లోకాభిరామం

సరదాగానూ ఉండవచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎందుకో తెలియదుగానీ,
గత కొంతకాలంగా నేను ప్రపంచ సాహిత్యంలోని కథా సంకలనాలను చాలా సేకరించి చదువుతున్నాను. నాకు అక్కడక్కడ నిజంగా ఆశ్చర్యకరమయిన రచనలు ఎదురవుతున్నాయి. నా మనసులోని భావాలను అవి బలపరుస్తున్నాయి. ఒకప్పుడు హైదరాబాద్‌లో, సారస్వత
పరిషత్‌లో అనుకుంటాను, జరిగిన ఒక సమావేశానికి వెళ్లడం
గుర్తుకు వస్తున్నది.

ఈ మధ్యన ఒక సాహిత్య సమావేశానికి వెళ్లవలసి వచ్చింది. మిత్రుడు వేదగిరి రాంబాబు తన పుట్టిన రోజును ‘కథానికతో ఒక సాయంత్రం’ అనే పేరుతో సమావేశంగా జరుపుకునే పద్ధతి అయిదారేళ్లుగా కొనసాగిస్తున్నాడు. ఆ సందర్భానికి కావలసినన్ని కథలకు సంబంధించిన పుస్తకాలను అచ్చు వేయించి, విడుదల చేయించే పనిని కూడా ఆయన తలకెత్తుకుంటాడు. రెండు సంవత్సరాల క్రితం నా అనువాద కథల సంకలనాన్ని అదే పద్ధతిలో ప్రచురించాడు. ఈ సంవత్సరం అతను మరొక పెద్ద పనిని తలకెత్తుకున్నాడు. 75 మంది కథకుల చేత ప్రత్యేకంగా కథలు రాయించి ఒక సంకలనం వెలువరించాడు. అందులో చిత్రంగా నా కథ కూడా ఉంది.
ఆ సాయంత్రం కథానిక గురించి సదస్సు లాంటిది ఒకటి జరిగింది. పేరున్న కథా రచయిత, విమర్శకులు విహారిగారు దాన్ని నడిపించారు. కథానికకు విషయం ఉండాలా? ఉంటే ఎలాగుండాలి? చర్చించాలని ఆయన ప్రతిపాదించారు. మొదట్లో తామే కొన్ని విషయాలు చెప్పారు కూడా. సభలో చాలామంది కథకులు, పండితులూ ఉన్నారు. కానీ మాట్లాడడానికి ఎవరూ అంత ఉత్సాహం చూపించలేదు. కనీసం నాకు అలాగనిపించింది. విషయం అటువంటిది మరి. నాకు అవకాశం వస్తే మాట్లాడకుండా ఉండడం తప్పు అని ఒక గట్టి అభిప్రాయం ఉంది. కనుక రెండు ముక్కలు చెప్పాను.
వివిధ కారణాలుగా మొదటి నుంచి కథకు ఒక ప్రయోజనం ఉండాలని అనుకునే పద్ధతి సాగుతున్నది. చిన్నప్పుడు కథ చెప్పి చివరికి, ‘ఈ కథ వలన నీతి ఏమనగా..’ అంటూ ఒక ముక్క చెప్పేవాళ్లు. కథానిక నిర్మాణం గురించి, అందులోని అంశాల తీరు గురించి నేను చర్చించదలచుకోలేదు. మూస నుంచి వేరుగా చాలామంది రాస్తున్నారని విహారిగారు ప్రస్తావించారు. నేను ఆ ముక్కను అందుకున్నాను. మూసను పక్కన పెట్టడం మరీ అంత కొత్త పద్ధతి ఏమీ కాదంటూ కొన్ని ఉదాహరణలు కూడా ఎత్తి చూపాను.
