S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
లోకాభిరామం
ఎం.ఎస్.సిలోకి వచ్చిన తరువాత అంటే, వరంగల్ చేరిన తరువాత అన్నమాట. కొత్త మిత్రులు వచ్చారు. కరీంనగర్ నుంచి వచ్చిన ఒకతను తానింకా రైలు ఎక్కలేదని చెపితే నాకు పట్టరానంత ఆశ్చర్యం అయ్యింది. నేను మరి పాలమూరు నుంచి హైదరాబాద్ దాకా బస్సులో వచ్చినా, అక్కడి నుంచి మాత్రం కాజీపేటకు రైల్లో వచ్చినట్టున్నాను. పాలమూరు నుంచి పట్నం అనే హైదరాబాదుకు రైలు లేదని కాదు. ఆ రైలు సమయానికి మనం వెళ్లాలి.
పారజ్ఞుండు అనే మాట చదవడానికి ప్రయత్నిస్తూ నోరు తిరగని మనిషి డజ్ఞు, డంగు, గుండు అంటూ తడబడ్డాడని మా ఇళ్లలో ఒక జోకు సర్క్యులేషన్‌లో ఉండేది. కానీ ఈ మూడు అర్థం లేవనుకున్న మాటలలో చివరి రెండు అర్థం ఉన్న మాటలని చెపితే ఎంతమందికి అర్థమవుతుంది? ఒకప్పుడు సిమెంటు లేదు. ఇంటిని సున్నంతో కట్టుకునేవారు. అంటే ఇసుకలో సిమెంటు బదులు సున్నం కలుపుతారని కాదు. ఇసుకను తగిన పాళ్లతో సున్నంతో కలిపి రుబ్బుకోవాలి.
ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని ఒక మాట ఉండేది. నిజంగానే ఆ మాట ఇప్పుడు ఎవరూ అనడం లేదు. ఎవరి ఇల్లు వాళ్లే నిలబడి కట్టించుకునే కాలం ఒకటి ఉండేది. ఇప్పుడు పల్లెల్లో కూడా గుత్తేదార్లు అనే కాంట్రాక్టర్లు వచ్చి ఇల్లు కట్టి పెడతారు. లేదా వాళ్లే ముందు ఇల్లు కట్టి వాటిని అమ్ముతారు. ఒకప్పుడు ఈ సౌకర్యం లేదు. ఒకప్పుడు అసలు పద్ధతులే వేరు.
కుంభకర్ణుడి పేరులో భకారము అనగా భ అనే అక్షరం ఉంది. విభీషణుడి పేరులో కూడా భ ఉంది. రావణుడి పేరులో లేదు. దానవులలో గొప్పవాడయిన రావణాసురుని పేరు రాభణుడు అయితే బాగుంటుందని సంస్కృతంలో శ్లోకం చెప్పి ఒక కవి చమత్కరించాడు. సందర్భం కాకున్నా నాకు ఇక్కడ కుంభకర్ణుడితో పని. రావణుడు ఏవేవో వరాలు కోరుకున్నాడు. అయినా సరే కథ కావలసిన రకంగానే ముగుస్తుంది. వరాలు అడగవలసిన వంతు కుంభకర్ణుడికి వచ్చింది.
నాన్న నేర్పించిన అలవాట్లలో తాంబూలం కొనసాగడం లేదు. పుస్తకాలు చదవడం ఈ జన్మానికి వదలదు. సినిమాలు చూడడం మానేశాను. కానీ, అప్పుడప్పుడు కొన్ని సినిమాలు గుర్తొస్తాయి. అంటే పాతవి అని చెప్పనవసరం లేదు. వాటిని చూడకుంటే నిద్ర పట్టదు. అట్లా ఈ మధ్య రెండు సినిమాలు మళ్లీ చూచాను. (్ఛదస్తమా? చూశాను అనాలా?) సినిమాలను మళ్లా, మళ్లీ, మరోసారి చూడడం కూడా ఛాదస్తమే.
