S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్మృతి లయలు

09/28/2019 - 18:29

ఆంధ్రపత్రిక (మద్రాసు) ఎడిటోరియల్ హాలు ప్రక్కనే ఒక నడవ లాంటి చీకటి గది వుండేది. అందులోనే భారతి పత్రిక ‘చూసే’ సాంబశివరావుగారి కుర్చీ ఉండేది. అక్కడ పాత పత్రికల ‘మూటలు’, కొన్ని బీరువా నిండా పత్రిక యొక్క అక్షర కాణాచి అనదగ్గ ఫైళ్లు.. పాత ఉగాది భారతి సంచికలు గట్రా వుండేవి. వాటికి ఆలనా పాలనా లేదు. ఎవరికి అక్కరలేదు. ‘ఏమిటి?

09/21/2019 - 19:14

ఫందొమ్మిది వందల 63, మే నెలలో ఆంధ్రపత్రిక ‘వీక్లీ’లో పడ్డ తెరమీద- తెరవెనుక శీర్షికకి సావిత్రిని యింటర్వ్యూ చేసినప్పుడు ఆమె మిగతా అందరి తెలుగు టాప్ స్టార్స్‌కన్నా ‘యమబిజీ’గా వున్నది. ఒకసారి ఫోన్ చేస్తే‘బొంబాయి వెళ్ళారండీ!’ అన్నారు. మరొకసారి ప్రయత్నం చేస్తే ‘‘హైదరాబాదులో వున్నాద’’న్నారు. సరే, ఈ స్పెషల్ ఫీచర్ ‘‘ఎక్స్‌క్యూజివ్’’...

09/14/2019 - 18:38

ఇన్ని వేల ఉత్తరాలు- ఇన్ని సంవత్సరాలు పెట్టెలలో గోతాలలో ఎలా దాక్కుని ఇంకా చదివేవిధంగా ఉన్నాయో? చూస్తే గుండె చెరువు ఐపోతోంది. చాలా లేఖలు రాసిన వ్యక్తుల వ్యక్తిత్వాన్ని మనస్త్వత్వాన్ని - అయాచితంగా ప్రతిబింబిస్తాయి- అవి ‘సెల్ఫీలు ఇన్ లెటర్స్’ అనగా అక్షరాలలో. అవసర నైవేద్యాలు- ధధి ప్రయోగాలు కావు చిత్తశుద్ధిగల లెటర్స్.. నాకు వీటి సంఖ్యే ఎక్కువ.

09/07/2019 - 18:25

యవ్వనం ఝరీవేగతుల్యము.. అన్నాడు. బాగానే ఉంది కానీ జీవితం బుద్బుధ ప్రాయం అని కూడా చెప్పాడు విష్ణుశర్మగారు - అంటే నీటిబుడగలో పంచవర్ణ సమ్మేళనం.. కానీ, నా యవ్వనం స్పీడ్ మద్రాస్ రాడానికి ముందే, వైజాగ్ - డాల్ఫిన్స్ నోస్ - దానికో స్పీడ్ బ్రేకర్ అయింది. ఉషారును మద్రాస్‌లో వీక్లీకి నిత్య నైవేద్యం - సదా నూతనం చెయ్యాలని తపన చెందుతున్న దశలో పెద్దరికం చిత్రంగా మీద పడ్డది.

08/31/2019 - 19:00

స్పెషల్ ఇష్యూకి రాత్రి ఫదిన్నర దాకా వర్కర్లు పనిచేస్తూ వుంటే వారితోపాటే నేనూ వుండి పోయేవాన్ని - నాన్న గారికి ముందే చెప్పేవాణ్ణి . ఓ కేరేజీ గినె్నలో సాంబారు సాదాం మరో దానిలో మోర్ సాదమ్ (మజ్జిగఅన్నం) రూములో అట్టేపెట్టమని- మా వాళ్లల్లో-నటులుకూడా వుండేవారు, గోపాల్- అచ్చం నంబియార్ని మరిపిస్తాడు, సారంగపాణి మహా కమెడియన్, ఓ బీడీ దమ్ము కొట్టి వచ్చాడంటే -హాస్యనటుల దుమ్ములేపేసేవాడు.

