S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లోకాభిరామం

09/09/2017 - 21:32

ప్రపంచ కథా సాహిత్యాన్ని తెలుగు పాటకులకు అందించాలని తపన పడుతున్న వారిలో నేను కూడా ఒకడిని. అందుకొరకు నేను చాలా మంది రచయితల కథలు ప్రపంచం నలుమూలల నుంచి సేకరించే పనిలో పడ్డాను. చాలా సేకరించాను. ఎంతమంది రచయితలు? ఎన్ని రకాల కథలు? వాళ్లందరి రచనలు, కనీసం నేను సేకరించినవి చదవడానికి నాకు సాధ్యం కాదని అర్థమయింది.

09/03/2017 - 00:04

అతను నడుస్తున్నాడు. కానీ వడివడిగా మాత్రం కాదు. అతని తీరే అంత. పరుగులు, ఉరుకుల అవసరం ఏమిటి? ఇంట్లో నుంచి బయలుదేరింది ఎందుకని? ఎవరి మీదయినా యుద్ధం చేయడానికి కాదు గదా! ఆరోగ్యం కొరకు వాకింగ్ చేయాలన్న ఆలోచన అతనికి ఇంకా రాలేదు. కనుక తన తీరు నడక సాగిస్తుంటాడు. కానీ ఇప్పుడు అతను ఆలోచనలో తీవ్రంగా మునిగినట్లు కనబడుతుంది. మామూలు కన్నా నెమ్మదిగా నడుస్తున్నాడు.

08/26/2017 - 22:32

నేను ఒక ప్రసిద్ధ పత్రికకు వ్యాసం రాశాను. మామూలుగానే పేజీ తయారయింది. సబ్‌ఎడిటర్ దాన్ని ఎడిటర్‌గారి ముందు ఉంచాడు. ఆ ఎడిటర్ పత్రికా రంగంలో గొప్ప పేరున్న మనిషి. శీర్షిక చూడగానే ముఖం ముడుచుకుని ‘ఏంటయ్యా ఇది?’ అన్నాడట. కానీ కింద బైలైన్ అంటే రచయిత పేరు చూచి ‘అబ్బో! ఇతనా! అయితే వదిలెయ్!’ అన్నాడట. ఈ సంగతి ఆ సబ్ ఎడిటర్ పట్టలేక నాకు చెప్పాడు.

08/20/2017 - 00:05

పేరుగల పండితులొకరు ఫేస్‌బుక్‌లో గణపురము చాంతాడంత సంస్కృత సమాసాలు ఒక దానికన్న ఒకటి పొడుగుగ తయారుచేసి ప్రదర్శనకు పెడితే, వాటి గురించి చర్చ మొదలయింది.

08/12/2017 - 22:26

ఒకాయన ఆసుపత్రిలో అనారోగ్యంతో పడుకుని ఉన్నాడు. చాలా బలహీనంగా ఉన్నాడు. ఆ ఆసుపత్రిలో ఆయన చాలా రోజులుగా ఉన్నాడు. ఒకనాడు ఒక వింత విషయం తెలిసింది. కోర్టు కేసు కారణంగానో మరొక రకంగానో ఆయనకు చాలా బోలెడు డబ్బు, ఆస్తి వచ్చాయని తెలిసింది. ఆ సంగతి ఆయనగారికి చెప్పాలి. ముందే అనారోగ్యంగా ఉన్నాడు. ఏమయిపోతాడో అని, ఆయనకు కావలసిన వారంతా మల్లగుల్లాలు పడుతున్నారు.

08/07/2017 - 00:03

అయిదు వారాలు, అనవరతంగ, నా ఆలోచనలతో ఊదరగొట్టేసరికి అందరూ కాలం మారింది, లోకాభిరామం అనే కాలమ్ మారింది అనుకున్నరు. ఏమీ మారలేదు. అందుకే మరోసారి నడుస్తున్న మన ‘అతని’ గురించి, కొరకు వెదుకుతూ వెళదాం పదండి!

07/30/2017 - 23:27

విశ్వం చాలా పెద్దది. అందులో మనిషి పరిశీలించినది చాలా తక్కువ. ఆ తక్కువ మీదనే ఇప్పుడున్న తెలివి మొత్తం ఆధారపడి ఉన్నది. తెలిసిన ఈ నాలుగు సంగతులు శాశ్వత సత్యాలు, సర్వత్రా సత్యాలు అన్న భావంతో మనిషి ముందుకు పోతున్నాడు. విశ్వానికి మనమే నిర్ణయించిన కొన్ని లక్షణాలు ఉన్నాయి. పదార్థ నిర్మాణానికి ఆధారమయిన న్యూట్రాన్, ఎలక్ట్రాన్ లాంటివి మొదటి ఉదాహరణ. అవి నిరంతరం కదులుతూ ఉండే నిర్మాణాలు.

07/22/2017 - 22:33

ఆలోచన సామాన్యం. అంటే అందరికి వస్తుంది. అందులో ఎవరికి వారే ప్రత్యేకం. ఎవరి ఆలోచన వారికి వస్తుంది. శరీరంలో కూడా ఇదే రకమయిన వైవిధ్యం. ఇదే రకమయిన సమానత్వం కనపడుతున్నాయి. మెదడు, చేతన అన్నవి మరొక స్థాయిలో వైవిధ్యానికి, సామాన్యతకు ఉదాహరణలుగా ఉన్నాయి.

07/16/2017 - 04:36

రెండు వారాలుగా సాగుతున్న ఈ చర్చ మరింత దూరం నడవాలని నా అభిమతం. నేను చెప్పదలుచుకున్న సంగతులు నేనే చెప్పాలి. మరొకరు చెప్పరు. కనుక చెపుతున్నాను. దయచేసి నా కొరకు చదవండి.

07/09/2017 - 00:10

గడచిన వారం లోకాభిరామం చదివినా చదవకున్నా ఈ సంగతులు మీకు అర్థమవుతాయి. మన గురించి మనం ఆలోచించ వలసిన అవసరం ఉంది అనుకునే వారంతా ఈ మాటలను గురించి ఆలోచించాలి కూడా.

Pages