S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

10/31/2016 - 20:46

ప్రియాంక చోప్రా.. బాలీవుడ్‌లో ఈ పేరుకున్న డిమాండ్ తక్కువేం కాదు. హిందీ చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా ఎవరికీ డేట్స్ సర్దలేని పరిస్థితి ఎదుర్కొంటోంది. ఇటు ఇండియాలో, అటు హాలీవుడ్‌లో హవా కొనసాగిస్తోంది. ఆమె హాలీవుడ్‌లో చేస్తున్న క్వాంటికోకు సంబంధించి భారీ రెమ్యునరేషన్ అందుకుంటోందట. అందుకే తాజాగా ముంబయిలో వంద కోట్లతో ఓ ఇల్లు కొన్నదని తెగ చెప్పుకుంటున్నారు.

10/31/2016 - 20:45

అటు నటిగా ‘షో’ చేసి.. తరువాత నిర్మాతగా సక్సెస్ అందుకున్న సూపర్ స్టార్ కుమార్తె, ప్రిన్స్ మహేష్ సోదరి కొత్త అవతారం ఎత్తబోతోందట. చాలాకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న మంజుల -తాజాగా

10/31/2016 - 20:42

దక్షిణాది చిత్రాలతో ప్రారంభిస్తే కెరీర్ బాగుంటుందని, అదృష్టం వరిస్తుందని, ఉత్తరాది భామలకు ఓ సెంటిమెంట్. ఆ ప్రకారంగా సయేషా సెహగల్ తొలిసారిగా అక్కినేని అఖిల్‌తో జతకట్టి ‘అఖిల్’ చిత్రంలో నటించింది. ఈ చిత్రం అనుకున్నంతగా తన కెరీర్‌కు
ఉపయోగపడకపోవడంతో బాలీవుడ్‌కే

10/31/2016 - 20:41

హిట్ పడితే -నీ అంతటివాడు లేడంటారు. ఫట్‌మంటే -తప్పంతా నీదేనంటారు. ఇది సినీ ఇండస్ట్రీ రీతి. ఆర్టిస్టులు మొదలుకుని 24 క్రాఫ్టుల వారికీ ఇది వర్తిస్తుంది. అందుకే ఒకసారో, రెండుసార్లో వచ్చే పాల పొంగు చూసి మురిసిపోతే -నిండా మునిగినట్టే. ఆడియో వేడుకల్లో మ్యూజిక్ డైరెక్టర్‌ని.. సక్సెస్ మీట్‌లలో సినీ డైరెక్టర్‌ని మోసేయడం సహజం.

10/24/2016 - 22:07

బాలకృష్ణ హీరోగా చారిత్రక కథ -గౌతమీపుత్ర శాతకర్ణి శరవేగంగా సిద్ధమవుతోంది. భక్తిరసాన్ని మళ్లీ భుజానికెత్తుకున్న నాగార్జన -హాథీరామ్‌బాబా పాత్రలో ఓం నమో వేంకటేశాయ అంటూ ఆడియన్స్‌ను అలరించేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. ట్రాక్ మార్చుకుని కుటుంబ కథా చిత్రాలతో అలరిస్తున్న వెంకటేష్ -ఒక్కసారిగా స్పోర్ట్స్ ట్రాక్‌లోకి మారాడు. బాక్సింగ్ కోచ్ క్యారెక్టర్‌తో ‘గురు’గా అలరించబోతున్నాడు.

10/17/2016 - 20:44

ఈ సంవత్సరానికి ఇక ‘శుభం’ కార్డు పడినట్టే. క్లైమాక్స్‌లోనూ ఏమీ ఆర్భాటం లేకుండానే - సినీ కథలు వచ్చే సంక్రాంతి సంబరాల వైపు పరుగులు
తీయబోతున్నాయి. భారీ బడ్జెట్ - భారీ తారాగణం.. భారీ కటౌట్ల వ్యవహారాలన్నీ ‘తెర’మరుగై పోయి- కళ్లు కాయలు కాసేలా.. మనసు తెర

10/10/2016 - 22:45

స్టార్ హీరోయే -నిర్మాత అయితే?
ఏముందీ, సినిమా బడ్జెట్ పావువంతు తగ్గుతుంది. ఖర్చుల మీద కంట్రోల్ పెరుగుతుంది. మొత్తంగా
-బయటపడే బడ్జెట్ పరిమితితో
ప్రాజెక్టు పట్టాలెక్కుతుంది. కాలం
కలిసొచ్చి సినిమా హిట్ కొడితే -కోట్లు
మిగుల్చుతుంది. స్టార్ హీరోకి
రెమ్యునరేషన్‌తోపాటు వాటాలు..
భాగస్వామి నిర్మాతకు
-నిలదొక్కుకునే లాభాలు.
టోటల్‌గా పరిశ్రమ సేఫ్.

10/03/2016 - 21:33

దర్శకుడి ప్రతిభ.. నిర్మాతల కష్టం.. నటీనటుల కృషి.. టెక్నీషియన్ల పనితీరు.. ఇరవై నాలుగు విభాగాల సమ్మేళనంతో కథాబలాన్ని ప్రదర్శించాల్సిన వస్తువు -సినిమా. కానీ -‘అంతకుమించి’ అన్నట్టు వ్యవహరిస్తోంది తెలుగు సినిమా. నిజానికి అంత సీనుందా?

,
09/26/2016 - 23:18

కొందరు కథని -కథలా చెప్తారు. కొందరు -బాగా చెప్పేవాళ్లుంటారు. ఇంకొందరు -గొప్పగా చెప్పేవాళ్లుంటారు. మరికొందరు కళ్లకు కట్టినట్టు చెప్తుంటారు. మన తెలుగు సినిమా దర్శకులే -కళ్లు కుట్టుకునేలా.. మరీ అతిగా చెప్తున్నారేమో అనిపిస్తుంది, ముఖ్యంగా యాక్షన్ సినిమాల్లో. ఇప్పుడొచ్చే చిత్రాల్లో -చేజింగ్‌లు, ఫైటింగ్‌లు చూస్తుంటే ‘అతి’ అనిపిస్తుంది. అతిశయోక్తి చూపిస్తున్నారని అనిపిస్తూనే ఉంటుంది.

09/20/2016 - 02:13

1950ల నుంచి 60 యేళ్ల భారతీయ సినీ చరిత్రలో ఏటా అకాడెమీ అవార్డుల కోసం సినిమాలను పంపుతున్నా -నామినేషన్ సాధించిన చిత్రాలు కేవలం మూడంటే మూడే. ఇప్పటి వరకూ 48 చిత్రాలను అకాడెమీ అవార్డుల పోటీకి భారత్ పంపింది. ఇందులో 40 చిత్రాలు హిందీ అయితే, 8 తమిళ చిత్రాలు, మూడు మరాఠి చిత్రాలు, బెంగాలి, మళయాలం నుంచి రెండేసి చిత్రాలు, తెలుగు, గుజరాత్ క్యాటగిరీల్లో ఒక్కో చిత్రం మాత్రమే ఆస్కార్‌కు వెళ్లాయి.

Pages