లోకాభిరామం

ఆనంద గీతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉన్నట్టుండి రవీందర్ ఫోన్ చేసినడు. ‘ఏమిటి సంగతి?’ అంటే అతను ‘పాప ఏడ్చింది’ అనేవాడా లేదా నాకు తెలియదు. గ్రైప్ వాటర్ ప్రకటనల గురించి తెలియని, తెలీని, తెలువని వారికి క్షమాపణలు. ‘ఏం సంగతులు?’ అన్నట్టున్న. ‘ఏం లేదు. ఊరికెనే గుర్తుకు వచ్చినవు’ అన్నడు. ఈ లోకంలో ఊరికెనే మనలను గుర్తుచేసుకుని, పలకరించే వాండ్లు గూడ ఉన్నరు గదా, అని సంతోషమయింది. ఆ సంగతే చెప్పిన. అతను నిజంగనే ఊరికే ఫోన్ చేసినడు. కాల్ ముగించే ముందు, ‘ఫెలిసిటా’ అని ఒక పాట ఉన్నది. ఇంటర్నెట్ గనక ఉంటే విను. దాని గురించి మళ్లెప్పుడన్న మాట్లాడుకుందము అన్నడు.
ఇంటర్నెట్ ఉంటే, అంటే, ధిక్కారమున్ సైతునా? లెవెల్లో కోపం వచ్చి ఉండాలె. ఇంట్లో వైఫై, డెస్క్‌టాప్, లాప్‌టాప్, టాబ్లెట్ పిసీ, స్మార్ట్ఫోన్ అన్ని తెల్లవార్లు పనిచేస్తుంటే ఇదొక ప్రశ్నా! సరే వెంటనే యూట్యూబ్‌లో ఫెలిసిటా అనే పాట వెతికి, ఒకటికి రెండుసార్లు విన్న! ఒకటి రెండు రూపాంతరాలు గూడ వెతికి విన్న. ఆ జంట పాడిన మరో రెండు పాటలు గూడ విన్న. నిజం చెప్పొద్దూ! రవీందర్ ఫోన్ చేసినందుకు సంతోషం అయితే ఈ పాట గురించి చెప్పినందుకు, సంతోషంనర, దాని తాత, మరొకటి అయింది.
సంతోషం, ఆనందం అనే మాటల మధ్యన తేడా ఉందా? ఉందని నాకు అనిపించింది. వీటిలో ఏది ఎక్కువ బలం గలది అంటే చెప్పలేను. తైత్తిరీయం అనే ఉపనిషత్తులో ఆనందం గురించి చెపుతారు. అక్కడే, అన్నిటికన్నా అంచెలో బ్రహ్మానందం (గారు గారు) గురించి చెపుతారు. ఇంతకూ సంగతేమిటంటే, ఫెలిసిటా అన్నది ఇటాలియన్ పాట. అల్ బానో కరిసి, వాళ్లావిడ రొమినా పవర్ కలిసి ఈ పాట పాడతారు. ఫెలిసిటా అంటే ఆ భాషలో సంతోషం/ ఆనందం అని అర్థం. ఈ గాయకులు మరీ కుర్రవాళ్లు కాదు. నిలకడ తెలిసిన వాళ్లు. పాటతోబాటు పెద్ద సంగతులు, వెనుక తంబ (గుంపు) లాంటివేమీ లేవు. లయబద్ధంగా కదులుతుంటారు తప్పితే, పెద్ద డాన్సు కూడా లేదు. ఇంతకూ చెప్పవచ్చినది ఏమంటే, మనం ఏ మూడ్‌లో ఉన్నా సరే, మారిపోయి ఆనందం అనే భావనలోకి వెళ్లడానికి ఈ పాట అనుకోకుండానే సాయం చేస్తుంది.
