S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లోకాభిరామం

03/06/2018 - 22:46

ఏమొదట్లో... అన్నిటికన్నా మొదట్లో.. ఏ అన్నిటికన్నా.. అసలు అన్నిటికన్నా.. అనగా.. ఈ ప్రపంచము, విశ్వమూ ఏవీ లేనప్పుడన్నమాట... నిజంగా మొదట్లో అసలేమీ లేదు. ఆ పరిస్థితిని ఊహించడమే కష్టం. ఇవాళ మనకు అన్నిటికన్నా చిన్నది అని చెప్పవలసి వస్తే పరమాణువు గుర్తుకు వస్తుంది. మన ప్రాచీనులు కూడా పరమాణువులలో అణువు, మహత్తులలో మహత్తు అంటూ వర్ణనలు చేశారు. పరమాణువులో భాగాలున్నాయి అంటున్నారు. అందులో ప్రోటాన్ ఒకటి.

02/24/2018 - 22:34

మంటో బతుకు కూడా అదుపు లేకుండానే జరిగింది. అతను తెగ తాగేవాడంటారు. ఒక వ్యాసంలో అతనే రోజుకు ఒక సీసా మాత్రమే తాగానని రాసుకున్నాడు. ఒక కథలో మాత్రం ఒకేనాడు పదిహేను కాయలు లాగించినట్టు కూడా రాస్తాడు. బతుకు, రచనలు అతడిని భయపెట్టిన జాడలు కనిపించవు. ‘అవలక్షణాలు, అనారోగ్యాలు, అపభ్రంశాలు అన్నీ కలగలిసి ఉన్న నా పాత్రలను నేను నావిగా అంగీకరిస్తున్నాను’ అంటాడు మంటో. అతను 42 సంవత్సరాల వయసులోనే వెళిపోయాడు.

02/17/2018 - 23:15

ఓటు నిజంగానే చేటు తెచ్చింది. హాయిగా బతుకుతున్న అన్నదమ్ముల మధ్యన కూడా చిచ్చు మొదలయింది. ఈ పరిస్థితి ఒక మా ఊరిలోనే కాదు అని నేను ఊహించగలను. పోటీ
మనస్తత్వం ఒక రకంగా ఉన్నంతవరకే బాగుంటుంది. ఆ పోటీలో శత్రుత్వ భావం మొదలయిన మరుక్షణం
పరిస్థితి మారుతుంది.

02/03/2018 - 21:23

నన్ను చాలా అభిమానించిన మిత్రురాలు నన్ను ‘ఓటి బుర్ర’ అంటూ ఉండేది. చదువు తప్ప మరేదీ నా తలకు ఎక్కదని ఆవిడ భావం అనుకుంటాను. ఓటు అనే మాట మనకు తెలుగులో మొదటి నుంచీ ఉందని అర్థం. ఓటు కుండ, ఓటికుండ అంటే కుండలో, నా బుర్రలోలాగే ఏమీ లేదని అర్థం. ఓటమి అన్న మాట కూడా ఈ రకంగానే పుట్టి ఉంటుంది. అయితే మనం, ఎన్నికలలో ఓటు వేసేస్తున్నాము. అంటే మన ఖాళీ భావాన్ని వెలిబుచ్చుతున్నాము అనుకోవాలా?

01/27/2018 - 23:43

సాహితీ మిత్రులతో మాట్లాడుతూ ఉండగా రచయితల గురించి ప్రసక్తి వచ్చింది. పట్టించుకుని ప్రపంచానికి ఎత్తి చూపించవలసిన రచయితల గురించి చర్చ మొదలయింది. సాదత్ హసన్ మంటో ఉర్దూలో పెద్దఎత్తున కథలు రాసిన మహా రచయిత. మామూలు పద్ధతికి ఎదురుతిరిగి తన కలం వాడితో వేడి పుట్టించిన రచయిత. ఆయన కథలు తెలుగులో వందకు పైన వచ్చాయని మిత్రులు చెపితే, ఆశ్చర్యం కలిగింది.

