లోకాభిరామం

ఉన్నాడా ఈ మనిషి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టీవీ వచ్చింది. ‘దూద’ అనే
దూరదర్శన్ ఒకటే ఛానల్. అందులో వచ్చిన సీరియల్స్ కొన్ని బాగుండేవి. కానీ, అన్నీ బాగున్నాయనుకుని చూడడం తప్పలేదు. అక్కడ ‘ముల్లా నస్రుద్దీన్’ అనే పేరుతో ఈ మేధావి మరోసారి ముందుకు వచ్చాడు. అమన్ అల్లానా అనే ఆయన సీరియల్‌ను అందించినట్లు గుర్తు. రఘుబీర్ యాదవ్ అనే కుర్రనటుడు నస్రుద్దీన్‌గా వేశాడు. సీరియల్‌లో జూహ్‌రా సేగాల్ కనిపించినట్టు గుర్తు. కథలు నవ్వించాయి.
మహీధర నళినీ మోహన్‌గారు సైన్సును తెలుగు పాఠకులకు అందించడం కొరకు చాలా కృషి చేశారు. ఆయన పండిత వంశం మనిషి. సంస్కృతం, ఆంధ్రం చదువుకున్నారు. కేవలం సైన్సుతో ఊరుకోలేదు. కావలసినంత బాల సాహిత్యం రాశారు. ఆయన చదువు కొరకు రష్యా వెళ్లి వచ్చారు. అక్కడ ఆయనకు దొరికిన నిధులలో ఒకటి నసీరుద్దీన్ కథలు. అప్పట్లో ఆయన వౌల్వీ నసీరుద్దీన్ కథలు పత్రికల్లో వరుసబెట్టి చదివాము. నవ్వుకుని ఊరుకున్నాము. వాటిలో లోతు అందుకోవాలన్న ప్రయత్నం చేసింది లేదు. కనుక ఆ కథలు, ఆ పాత్ర గురించి అంతగా పట్టించుకోలేదు.
టీవీ వచ్చింది. ‘దూద’ అనే దూరదర్శన్ ఒకటే ఛానల్. అందులో వచ్చిన సీరియల్స్ కొన్ని బాగుండేవి. కానీ, అన్నీ బాగున్నాయనుకుని చూడడం తప్పలేదు. అక్కడ ‘ముల్లా నస్రుద్దీన్’ అనే పేరుతో ఈ మేధావి మరోసారి ముందుకు వచ్చాడు. అమన్ అల్లానా అనే ఆయన సీరియల్‌ను అందించినట్లు గుర్తు. రఘుబీర్ యాదవ్ అనే కుర్రనటుడు నస్రుద్దీన్‌గా వేశాడు. సీరియల్‌లో జూహ్‌రా సేగాల్ కనిపించినట్టు గుర్తు. కథలు నవ్వించాయి. ఆసక్తిని పెంచాయి. వౌల్వీ నసీరుద్దీన్ అసలు పేరు నస్రుద్దీన్ అని అర్థమయింది. ముల్లా, హోజా, అఫెందీ లాంటి గురువు అనే అర్థం వచ్చే మాటలు ఎన్నో పేరుతోబాటు కలిసి కనిపిస్తాయని కూడా తెలిసింది.
