S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
మెయిన్ ఫీచర్
కాలమెప్పుడూ ఒక తీరుగా ఉండదు. అది -తెలుగు సినిమాలా ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. రోజులన్నీ ఒక్కలాగే గడుస్తున్నట్టు ఉంటాయి. కానీ -ఏ రోజూ ఒక్కలా అనిపించదు. తెలుగు సినిమా కూడా అంతే. సినిమాలన్నీ ఒక్కలాగే ఉంటున్నాయని ప్రేక్షకులు గగ్గోలు పెడుతున్నా -ప్రతి సినిమా వైవిధ్యమేనని నాయినా నాయికలు, దర్శక నిర్మాతలు చెబుతూనే ఉంటారు. ప్రేక్షకుడు వింటూనే ఉన్నాడు.
ఈ ఏడాది సినిమాల విషయంలో కొత్త హంగామా హల్‌చల్ చేస్తోంది.. విడుదలకు ముందే సినిమాను మార్కెట్ చేయడమే కాదు, దానికి ప్రేక్షకుల్లో క్రేజ్ తీసుకురావడాన్ని దర్శక నిర్మాతలు బాగా ఫాలో అవుతున్నారు. ఫస్ట్‌లుక్ నుంచే సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేయడం ఒక వంతైతే, టీజర్ విడుదలైతే చాలు, ఇన్ని లక్షల లైక్స్ వచ్చాయంటూ హంగామా చేయడం మరో వంతు. ఆ తరువాత అసలు ఫలితం అందుతోంది.
దసరా పోటీకి పలువురు హీరోలు రెడీ అవుతున్నారు. లిస్ట్‌లో ముందు వరుసలో ఎన్టీఆర్ ఉన్నాడు. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న ఆ చిత్రం -లవకుశ. బాబీ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్‌రామ్ నిర్మిస్తున్న చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్కే అందరిలో ఆసక్తి రేకెత్తించింది.
తెలుగుపాటను పరవళ్లు తొక్కించిన అద్వితీయ శైలి సినారేది.
తేటతెనుగు మాటలతో అద్భుతమైన భావాలను పలికించడం
అలవోకగా అలవరచుకున్న సినారే కలం నుంచి జాలువారిన వేలాది పాటలు వేటికవే సాటి. సాహితీ ప్రక్రియలో అనన్య సామాన్యమైన ప్రతిభను సంతరించుకున్న
సినారేకు తెలుగు పాట సరికొత్త ప్రతిభావేదిక అయింది. సినీ సాహితీ సామ్రాజ్యంలో ఆరుద్ర, ఆత్రేయ, శ్రీశ్రీల ఏకఛత్రాధిపత్యం కొనసాగుతున్న తరుణంలో
తెలుగు సినీ పరిశ్రమ ఒక శాసనసభ నియోజకవర్గం కాదు!
కానీ, ఆయన అక్కడ ఎమ్మెల్యే.
తెలుగు సినీ పరిశ్రమ ఒక పార్లమెంట్ నియోజకవర్గం కాదు!
కానీ ఆయన అక్కడ ఎంపీ.
సినీజనానికి ఆయన ప్రజా ప్రతినిధి.
మరోసారి కోర్టులో న్యాయమూర్తి. ఆయనే.. దాసరి నారాయణరావు!
ప్రియాంక కెరీర్ రేంజ్ -పిఎస్‌ఎల్‌వి రాకెట్ స్థాయిలో దూసుకెళ్తోంది. ‘బేవాచ్’ అందాలతో హాలీవుడ్‌లో సెగలు పుట్టిస్తోన్న ప్రియాంక పనితనానికి తాజాగా విశిష్టమైన గౌరవమూ దక్కింది. అంతర్జాతీయ స్థాయిలో ఆమె సాధించిన ఘన విజయాన్ని గుర్తిస్తూ దాదా సాహెబ్ ఫాల్కే అకాడెమీ అవార్డుతో ప్రియాంకను సత్కరించనున్నారు.
తెలుగు సినిమా లావైపోతోంది. హిట్టు ఫలితాల మాటెలావున్నా -కట్టలుకట్టలుగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైపోతోంది. హీరో ఎవడైతే ఏంటి? హీరోయిన్ ఎలాగుంటే ఏంటి? సినిమాలో కథ సాదా సీదాగా వున్నా నో ప్రాబ్లెమ్. కథనం పరుగులు తీయకున్నా ఫరవాలేదు. హంగులు ఆకాశమంతా ఎత్తులో ఉన్నాయంటే చాలు.. ఇక ఆ సినిమా ఓకే అయిపోతుంది. ఈ సూత్రాన్ని ఇప్పుడిప్పుడే టాలీవుడ్‌లో హీరోలు ఒంటబట్టించుకుంటున్నారు.
‘స్వర్ణ యుగం’లో మాత్రం టాలెంటుతో సినీరంగాన్ని ప్రభావితం చేసిన హీరోయినే్ల కనిపిస్తారు. మహానటి సావిత్రి నుంచి సౌందర్య వరకూ.. తారలంతా నవరసాలను పోషించి మెప్పించిన వారే. ప్రస్తుతం టాలీవుడ్ హీరోయిన్లు శ్రుతిమించిన శృంగారాన్ని నమ్ముకుని ముందుకు సాగుతున్నారు. అభినయం ఊసెత్తితే.. అదేంటి? అని అడిగే పరిస్థితి కనిపిస్తోంది.
కొద్దిసేపు హాయిగా, ఆనందంగా గడపడానికి వెళ్లొచ్చేది సినిమా. ఇది ఒకప్పటి మాట. కాలం మారింది. కామన్‌మేన్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు తెరొక్కటే అడ్డా అయ్యింది. కాలక్షేపానికి కాసేపు ‘కాకమ్మ కథ’ చూసొద్దామన్న పరిస్థితి వచ్చింది. ఆడియన్స్ వస్తున్నారు, వింటున్నారు, చూస్తున్నారు కనుక -ఏ కథనైనా తెరకెక్కించడానికి దర్శక నిర్మాతలూ ధైర్యం చేస్తున్నారు.