గుడిసెలు కాలిపోతున్నై అన్నారు బోయి భీమన్నగారు ఒకప్పుడు. ఎండలు మండిపోతున్నై అంటున్నారు అందరూ ఇప్పుడు. ఎండల గురించి ముచ్చటించే ప్రతి సందర్భంలోనూ విసుగు లేకుండా నేను ఒక సంగతి చెపుతూ ఉంటాను. ప్రతిసారి మళ్లీ ఎండలు మండే సమయానికి మన వయస్సు ఒక సంవత్సరం పెరిగి ఉంటుంది. కనుక బహుశా ఎండలను భరించే ఓపిక కొంచెం తగ్గుతుంది. పెద్ద వయస్సు వాళ్లకయితే ఈ కష్టం మరింత ఎక్కువగా ఉంటుంది.
అక్షరాల మీద ఉన్న ప్రేమ నాకెందుకో అంకెల మీద లేదు. ఇందుకు కారణం ఎక్కడన్నా ఉందేమోనని ఎంత వెతికినా, వెదికినా దొరకలేదు. వ్యాసం రాస్తుంటే, అందులో, అందుట్లో ఎక్కడా అంకెలు రాకుండా జాగ్రత్త పడతాను. వచ్చినా వాటిని మరీ వివరంగాగాక సుమారు విలువకు మారుస్తాను. ఒక వస్తువు ధర వంద అంటేనేమి, తొంభయి ఎనిమిది అంటేనేమి అన్నది నా పద్ధతి. కానీ, అందరూ ఈ పద్ధతిని అంగీకరించరు, అంగీకరించకూడదు.
మా బాలమ్మ తెలియక ఆకేశవేణి అన్నది. రేడియోలో ఏకాంబరుం అనే సత్యనారాయణగారు ఒకానొక రాత్రి ఐకాశవాణి, ఆద్రాబాద్ కేంద్రం అన్నారు. ఆ అర్ధరాత్రి ఎవరూ రేడియో వినలేదా? లేక విన్నా పట్టించుకోలేదా? అది వేరే సంగతి. కేశ అంటే వెంట్రుకలకు సంబంధించిన మాట. వేణి అంటే జడ. కానీ వెంట్రుకల వరకు జడ అని అర్థం వచ్చే బాలమ్మ మాటకు అర్థం లేదు. అది తెలియని మనిషి అన్న తెలియని మాట.
ఒకటి: ఆకాశం గగనం శూన్యం, అంటే, తెల్లోడు ఎర్రోడా ఏంటి గొట్టాలెట్టి సూడ్డానికి అంటూ గురజాడ అప్పారావు గగనం శూన్యం కాదని వాదం లేవదీశాడు కన్యాశుల్కంలో. తెల్లవాడు గొట్టాలతో ఏం చూసిందీ, ఇవాళ అందరికీ తెలుసు. కానీ, ఉన్నా లేనట్టుండే సైబర్ ప్రపంచంలో ఒక గొట్టం వెలిసిందండీ! దాని పేరు నీవు గొట్టము! కోపగించుకోకండి. నేను నా మీద నేను తప్ప, పొరపాటున కూడా మరొకరి మీద జోకు వేయను. వేయలేదు. నమ్మండి.
కొంతమంది, తాము చెప్పదలుచుకున్న సంగతిని గురించి గంటసేపు వివరిస్తారు. అయినా చివరకు ఎక్కడి వారు అక్కడే మిగిలిపోతారు. కొందరు అనుభవసారాన్ని పిండి, ఒక్క వాక్యంలో చెప్పి ఊరుకుంటారు. అప్పుడు శ్రోత ఆలోచనలో పడిపోతాడు. ఆలోచనలో పడిన మనిషి, ఆ విషయం గురించి, మరెన్నో విషయాల గురించి ఆలోచిస్తూనే ఉంటాడు. ఎన్నో తెలుసుకుంటాడు. మిగతా వారికి వివరిస్తాడు. మేమంతా ‘క్లుప్తంగా విశదీకరిస్తారు’ అంటూ జోక్ వేసుకునేవాళ్లం.