ఇంటర్‌నెట్ అందుబాటులోకి వచ్చింది. మా ఇంట్లోకి కూడా వచ్చింది. ఇక రకరకాల సంగతులను గురించి వెతుకుతుండగా ముల్లా నస్రుద్దీన్ కూడా తగిలాడు. నెట్‌లో వేట, పుస్తకాల వేట ముమ్మరంగా సాగింది. ముల్లా కథలు రకరకాలుగా దొరికాయి. వాటిని తీవ్రంగా పరిశీలిస్తుండగా ఒక విషయం అర్థమయింది. మన దేశంలో అందునా తెలుగులో తెనాలి రామకృష్ణుడు, లేదా రామలింగుడు అని ఒక వ్యక్తి గురించి ప్రచారంలో ఉన్నాడు. ఇద్దరూ ఒకరేనా లేదా వేరువేరా అన్నది జవాబు లేని ప్రశ్న. ఇతని పేరున చిత్రమయిన కథలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో ఏవి నిజంగా పాతవి, ఏవి కావు అన్నది మరో ప్రశ్న. సరదాగా ఉండే ప్రతి కథను తెనాలి పేరున చెప్పినట్టు పెద్దలు కూడా అనుమానాలు వెలిబుచ్చారు. సరిగ్గా ముల్లా నస్రుద్దీన్ పేరున గల కథలతో కూడా ఇదే వ్యవహారం జరిగింది. ఇంటర్‌నెట్‌లో వెతికితే, ఇటీవలి కాలపు జకులను కూడా ముల్లా పేరున చెపుతున్నట్లు ప్రచారం కనపడింది. ఇక మరి ‘ఆతెంటిక్’ అనగా అసలయిన కథలను వెదుకుట ఎట్లు? అందుకూ నెట్‌లో కొంత మార్గం దొరికింది. ముల్లా నస్రుద్దీన్ కథలు అని నిజంగా పాత పుస్తకం ఏదీ, నెట్‌లో ఎక్కడా లేదు. ముల్లాకు బహుశః ఇదంతా నచ్చదేమో? ఇవాళ కూడా దూరదర్శన్ సీరియల్ గురించి వెతికి చూడండి. ఒకటి రెండు ఎపిసోడ్‌లు తప్ప సీరియల్ గురించి మరే వివరాలు ఎక్కడా లేవు! అన్నీ ఉన్నాయిష అనే యూ ట్యూబులో కూడా ముల్లా, నమూనాకు మాత్రమే ఉన్నాడు.
ఇది ఇలా ఉండగా ఇద్రీస్ షా అనే పరిశోధకుని రచనలు అక్కడక్కడ దొరికాయి. ఆయన సూఫీ తత్వం, సంబంధించిన విషయాల గురించి విస్తారంగా పరిశోధించాడు. కొంత సమాచారం పుస్తకాల రూపంలో వచ్చింది. షా చెప్పిన అంశాల ఆధారంగా ముల్లా కథలను వడగట్టే ప్రయత్నం చేస్తుండగా, మిత్రులు ఎ.గాంధీ, ఒక ప్రచురణ సంస్థను పెట్టినట్టు చెప్పారు. ముల్లా కథల పుస్తకం ప్రచురిస్తానని మాట ఇచ్చారు. ఇక విజృంభించి పనిలోకి దిగారు. అప్పటికి నా పుస్తకాలు రాలేదని కాదు. కానీ, రచన మాత్రం చేసి ఇవ్వడంతో నా పాత్ర ముగిసేది.
గాంధీగారి అనుమతితో పుస్తకం తయారీలో మరింత లోతు వరకు దిగాను. కథలు అన్నీ ఒకే నిడివి లేవు. కొద్ది పెద్దవి. అంటే రెండు పేజీలు వస్తాయి. కొన్ని ఒక పేజీలో ముగుస్తాయి. మిగతావి అంతకన్నా చిన్నవి. నేను ఈ కథలను అనువాదం చేయలేదు. ఒక రకం మాటల పద్ధతిని వాడుకుని, కథల నిడివిని కూడా దృష్టిలో పెట్టుకుని తిరగరాశాను. నా మొదటి శ్రోతలయిన నా పిల్లలు వాటిని పాస్ చేశారు. బాగున్నాయని కూడా అన్నారు. ఇక పుస్తకం తయారీ మొదలయింది. కథల క్రమానికి ఒక పథకం వేశాను. వరుసగా ఒక రెండు పేజీల కథ, రెండు ఒక పేజీ కథలు, ఆ తరువాత రెండు పేజీలలో పట్టినన్ని (మూడు, నాలుగు) చిన్న కథలుగా వాటిని పేర్చాను. బొమ్మలు కొన్ని నెట్ నుంచి తీస్తే, కొన్నింటిని గాంధీ గీయించారు. మొత్తానికి వ్యవహారం కుదిరింది.