ఎందుకో తెలియదుగానీ, గత కొంతకాలంగా నేను ప్రపంచ సాహిత్యంలోని కథా సంకలనాలను చాలా సేకరించి చదువుతున్నాను. నాకు అక్కడక్కడ నిజంగా ఆశ్చర్యకరమయిన రచనలు ఎదురవుతున్నాయి. నా మనసులోని భావాలను అవి బలపరుస్తున్నాయి. ఒకప్పుడు హైదరాబాద్‌లో, సారస్వత పరిషత్‌లో అనుకుంటాను, జరిగిన ఒక సమావేశానికి వెళ్లడం గుర్తుకు వస్తున్నది. అక్కడ ఒక పరిశోధకురాలు తెలుగు కథానికలను గురించి పెద్ద ప్రసంగం చేసింది. మొత్తం ప్రసంగంలోనూ వ్యక్తుల మధ్య పోరాటం, వర్గ పోరాటం గురించిన ఉదాహరణలను మాత్రమే ఆమెగారు ప్రస్తావించినట్టు కనీసం నేను గుర్తించాను. అవకాశం వచ్చినప్పుడు లేచి ఆ మాటే అన్నాను. వక్తకు నా మాటలు నచ్చలేదని అర్థమయింది. బీదల జీవితాలలో కూడా అంతో ఇంతో ఆనందం ఉంటుంది, హాస్యం ఉంటుంది, మరొక రకం మానవ సంబంధాలు ఉంటాయి. వాటిని గురించి కూడా చెప్పవచ్చును అన్నది నేను బలంగా నమ్మే విషయం.
కథానికకు కాలక్షేపం కూడా ప్రయోజనంగా ఉండవచ్చు. ఆ కాలక్షేపం కొంత ఆలోచనకు కారణమయితే అంతకంటే కావలసింది లేదు. అటువంటి కథలు నాకు పాత రోజుల నుండి మొదలు ఇప్పటివరకు కనపడుతూనే ఉన్నాయి. వామపక్ష ఆలోచనా ధోరణి ప్రభావంగానేమో, సరదాగా సాగే కథలు రాస్తే దాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. హాస్య కథలు రాసేవారే లేరు. అందులో కూడా అభ్యుదయ భావాలు తొంగి చూస్తుంటాయని అనుమానం. ఈ సోది పక్కనపెట్టి, సూటిగా ఒక ముక్క చెపుతాను. కాఫ్కా అని ఒక కథకుడు ఉన్నాడు. అతను జెర్మన్ భాషలో రాశాడు. చాలా రాశాడు. చాలా ప్రభావవంతంగా రాశాడు. ‘మామూలుగా నిత్యం జరిగేదే’ అని అర్థం వచ్చే శీర్షికతో ఆయన చేసిన అరపేజీ రచన ఒకటి ఉంది. అది కథ కాదని కనీసం కాఫ్కా అనలేదు. మిగతా కొన్ని తన రచనల విషయంలో అతను ఇది కథ కాదని చెప్పాడు మరి. ఈ ముక్క గురించి చెప్పలేదంటే, దాన్ని కథానికగానే గుర్తించాలి. అవి చాలామందికి అర్థంలేని రచనగా కనిపించవచ్చు. కానీ ఆలోచిస్తే మాత్రం అందులో బోలెడంత లోతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఒకతను మరొకతనితో వీలయినంత త్వరగా వెళ్లి కలిసి మాట్లాడాలని బయలుదేరుతూ ఉంటాడు. ఆ మరొక అతను తానే స్వయంగా ఇతని దగ్గరికి వస్తాడు. ఇతను మాత్రం నేను తొందరలో ఉన్నాను అంటూ పట్టించుకోకుండా వెళ్లిపోతాడు. అక్కడికి వెళితే కలవవలసిన మనిషి మీ ఇంట్లోనేఉన్నాడు అంటారు. ఇతను తిరిగి వస్తాడు. మెట్లమీద జారి పడతాడు. అప్పటిదాకా వేచి ఉండిన అతను మాత్రం అప్పుడే కోపంగా వెళ్లిపోతుంటాడు. ఇతను ఈసారి కూడా మాట్లాడడం కుదరదు. అదీ కథ. నాకు అది చాలా బాగుంది. చదువుకుని, హాయిగా నవ్వుకుని మర్చిపోవడం మొదలు ఈ కథ గురించి కొన్ని రోజులపాటు ఆలోచిస్తూ ఉండిపోవడం వరకు ఇక్కడ అవకాశాలు రకరకాలుగా ఉన్నాయి. ఈ కథ గురించి ప్రయోజనం పేరిట జుట్టు పీక్కుంటే వచ్చేదేమిటి?