08/24/2019 - 18:16

కొన్ని ఫొందటానికి కొన్ని పోగొట్టుకోవాలి అంటారు - కానీ తాళం చెవి పారేసుకోవడం అటువంటిది కాదు. కానీ నాకదో చెత్త అలవాటు - మెరీనా బీచ్‌కి వెళ్లాను. ఒంటరిగా వెళ్లడం ప్రాక్టీస్ చెయ్యాలనిపించింది. మహానగరంలో ‘పారిస్ బస్సు’ పట్టుకుంటే చాలు గూటికి చేరుతాను. వస్తానన్న సభాపతి రాలేదు - చాలా రోజులైంది. వైజాగ్ స్కాండల్ పాయింట్ గుర్తుకొచ్చింది. ఏకాంతం కోరింది మనసు. మద్రాస్‌లో డిసెంబర్ నెల చిత్రంగా ఉంటుంది.

08/17/2019 - 18:50

ఆ రోజులు వేరు. రూఫాయికి బోలెడు విలువ. ఆం.స.వా. పత్రిక ఏడాది చందా పదమూడు రూపాయలు. విడి ప్రతి పావలా. రైలు - టపా అయితే - కానీ, విదేశాలకు రేట్లు ఇలా ఉండేవి. ఓడ టపా (సముద్రం మీద స్టీమర్‌లో) బ్రిటన్, జర్మనీ, ఐరోపాలకు, ఆఫ్రికన్ దేశాలకు అయితే 114 రూపాయలు.

08/10/2019 - 17:29

పోతనగారన్నట్లు ‘హాలికుడయననేమి? కౌద్దాలికుడయిననేమి?’ అని నేను ‘వర్కో’హాలికుడనయినాను. కంబైన్డ్ ఫ్యామిలీలో కొత్త కోడలు పాత్ర నాది.. అనేవాణ్ణి నవ్వుతూ. ఆంధ్రపత్రిక వీక్లీ వద్దన్నవాణ్ణి దాన్ని వదిలి నా సొంత ఊరు బెజవాడకి డైలీకి బదిలీ అయిపోయినప్పుడు దానిని వదల్లేక వలవలా విలపించాను. తిరిగి 73లో అదే ‘వీక్లీ’ వచ్చిన నన్ను చుట్టుకుంటే కుమిలి కుమిలి ఏడ్చి డైలీ కోసం మొద్దుబారిపోయాను.

08/03/2019 - 18:35

ఇంటర్నెట్ రావఢానికి చాలాకాలం ముందు ఒక్క సినిమాయే- మూడు అక్షరాల తారకమంత్రం. ఊరు ఊరా నా పేరేనోయ్ చిన్నవాడా.. గోడ గోడా బొమ్మేనోయ్!.. నేను సిన్మా స్టారునోయ్ చిన్నవాడా! 63 ఫిబ్రవరిలో తెరమీద - తెర వెనుక శీర్షిక మొదలుపెట్టాము. దీనికి ముందు చాలా స్పీడ్ వర్క్ (సన్నాహక పని) చేశాము.

07/27/2019 - 18:33

అరవై రెంఢులో వారపత్రికకి మారడానికి ముందు దినపత్రిక ఉదయం షిఫ్టులో వున్నప్పుడు వడపళనిలోని విక్రమ్ స్టూడియోకి ‘పెళ్లి తాంబూలం’ సినిమా ప్రీవ్యూకి బయలుదేరాను. ‘సాయంకాలం మూడు గంటలకే వేసేస్తాం’ జనవరి నెల కదా? లేట్‌నైట్ ఇండ్లకు పోడం కష్టం’ అన్నారు. బేబీ టాక్సీలు దొరకవు. దొరికినా, ఆఫీసు - ఆటోకి మాత్రమే ‘పే’ చేస్తుంది. విజయా లాడ్జి నుంచి బ్రహ్మాండం నరసింహారావుకి ఫోన్ చేశాను. ‘చిత్ర’ పత్రిక బాస్ అతను.

Pages