వంట చేసేవారు, నానా తంటాలు పడి, కొత్తదనం కొరకు ప్రయత్నం చేస్తారు. సినిమా తీసేవారు, సృజనతో పనిచేసేవారు ఎవరయినా ఈ రకంగా తంటాలు పడుతూనే ఉంటారు. చివరికి కస్టమర్లు మాత్రం ‘బాగుంది’ అని ఒక్క మాట అని వెళ్లిపోతా రు. నమ్మండి, ఈ పుస్తకం విషయం గురించి నేను మరీ కలలుగన్నాను. మూడు రకాల కథలు, ఒక క్రమంలో పేర్చినట్టు చెప్పాను గదా! పుస్తకం ఎడమ పేజీతో మొదలవుతుంది. మరి అందులో ఏముండాలి? ముల్లా, గాడిద మీద వెనక్కు మళ్లి కూచునేవాడని కథ. ఎందుకని అడిగితే మూడు రకాల జవాబులు ఇచ్చినట్టు కథలున్నాయి. ఆ మూడూ ఒక పేజీలో వస్తాయి. అంటే మొదటి పేజీలోనన్నమాట. ఎంతమంది గమనించిందీ నాకు తెలియదు. పట్టదు కూడా! కానీ ఇక్కడొక పని చేశాను. ముల్లా గాడిద మీద వెనక్కు తిరిగి కూచున్న మూడు వేరువేరు బొమ్మలు సంపాయించాను. మూడు జోకులకు ఒకటొకటి ఏర్పాటు చేశారు. ఇది నాకు తెలుసు. గాంధీగారికి (మా, అనుండాలి. జాతిపిత గురించి కాదు నేనంటున్నది!) గుర్తుందో లేదో తెలియదు. చెప్పినట్టు మాత్రం గుర్తుంది. ఏ పని చేసినా మరీమరీ పట్టించుకోవడం నా లక్షణం. ఇంత చేసినా, ఎంత చేసినా, ఈ పుస్తకంలో అప్పుతచ్చులు (అచ్చుతప్పులు) వచ్చాయి. ఎందుకో తెలియదు. నా పిఎచ్.డి. పుస్తకం మొదలు ఇటీవలి పుస్తకం దాకా, అన్నిట్లోనూ, ఎంత జాగ్రత్త పడినా తప్పులు వచ్చాయి. వాటి గురించి వేరుగా ఒకసారి ఆలోచించి వివరించాలి నేను.
గాంధీ, తమ పీకాక్‌బుక్స్ (క్లాసిక్స్)లో అనువాదాలే వేశారు. వేస్తున్నారు. నా పుస్తకం ఒకటే మరో దారి. అనువాదం అంటే ఒప్పుకోనని భీష్మించాను. మరి నేను అనువాదం పద్ధతిలో రాయలేదు. షేక్స్‌పియర్ కథలను లాంబ్స్ ‘రీటోల్డ్’ అన్నారు. నేను కూడా ‘పునః కథనం’ అని వేయమన్నాను. ఇదంతా జరిగి పనె్నండేండ్లు అయింది. పుస్తకం ఇంకా బజార్లో ఉందా? పట్టించుకోలేదు.
ఇదరిస్ షా పుణ్యమా అని నాకు మరింత మంచి మెటీరియల్ దొరికింది. సూఫీ కథలు తెలుగులో రాశాను కూడా. అదింకా అచ్చులో రాలేదు. త్వరలోనే వస్తుందని ఆశ! రూమీ, కారణంగా నాకు చాలాకాలంగా ‘సూఫీ’ తత్వం మీద గట్టి ఆసక్తి సాగింది. అవకాశం వస్తే, మంచి పుస్తకం రాయాలని కూడా ఉంది. నస్రుద్దీన్ పుస్తకంలో కథలు మాత్రమే ఉన్నాయి. ఆ లోపాన్ని కూడా సరిచేయాలని ఒక కోరిక!

కె.బి. గోపాలం