అంటన్ చెఖోవ్ అని మరొక మహత్తరమయిన కథకుడు. చాలా కథలు రాశాడు. చాలా రకాల కథలు రాశాడు. వాటన్నిటినీ గురించి వ్యాఖ్యానించాలంటే పుస్తకాలు రాయాలి. అది కూడా జరిగింది. చెఖోవ్ రచనల్లో ఒక అందమయిన కథ నన్ను ఆకర్షించింది. కథ పేరు కూడా అందం అనే ఉంటుంది. ఈ కథ గురించి ఎంత ఆలోచిస్తే, నాకు అంత ఆశ్చర్యంగానూ ఉంటుంది. ఇంతకూ కథ ఏమిటంటే, సులభంగానే చెప్పవచ్చు. ఒక అబ్బాయి ఉంటాడు. బడిలో చదువుకుంటున్న వయస్సు. వాళ్ల తాతగారు గుర్రం బండి మీద ఎక్కడికో ప్రయాణమయితే, తానూ వెంట వెళతాడు. మధ్యలో గుర్రాలకు మేత వేయాలని తాతగారు బండిని ఒక పరిచయస్తుని ఊరికి చేరుకుంటాడు. అక్కడ ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఆమె చాలా అందంగా ఉంటుంది. తాను అందంగా ఉన్నానన్న సంగతి ఆ అమ్మాయికి పట్టదు. అబ్బాయికి ఆ అమ్మాయిని చూడడం తప్ప అక్కడ మరొక పని మిగలదు. అతని తాతగారు కూడా అమ్మాయి బాగుందని ఆమె తండ్రితోనే చెపుతాడు. చివరికి వీళ్ల బండి నడిపే మనిషి కూడా మాట వరసగా అమ్మాయి అందమయినదని అంటాడు. కథలో ఇది ఒక భాగం. కొంతకాలం గడుస్తుంది. మనకు కథ చెపుతున్న ఆ అబ్బాయి కాలేజికి చేరుకుంటాడు. అతను ఒక రైల్‌లో వెళుతుంటాడు. ఒకానొక స్టేషన్‌లో రైల్ ఆగుతుంది. అక్కడ ప్లాట్‌ఫాం మీద ఒక అందమయిన అమ్మాయి కనిపిస్తుంది. నేను ఈ కథ గురించి మీటింగ్‌లో చెప్పినప్పుడు ఇక్కడ ఒక వ్యాఖ్యానం చేశాను.
మూసకు, అనుకోని మలుపులకు, యాదృచ్ఛికాలకు అలవాటుపడిన పాఠకులు వెంటనే కథలోని మొదటి అమ్మాయి, మళ్లీ ఇక్కడ కనిపించిందని ఊహించుకోవడానికి పూర్తి అవకాశాలు ఉన్నాయి. కానీ చెఖోవ్ ఆ దారిలో నడవలేదు. రైలు వెళ్లిపోతుంది. కథ ముగుస్తుంది. ఏమయ్యింది? అని ఎవరన్నా అడిగితే ఈ కథలో ఏమీ కాలేదు. కాదు... కానీ కథను నడిపించిన తీరు చాలా గొప్పగా ఉంటుంది. బండివాని కొరడా అబ్బాయి టోపీకి తగలడం మొదలు వర్ణించిన వివరాలు చదివిస్తాయి. నిజానికి ఈ కథ అరపేజీ మాత్రమే ఉండదు. చాలా పేజీలు సాగుతుంది. విషయం అంటూ ప్రత్యేకంగా ఒకటి లేకుండానే కథను అంత దూరం సాగించి మన చేత చదివించాడంటే రచయిత గొప్పదనాన్ని మనం ఇక్కడ మెచ్చుకోక తప్పదు.
కథానికగానీ, మరొక రచన గానీ, అసలయిన ప్రయోజనం హాయిగా చదివించడం. ఈ ప్రపంచంలో చేసే ప్రతి పనితోనూ ప్రయోజనం ఉండేట్టయితే, అసలు పరిస్థితి ఇట్లాగుండేది కాదు. చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి. అర్థంలేని కొన్ని విషయాలు కూడా ఆకర్షణీయంగా, అర్థవంతంగా సాగుతాయి. వాటితోనూ ఉల్లాసం అనే ప్రయోజనం ఉండి తీరుతుంది. రచనలన్నీ ఇలాగే ఉండాలని నేను అనను గానీ, కొన్ని రచనలు ఇలాగున్నందువల్ల వచ్చే పెద్ద నష్టం ఏమీ లేదని నాకు గట్టి నమ్మకం.
అది పుస్తకంగానీ, సినిమా గానీ, టీవీ సీరియల్‌గానీ హాయిగా కొంతకాలం గడపడానికి సాయం చేస్తుందంటే నాకది అంగీకారమే.
chitram...
అంటన్ చెఖోవ్

కె.బి. గోపాలం