S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లోకాభిరామం

06/04/2017 - 01:29

ఈ మధ్యన పెళ్లి గానీ, మరో సంబరం గానీ, ఎక్కడికి వెళ్లినా, భోజనంలో
మిర్చ్భీజ్జీ లేకుండా గడవడం లేదు. ఈ విషయం వెనుక ఏదయినా విదేశీ హస్తం లాంటి కుట్ర ఉందంటారా? మనవాడు ఆలోచనల్లో తేలుతున్నాడు. మునుగు
తున్నాడు. అటు మనుషులను
పట్టించుకోవడం లేదు. ఇటు సంగతులను, శరీరాలను పరిశీలించడం లేదు. అప్పుడు మరి ఏదో జరగాలి. జరిగింది.
అతని దృష్టి మారింది.

05/14/2017 - 18:45

పల్లె పల్లెగా ఉన్నప్పుడు, వ్యవసాయం, వ్యవసాయంగ ఉన్నప్పుడు, ఊర్లో కులవృత్తుల అవసరం, వారికి గౌరవం ఉండేవి. ఇక్కడ నేను కుల వ్యవస్థ గురించి చర్చించే ప్రయత్నం చేయడంలేదు. మా పల్లెలో తాడి, తాటి చెట్లు లేవు. మా ప్రాంతంలో ఈతచెట్లు ఉండేవి. అవి గూడ మా ఊళ్లో లేవు. అయినా ఊళ్లో గౌండ్లు అనే ఈడిగె వాండ్లు ఉండిరి. ఇప్పటికీ ఉన్నరు. మా అసలయిన స్వంత ఊళ్లో పొలం ఉండేది.

05/07/2017 - 05:26

అతను నడవాలనే అయిదవ అంతస్తు నుంచి కిందకు దిగాడు. అందుకే ఆగకుండా నడుస్తున్నాడు. బయలుదేరగానే ఎవరో అడిగినట్లున్నారు ‘వాకింగా?’ అని. అందరూ నడుస్తారు. ఇంట్లో ఒక గది నుంచి మరొక గదికి నడుస్తారు. ఏదో అవసరం వచ్చిందని అంగడి దాకా నడుస్తారు. అదంతా నడక. నిజానికి నడక అవసరం లేనప్పుడు, ప్రత్యేకంగా బయలుదేరి, ఆగకుండా నడిస్తే అది వాకింగ్. అందుకు ప్రత్యేకమయిన జోళ్లు, దుస్తులు కూడా ఉంటాయి.

04/29/2017 - 23:49

చిత్రకారుడు బాపు, కార్టూన్‌లు వేసి కితకితలు పెట్టినపుడే బాగుండేది. ఆయనకు సినిమా చీమ ఎందుకు కుట్టిందీ, కనీసం నాకు, అర్థం కాదు. ఒకానొక మాసపత్రిక దీపావళి ప్రత్యేక సంచికలో ఆయన అప్పట్లో ఒక కార్టూన్ సీరియల్ వేసేవారు. బంగారం - సింగారం అనే కథలో ఆయన అప్పారావు అనే ఒక పాత్రను మనముందుంచారు. అదే అప్పారావును అందాల రాముడు సిన్మాలో రాజబాబు రూపంలో మరోసారి ప్రవేశపెట్టారు.

04/22/2017 - 23:48

బండిమీద చింతచిగురు బూడ్డెవోసి (కుప్ప పేర్చి) అమ్ముతుంటరు. ఎంత? అని అడగాల్సిన పని. దానికి ఎట్ల యిచ్చినవు? అని ప్రశ్న. కిలో ధర చెపితే ముందు, అంత ఎవరూ కొనరు. కొని ఆరబెట్టి వాడుకోదలుచుకున్నా, ఆ ధర విన్న తరువాత గుండె ఆగిపోతుంది. ఇంక చింతచిగురుతో పనే ఉండదాయె. అందుకే యాభయి గ్రాములు, వంద గ్రాముల ధర చెపుతరు. గుండె ఆగినంత పని అవుతుంది. కానీ ఆగదు. అయినా తినక తప్పదు. రుచి మరిగిన నోరు అంటరు.

04/17/2017 - 00:50

ఒక నవలకు మంచి పేరు వస్తుంది. దాన్ని ఆధారంగా ఒక సినిమా వస్తుంది. అది సూపర్‌హిట్ అవుతుంది. అందుకు చాలామంది అవసరమని విడిగా చెప్పనవసరం లేదు. ఆ సినిమాలో ఒక పాట ఉంటుంది. అది నాలాంటి ఎంతోమంది మనస్సుల్లో నాటుకుంటుంది. మెదడులో తిరుగుతుంది. వ్యాసం రాయిస్తుంది.

04/09/2017 - 00:16

అంగడిలో ఒక సరుకు కొంటారు. కొంతకాలం తరువాత అదే అంగడికి వచ్చి అదే సరుకు అడిగారు అంటే, ఆ సరుకు నచ్చిందని కదా అర్థం! నాగపూర్‌లో శివాజీ కాలేజ్ వాళ్లు నన్ను మళ్లీ ఉపన్యాసానికి పిలిచారు. ఈసారి కూడా అదే అంశం గురించి మాట్లాడమన్నారు. నాకు ఒక్క క్షణం నిరాశ కలిగినట్టుంది. కానీ, శ్రోతలు, సభికులు మారతారు గదా, అని నన్ను నేను ఊరడించుకుని ఉపన్యాసానికి సిద్ధం అయ్యాను.

04/01/2017 - 23:32

అతను

03/30/2017 - 02:42

చాలా కాలం నాటి మాట. ఏదో ఒక పత్రిక చదువుతున్నాను. పర్యావరణం గురించి వ్యాసం కనిపించింది. అప్పట్లో పర్యావరణ పరిరక్షణ గురించి మాట్లాడడం, రాయడం ఒక పద్ధతి. పర్యావరణాన్ని మనం రక్షించేది ఏమిటి? పాడు చేయకుండా ఉంటే చాలు అన్న పద్ధతిలో నేనూ రాశాను అప్పట్లోనే. వ్యాసం ఎత్తుగడ బాగుంది. ఆలోచన కూడా బాగుంది. చదువుతూ పోతే సంగతి మొత్తం ఏదో తెలిసిన వ్యవహారం లాగ కనిపించింది.

03/18/2017 - 23:30

వంద నవలలు, కథలకన్నా, అద్దంలో వలె ఎదుట కనిపిస్తున్న బతుకు ఆసక్తికరమయినది, అనిపిస్తుంది. అవును, నిజమేగాని, దాన్ని అందరి ముందు పరిచి పంచుకోవడానికి అభ్యంతరాలు ఉండయి. ముందు, దాన్ని అందంగ చెప్పేటందుకు చేతనయి ఉండవలె. అది పెద్ద సమస్య కాదు, అనే అనుకుందాము. ఈ బతుకు నా ఒక్కనిది కాదు. ఇందులో ఎంతో మంది ముందు వెనుక, ఇరుపక్కల ఉంటేనే అది సాగింది. సాగుతున్నది. ఇంకెంత కాలమో తెలియదుగాని సాగుతుంది.

Pages