01/20/2018 - 20:14

హాంటింగ్ మెలొడీస్ అని నాకొక పద్ధతి ఉన్నది. కొన్ని పాటలు వద్దన్నా నా మెదడులో తిరుగుతూ ఉంటాయి. వాటిలో మొదటిది అక్క మహాదేవి రచించిన ఒక కన్నడ వచనం. తెలుగులో కూడా వచనాలు ఉన్నాయి. వాటిని పాడాలని ఎవరికీ తోచినట్టు లేదు. పెద్దలు గమనింతురు గాక.

01/13/2018 - 17:44

సూర్యుడు తూర్పున ఉదయించును, అంటే ఈ ప్రపంచంలో తొంభయి తొమ్మిది శాతం మంది అవును అంటరు. సూర్యుడు ఉదయించడము, అస్తమించడము నిజమే. అయితే కదిలేది సూర్యుడు కాదు భూమితో బాటు మనం సూర్యగోళం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాడు. ఒక చుట్టు తిరగడానికి ఒక సంవత్సరము. అయితే సూర్యుని చుట్టు తిరుగుతున్న భూమి, బొంగరంలాగ తన చుట్టు తాను కూడా తిరుగుతున్నది. కనుక పగలు రాత్రి కలుగుతున్నయి.

01/06/2018 - 23:10

క్యాలెండర్ మారింది. అంతకు మించి మరేదీ మారదు. సూర్యుడు నిత్యంలాగే తూర్పున ఉదయిస్తాడు. పడమట అస్తమిస్తాడు. ఆ సూర్యుడి కదలికలను లెక్కించడానికి మనిషి వేసుకున్న పథకం క్యాలెండర్. ఆ సంగతి సూర్యుడికి తెలియదు. కొత్త సంవత్సరం అని అందరూ ఎంత గోల చేస్తున్నా అతను మాత్రం తన దారిలో, తన పాత దారిలో, తన పద్ధతిలో, తన పాత పద్ధతిలో నడిచి వెళ్లిపోతాడు.

12/23/2017 - 23:46

ధనుర్మాసంలో ఒకరోజున ఉదయానే్న గుడిలో పూజలు జరిగాయి. పులిహోర, దధ్యోధనం, చక్కెర పొంగలి ప్రసాదాలు పుష్కలంగా పెట్టారు. అందరూ లేచి బయలుదేరుతున్నారు. ‘ఒక కప్పు టీ కూడా ఇస్తే, ఇంటికెళ్ల నవసరం లేకుండా ఇక్కడి నుంచే పనిలోకి వెళ్లిపోయేవాళ్లం కదా!’ అన్నాడొకాయన. చాయ, మనలను ఛాయలాగ పట్టుకున్నది. మన అలవాట్లలో భాగమయింది. కానీ ఆచారాల్లో భాగం కాలేదు. లేకుంటే గుడిలో తీర్థంతోబాటు ‘టీ’ర్థం కూడా ఇచ్చేవారేమో?

12/17/2017 - 01:18

చప్పుడు లేని పేలుడు గురించి ఆలోచిస్తే అది ఎప్పుడు జరిగిందని ఒక ప్రశ్న. ఇదిగో, ఈ విషయం గురించి ఒక హోటేల్‌లో కూచుని ఇద్దరు సైంటిస్టులు మాట్లాడుకుంటున్నారట. వాళ్ల మాటలు విశ్వం ముగిసిపోవడం వేపు మళ్లాయి. దాని పుట్టుక చెప్పాపెట్టకుండా జరిగినట్టే. ముగింపు కూడా జరిగే వీలుందని వాళ్లు అనుకుంటున్నారు. పక్క బల్ల దగ్గర ఉన్న ఒక పెద్దమనిషి ఆత్రంగా లేచి వచ్చి వీళ్లను ‘అంటే విశ్వం ముగుస్తుందంటారా’ అని అడిగాడట.

Pages