S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్మృతి లయలు

05/04/2019 - 17:08

మారుతున్న ప్రపంచంలో నిత్యం కొత్త పదాలు చేరుతూ ఉంటాయి. నాటి న్యూస్ పేపర్ కార్యాలయంలో ఇలా కొత్త పదాలు ఎగిరి వచ్చి చేరేవి కావు.

04/27/2019 - 19:51

కోడి ఒక కోనలో పిల్లలొక కోనలో అన్నట్లుగా ఎడం, దూరం అయిపోయింది బాగా ఆంధ్రపత్రిక - ఆంధ్రప్రదేశ్‌కి. నేను చేరేటప్పటికి ఆరు పేజీలు ఏడు నయాపైసలకి - పది పేజీలు ఆదివారం నాడు - పదమూడు నయా పైసలకి దొరికే పత్రికని, అందితే తెలుగువాడున్న ప్రతీ గ్రామం, ప్రతీ మూలా కళ్లకద్దుకుని అందుకునే వాళ్లే గానీ - అది అందటమే ప్రధాన సమస్య.

04/20/2019 - 19:12

వి.కె.కృష్ణ మీనన్ మన దేశానికి రక్షణ మంత్రిగానే కాదు - ఇంగ్లండ్, అమెరికాలకు దౌత్యాధికారిగా కూడా వెళ్లాడు. సమితిలో మన దేశ ప్రతినిధిగా కాశ్మీర్ సమస్య మీద ఎనిమిది గంటల సేపు అనర్గళంగా ప్రసంగించి, పాక్ విదేశాంగ మంత్రికి చెమటలు పట్టించినవాడు. ఆయన జవహర్‌లాల్ నెహ్రూ గారికి అత్యంత ప్రీతిపాత్రుడు. చాలా వివాదగ్రస్తుడే కానీ అప్పట్లో నాకు, ఆయనంటే గొప్ప గ్లామర్.

04/13/2019 - 18:51

తంబుచెట్టి వీధి అంత నిడివి గల రోడ్డే అయినా ‘వన్ వే రోడ్డు’ కావడంతో, నేను రోడ్డు క్రాస్ చేసి - ఆం.ప్ర.లోకి ప్రవేశిద్దామని చూస్తున్నప్పటికీ, ఆ కొస దాకా ఎడం వేపు అంతా కండచీమల బారులాగా మోటారు శకటాలు ఓ ‘కునుకు’ తీయడానికి సిద్ధంగా ఉన్నాయి. లాగి వదిలిన బాణం లాగా నేను ఆఫీసులోకి దూసుకుపోతూనే, ఓ కన్ను టైమ్‌కీపర్ గోడ గడియారం మీద వేశాను. పైకి హాలులోకి చేరేసరికే, నా బల్ల నిండా టెలిగ్రాములు పలకరిస్తున్నాయి.

04/06/2019 - 22:54

రూమ్‌లో నాన్నగారు తన బల్ల మీధ అప్పుడది ఆఫీసు బల్ల కాదు గనుక, దాని మీదనే పడుక్కునేవారు. అది ఏడడుగులు పొడవు, నాలుగడుగులు వెడల్పు వుంటుంది. సరిగ్గా కిటికీ అంటే, ఆరు, ‘మడత తలుపులు’న్న కిటికీ అది.

03/30/2019 - 18:59

నేను చేరినప్పుడు ఆంధ్రపత్రిక అణా నుంచి ఏడు నయాపైసలుగా మారింది. కానీ దాని విలువ 1953 నుంచీ - చాలాకాలం పరాయి రాష్ట్రం నుంచి వస్తూ వున్నా - ఆంధ్రాలో అమూల్యం, అపురూపమే అయింది. అయితే, ముంబాయి నుంచి వస్తూ ఆంధ్ర లోకం యావత్తునూ మెస్మరైజ్ చేసిన ఈ పత్రిక యొక్క ‘ఆత్మ’ నూటికి నూరుపాళ్లూ తెలుగువారిదే అవడం మామూలు విషయమే అనుకున్నారు జనం.

03/23/2019 - 18:34

తిలక్ మహాశయుడు కుల మతాతీత సంఘీభావాన్ని, ఆ జాతీయోద్యమ దీప్తిని ప్రజ్వలింపజేసేటందుకు ముంబాయిలో ‘గణపతి బప్పా మోరియా’ ఉత్సవాలను మొదలుపెట్టిన చరిత్ర నేపథ్యంలోనే - కాశీనాథుని నాగేశ్వర్రావు పంతులుగారు 1908, వినాయక చవితినాడు ఆంధ్రసచిత్ర వారపత్రికను - కార్యాలయంలో విఘ్నేశ్వర పూజా సంబరాలతో ప్రారంభించారు.

03/16/2019 - 18:04

1938 తెలుగు ఫత్రికా రంగంలో వినూత్నమైన మార్పులు వచ్చాయి. దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వర్రావు పంతులుగారు అస్తమించడం - రామనాథ గోయెంకా గారి ఆంధ్రప్రభ డైలీ ‘్ఢమ్మ’ని అవతరించడం జరిగాయి. దీంతో శంభు ప్రసాద్ గారి మీద చారిత్రాత్మకమైన గురుతర బాధ్యత - ఒక పర్వతశ్రేణి విరిగి మీద పడ్డట్లు పడ్డది.

03/09/2019 - 20:14

ఓ స్విఛ్ వేస్తే మరో లైటు వెలగడం - ఆ స్విచ్ ఆన్ చేస్తే ఈ దీపం ఆరిపోవడం - ఇది జీవితంలోనే జరుగుతుంది. ‘ఖేసరాసరా’ అన్నది నా ‘మోటో’ (నినాదం) అందరూ టాప్‌లో ‘శ్రీరామరామ’ అని రాస్తే, నువ్వేమిటయ్యా’ - అనేవాళ్లు.

03/02/2019 - 18:51

ఫరిచయాలు వ్యసనాలు కావు. జ్ఞాపకాలు ముండ్ల గులాబీల్లాంటివి; ముండ్లు, తొడిమలు, దళాలు వాడిపోయినా - వాడి’ పరిమళాలు శాశ్వతానుభూతులు! ఆశావాదులు ఎల్లవేళలా ఎదురుచూడటం - బలవంతంగానైనా అలవర్చుకుంటారు. నిరాశావాదులు ‘వర్రీ’ అవడం హాబీగా పెట్టుకుంటారు. లాటరీ టిక్కెట్ కొనడం, ఉద్యోగం కోసం అప్లికేషన్ పంపడం ఒక్కలాంటివే ననిపించింది. ఆ ప్రయత్నం చెయ్యలేదు.

Pages