పాటలో ఫెలిసిటా అనే మాట మళ్లీమళ్లీ వస్తుంది. ఒక ఊపు, ఉత్సాహం, సంతోషం, మరెన్నింటినో పాట మనకు అంటిస్తుంది. ఇంగ్లీష్‌లో వెర్వ్ అని ఒక మాట ఉంది. జీవశక్తి చిందుతుండే తీరు అది. ముక్క అర్థం తెలియకున్నా బాగుంది. ఆ అర్థం కొంతయినా తెలిస్తే బాగుండును అనిపించింది. అంతర్నేత్రం లాంటి ఇంటర్‌నెట్ కారణంగా అర్తం దొరికింది. చదివితే మరింత ఆనందమయింది.
‘ఆనందం, నీతో చేయి కలిపి నడుస్తుంటె ఆనందం, ఆనందం, పెద్ద గంపులోన తప్పిపోతే ఆనందం, ఆనందం, చిన్నపిల్లల్లాగ కలిసి ఉంటె ఆనందం.. అలా సాగుతుంది పాట. అచ్చంగా అవే మాటలు కాకపోవచ్చు గానీ, అవే భావనలు. ఇంటి కప్పు మీద వాన పడితె ఆనందం, దీపాలార్పి శాంతి పరిస్తె ఆనందం. గ్లాసెడు వైను, శాండ్‌విచ్ ఉంటె ఆనందం, ఒక చీటి రాసి, వదిలిపెడితె ఆనందం! గాలిలో మన ప్రేమ పాటు ఎగురుతున్నది ఆనందం, తెలిసిన ఆలోచనలాగ ఎగురుతున్నది. గాలిలో సూర్యుని వెచ్చని కిరణాలూ ఉన్నాయి. ఆనందం తెలిసిన చిరునవ్వులాగ ఉన్నాయి. అదీ పాటలోని మాటలకు సూటిగా కాని అర్థాలు.
నికొలస్ డి కోంటీ అనే యాత్రికుడు తెలుగును ‘ఇటాలియన్ ఆఫ్ ది రుూస్ట్’ అన్నాడు. ఎందుకో తెలియదుగానీ, నా తెలుగు మనసుకు ఈ పాట, పాడుతున్న వారు ‘నా వాళ్లు’ అనిపించారు!
తమిళంలో మహాకవి అనగానే అందరూ ‘సుబ్రహ్మణ్య భారతి’ గురించి చెప్పేస్తారు. బారతీయార్ (్భ అవసరం లేదు మరి!) భారతదేశం గురించి ఒక పాట రాశారు. అందులో తెలుగును సుందరమయిన భాష అంటూ వర్ణించారు. ఆ సంగతి మనలో చాలామందికి తెలీదు. తెల్దు, తెలువదు. తెలియదు. ఆయన పాటలను తమిళులు నేటికీ పాడుకుంటారు. నేను రెండేళ్ల క్రితం బారతీయార్ స్వగ్రామం ఎట్టయాపురం వెళ్లాను. భారతి ఇంటిని అక్కడి వారు నిర్వహిస్తున్న తీరు అద్వితీయం. నాకు గురజాడ గుర్తొస్తున్నారు.
