లోకాభిరామం

లోతులు-రీతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నినాదాలు: టీవీ చూడాలంటే భయమవుతుంది. తెలుగు టీవీల్లో భాష ముందు భయపెడుతుంది. పండితులు వచ్చి ‘అయినటువంటి’ అంటారు. ఆ మాట లేకుండా ఒక్క వాక్యం ముందుకు నడవదు. రిపోర్టర్‌లు వచ్చి ‘నేపథ్యం, పరిస్థితి’ అంటారు. నాయకులు, నాయకులు అనుకునే వాళ్లు వచ్చి ‘చెప్పడం జరిగింది’ అంటారు. తల తిరుగుతుంది. ఛానల్ మారుతుంది. ఇక దిల్లీ గల్లీలలో జరిగిన సంగతుల గురించి ప్రపంచం మునిగింది, అన్నంత గోలగా చర్చలు జరుగుతుంటాయి. వాళ్ల భాషా భేషజంతో భయ్, ఉత్పన్న్ హోతాహై! వంటా వార్పు ఛానల్ చూతామంటే, ఏ ఎండ్రకాయనో ఉడకబెడుతుంటారు. ‘గంగనున్న చేపకప్ప ఎంగిలంటున్నాది’ అన్న పాట గుర్తుకు వస్తుంది. అయినా వేలుపెట్టి, వేలు పోసి ఇండియట్ బాక్స్ కొంటిమి, కొన్నాము. నెలసరి బాడుగ, కిరాయ ఈ మధ్యనే పెంచిరి, పెంచారు. కనుక కాసింత, కొంతసేపు టీవీక్షణము టీవీ వీక్షణము సాగవలె, సాగాలె, సాగాలి గదా!
అదొక ఇంగ్లీష్ న్యూస్ ఛానల్. అందులో ఒక గజిబిజి విడియో! అతను దేశంలోనే పేరెన్నికగన్న గొప్ప విశ్వవిద్యాలయంలో విద్యార్థి నాయకుడు. యూనివర్సిటీలో చదువు అంటే, కొంత తెలివి కొరకు (!), కొంత ఉద్యోగం సంపాయించేందుకు, సంపాదించడానికి (ఇంక ఈ పర్యాయ పదాలతో సతాయించను, కష్టపెట్టను లెండి!) సాగుతుందని నా మట్టిబుర్రకు అనిపిస్తుంది. కానీ, నాకు ఇంటి మీద రావి చెట్టు మొలిచింది. అంటే జ్ఞానోదయం అయింది. యూనివర్సిటీలలో రాజకీయాలు ఉండాలట. ఆలోచించగల, కొత్త ఆలోచనలను సృష్టించగల యువత ఈ రాజకీయంలో నుంచి పుట్టుకు వస్తరట! ఆలోచించాలంటే రాజకీయం అవసరమని ఒక సూక్ష్మం నాకు ప్రత్యక్షమయింది.
పేరా మొదట్లో ఒక ‘అతను’ గురించి ప్రసక్తి చేస్తిని గదా! అతను విద్యార్థి నాయకుడు. బాధ్యతగా ఆలోచించి కొత్త ఆలోచనలకు దారి వేయవలసినవాడు. అతను మాత్రం తీవ్రంగా నినాదాలు చేస్తున్నాడు. ‘మేము స్వతంత్రం తీసుకుని తీరతాము’ అన్నది మూల నినాదం. మారుమాట కాదు. అన్నింటికీ ఆధారమయిన నినాదం. మనువాదం నుంచి, జాతివాదం నుంచి మరేవో ప్రగతినిరోధక పద్ధతుల నుంచి ఆజాదీ తీసుకుంటానని, తీసుకుంటామని అతని నినాదం! ఇనాళ్లు ‘మాకు కావాలి’ టైపు నినాదాలుండేవి. ఇప్పుడు ‘లేకే రహేంగే!’ ‘తీసుకుని తీరతాము’ అంటున్నారు. ఈ మార్పు నాకు నచ్చింది. ఆ అబ్బాయి నినాదాలలోని తీవ్రత నన్ను నిద్రపోనివ్వడం లేదు. తల ఒకవేపు బాగా వంచి, పిడికిలి బిగించిన కుడిచేతిని పైకి ఎత్తుతూ అతను అరుస్తున్న తీరులో గొప్ప ఆర్తి కనపడుతున్నది. ఎంత కదిలిపోయి ఉంటే అంత కసిగా నినాదం చేస్తాడతను? నినాదాలను, విడియోలను కలగాపులగం చేసి, ఏదో చేస్తున్నారని రగడ! అది నాకు అర్థం కాలేదు. ఛానల్ మార్చలేదు. టీవీ ఆఫ్ చేసినట్టున్న.
