తర్వాత గొరిల్లాలు. ఆ తరువాత ఒరాంగుటాన్‌లు. ఈ మూడు రకాలు, ఒకే జాతి నుంచి వచ్చినవా తెలియదు. ఇక ఏప్స్ తరువాతే, కోతులు మనకు
చుట్టాలవుతాయి. అంతేగాని అవి మనకు తాతలు కావు.
తాత చుట్టాలు మాత్రమే!
...............
ఒక పుస్తకం అచ్చవుతున్నది. నిజానికి అచ్చు అయింది. కవర్‌పేజ్ కూడా అచ్చయింది. ఆ రెంటినీ కలిపి బైండ్ చేసే పని మిగిలి ఉంది. ఏనుగెళ్లింది, తోక మిగిలింది అన్న పద్ధతి అన్న మాట! (నా మాటే!) ఏమిటి ఆలస్యం? అంటే కొత్త సంవత్సరం వస్తున్నది గద! కాలెండర్‌లు, డైరీల పనిలో అందరూ బిజీగ ఉన్నారు అన్నారు. (మాటల గురించి ఆలోచించడం నా బలహీనతలలో ఒకటి. డెయిరీ అంటే పాడి పరిశ్రమ. డయరీ అంటే దినచర్య పుస్తకము.