కథ వేరే ఉంది. భారతికి (ఆయన అమ్మాయి కాదని మనవి) భారతీదాసన్ అని ఒక శిష్యుడు. ఈ దాసుని పేరున తమిళ దేశంలో ఒక విశ్వవిద్యాలయం ఉందంటే, వారి గొప్పతనాన్ని మనం అంచనా వేయవచ్చు. బారతీదాసన్ రాసిన ఒక పాట, నా మెదడులో తుమ్మెదలాగ రొద చేస్తూ ఉంటుంది. అసలు కొంతకాలం మా ఇంట్లో ఉన్న నలుగురమూ ఆ పాటను, దేశ్ రాగానీ, గున్ గునాయించడం గుర్తుంది. గీత రచన ఎంతో గొప్పగా ఉంది. ‘మనసు కష్టకాలంలో ఉంది. వీణ చేతబట్టి, దానికి కాస్త ఊరట అందించలేవా?’ అంటూ ప్రియురాలిని కవి దీనంగా అడుగుతాడు. అసలు సుబ్రహ్మణ్య భారతి కూడా తన పాటలతో కణ్నమ్మా అంటూ భార్యనే సంబోధిస్తాడు. కాకి రెక్కలలో నందబాలుని అందాల కురులను చూడగలిగిన కవి ఆయన! ఇక శిష్యుడు గురువుకన్నా నాలుగాకులు ఎక్కువే చదివాడు. ‘తమిళంలో చక్కగా ఒక పాట పాడి మనసుకున్న బాధను తీర్చగూడదా?’ అంటాడు. ‘ప్రాచీన రచయితలు, అందునా తిరువళ్లువర్ చెప్పిన చక్కని మాటలను ఉదహరించి, నా బాధ తీర్చవచ్చు గదా?’ అంటాడు. ఎవరండీ ఈ కవి? ప్రేమ పాటలో కూడా ప్రాచీన రచయితలను, మాతృభాషను మరువలేకుండా ఉన్నాడు. నాకయితే, మొదటిసారి ఈ పాట విన్నప్పుడూ, అర్థం తెలుసుకున్నప్పుడూ కన్నీళ్లు ఆగలేదు! అతిశయోక్తి కొంచెం కూడా లేదని మనవి!
ఇంత చెపితే కథ సగమే అయింది. ఒక గాయకుడు. ఖంగుమనే ఆ గొంతు వింటే, ఒళ్లు ఝల్లుమంటుంది. ఎన్నో పాటలు సేకరించి విన్నాను. సంగీత ప్రపంచంతో పంచుకున్నాను. కొత్త కాసెట్ దొరికింది. (పాత కాసెట్ కొత్తగా దొరికింది!) ‘తున్బమ్ నేర్గయిల్, యాళ్ ఎడుత్తు, ఇన్‌బమ్ శేర్క మాట్లాయో?’ ఎమ్.ఎమ్.దండపాణి దేశికర్ పాడుతున్నాడు. ఒళ్లు తెలియలేదు. ఏమి స్వరం? ఏమి స్వరరచన? భావం తొణికిసలాడుతుండగా ఏమి గానం? ఆయన మధ్యలో పాట ఆపేశాడు. ‘నేను శాస్ర్తియ సంగీతం పాడతాను. ఏ ఆరభిలోనో మెట్టు (స్వంత వరుస) కట్టి శాస్ర్తియంగా పాడి ఉండవచ్చు. రెండేళ్లు తపన పడి చివరకు హిందుస్తానీ రాగం దేశ్‌లో దీన్ని స్వరపరిచాను’ అని వివరించాడు. ‘తమిళ్ పాడతాడు’ మన మనసుకు, ఏదయినా కారణంగా తున్‌బమ్ (చికాకు, దిగులు) కలిగి ఉంటే దండపాణి దేశికర్ పాటతో ఇన్‌బమ్ (ఊరట, ఆనందం) కలుగుతుంది. బల్లగుద్ది చెప్పగలను. యూట్యూబ్‌లో ఈ పాట రకరకాల వర్షన్స్ ఉన్నాయి. ఎం.ఎం.డి పాట వెదికి వినండి. భవదీయుని బ్లాగు లోకాభిరామంలో ఆ పాట ఉంది. కొంచెం వెతికితే దొరుకుతుంది.
దండపాణి దేశికర్ తమిళం సినిమాల్లో కూడా నటించాడు. హత్య కేసులో చిక్కి జెయిలు పాలయినట్లు చదివిన గుర్తు. ఆయన జీవితంలో చికాకు ఉంది. ఆయన గొంతు గొప్ప ప్రత్యేకత గలది. ‘తామరై పూత్త తడాకమది’ (నా ఫోన్‌లో ఈ పాట రింగ్‌టోన్‌గా ఉంది) లేక ‘జగజ్జననీ శుకపాణి కళ్యాణి’ పాటనీ, అతను ఏది పాడినా అది అమృతధార, ఆనందధార!
పాడి ఏడిపించిన వారూ ఉన్నారు. అల్‌బాన్, దేశికర్‌లు ఆనందం పంచారు!

కె.బి. గోపాలం