నినాదం వల్ల నీ పరిస్థితి ప్రపంచానికి అర్థమవుతుంది. కావాలి అని నినాదం చేస్తే పని జరగదు. మంత్రాలకు చింతకాయలు రాలవు. ‘నాకు తిండి కావాలి’ అని నినాదం చేస్తే తిండి దొరకదు. పనిలోకి దిగాలి. తిండి దొరికే దారి చూడాలి. అడ్డుపడే వారిని తప్పించాలి. ఆ నిశ్చయం ఈ కొత్త నినాదంలో కనిపిస్తున్నది. న్యాయం కావాలి, అనేకన్నా మేం న్యాయం తీసుకుని తీరతాము అంటే, మునుముందు కార్యక్రమం ఏదో ఉందని అర్థంకదా! ఆలోచించే నాయకులు యూనివర్సిటీల నుంచి పుట్టి, రాజకీయంలోకి వచ్చి, విజయాలు సాధించిన ఉదాహరణలు ఉన్నాయా? నాకు రాజకీయం గురించిన జ్ఞానం తక్కువ. తెలిసిన వారు వివరం చెప్పాలి. ఉద్యోగాలు వదులుకుని వచ్చి ఊళ్లేలిన, చతికిలపడిన వారిని కొందరిని మాత్రం నేను ఎరుగుదును!
నంది రంగు: లేపాక్షి బసవయ్య, లేచి రావయ్యా’ అని అడివి బాపిరాజుగారు పాట రాశారు. అక్కడక్కడ గుడులలో ఉండే నంది విగ్రహాలు నిజంగానే లేచి వస్తాయేమోనన్నంత జీవంతంగా ఉంటాయి. ‘ఎద్దునెక్కినవాడు లింగడు. బొల్లి గద్దనెక్కినవాడు రంగడు’ అని ఒక భజన పాట, చిన్ననాట విన్న గుర్తు బలంగా ఉంది. గద్దనెక్కి తిరగడం గురించి సులభంగా ఊహకు అందదు. శివయ్య మాత్రం, చాలా ప్రాక్టికల్‌గా ఎద్దును వాహనంగా పెట్టుకున్నాడు. శివ బైలాజీ అనే పేరు కింద, శివపెరుమాన్, అంటే శంకర మహాదేవుని గురించి ఒక నవలాత్రయం వచ్చింది. అందులో, లేదా ఆ నవలల్లో శివుడిని ఒక చిన్నవర్గపు నాయకునిగా వర్ణిస్తారు. తెలిసిన కథనే అంతకు ముందు ఆలోచించని రూపంలో సాగిస్తారు. రచన బాగుంది. చివరి భాగం మాత్రం కొంత లాగినట్టు తోచింది. ఇంతకూ సంగతి ఏమింటే, ఆ నవలల్లో ఎక్కడా నంది వచ్చిన జాడ కనపడదు.
ప్రగతి ప్రింటింగ్ ప్రెస్ వారు, వారి కుటుంబంలో పెండ్లి వంటి ప్రత్యేక సందర్భం వస్తే ఒక మంచి పెయింటింగ్‌ను పరిమిత సంఖ్యలో అచ్చు వేయించి, కొందరికి రిటర్న్ గిఫ్ట్‌గా ఇస్తారు. ఇటీవల జరిగిన ఒక పెళ్లికి వారు, ప్రస్తుత కాలంలో మంచి పేరు గడించిన చిత్రకారుడు గిరిధర్ గౌడ్ వేసిన బొమ్మను ఒకదాన్ని అచ్చువేశారు. దాని పేరు సంచార గణపతి. అందులో శివయ్య, పార్వతమ్మ అటు తిరిగి నడుస్తున్నట్లు చిత్రించి ఉంది. పార్వతమ్మ గణపతిని చంకనెత్తుకుని ఉంటుంది. గణపతి మనకేసి చూస్తుంటాడు. ఈ చిత్రాన్ని ముందు చూచినపుడు అందులో నంది, అనే ఎద్దు ఉందన్న సంగతి నాకు చటుక్కున తోచలేదు. కానీ నంది ముఖం అందంగ చిత్రించి ఉంది. శరీరం సజెస్టివ్‌గ మాత్రమే ఉంది. బొమ్మ గొప్పగ ఉన్నదని వేరే చెప్పవలసిన అవసరం లేదు!
మా ఇంట్లో ఒక నంది ఉంది. అది విగ్రహం. మహా ఘనత వహించిన ప్రభుత్వం వారు నాకు బహుమతిగ ఇచ్చిన నంది అది. అంతకు ముందు ఒకరిద్దరు మిత్రుల ఇంట్లో నంది బహుమతులు చూచిన. అవి మకిలిబట్టి ఉండడముగూడ గమనించిన. బంగారు నంది, వెండి నంది, కంచు నంది అని కొందరికి ఇస్తారు. వీటిలో తరువాతి రెండు మకలిపడతాయి. పట్టాలి కూడా! నాకిచ్చిన నంది రాగి రంగులో ఉంది. ఎనే్నళ్లయినా, ఎన్నాళ్లయినా దాని తళతళలో తేడా రాలేదు. నా రాగిచెంబులు, రాగి గ్లాసులు నాలుగు నాళ్లు పట్టించుకోకుంటే ఎందుకూ పనికిరామన్నంత మకిలి పడతాయి. మరి ఈ నందికి ఏమయింది?
నాకు అన్నీ అనుమానాలే! ప్రశ్నలు అడగడం గొప్ప అనుకుని అడిగి తిట్లు తినడం చిన్నప్పటి నుంచి అలవాటే. భారత ప్రభుత్వం ఇచ్చే అవార్డులు భారతశ్రీ, భారత భూషణ అని ఉండాలిగానీ, పద్మశ్రీ, పద్మభూషణ అని ఎందుకు ఉన్నాయని ఒక అనుమానం! అట్లాగే ఆంధ్రప్రదేశ్ అప్పటి ప్రభుత్వం సినిమా, టీవీల వారికి బహుమతిగా నందిని ఎందుకు ఎంచుకున్నట్టు? అనుమానం. సరే, ఇచ్చిన రాగి నంది రాగి కూడా కాదని, రంగు మాయని మరేదో కాకిబంగారం లాంటి రాగి అని అర్థం చేసుకోవాలనుకుంటాను.
కొన్ని విగ్రహాలు దొరుకుతాయి. లోహంతో తయారుచేసినవే అవి. కొత్తగా కొన్నప్పుడే పాతబడి మకిలిబట్టినట్టు ఉంటాయి. విగ్రహాలు పాతవిగా ఉంటే గొప్ప గద మరి! నంది బహుమతులు కూడ అట్ల చేయించి ఇస్తే ఎంత బాగుంటుంది.
ఝలక్: ఒకతను, యాంటీక్‌లు అమ్మే పాత విలువైన వస్తువులు అమ్మే షాపులోకి దూరాడు. నందిలాగన్నమాట! అంటే ఎద్దు వలెనన్నమాట. ఏదో ఒక కుండనో, కూజానో పగలగొట్టాడు కూడా! పక్కనున్నవారు ‘అయ్యో!’ అన్నారు. ‘పోనీలెద్దూ! పాతదే గదా!’ అన్నాడు మన ఎద్దు అవతారం! ‘ఎద్దుమొద్దు స్వరూపాయ దున్నపోతాయ మంగళం!’
**

- కె.బి. గోపాలం