S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్మృతి లయలు

01/19/2019 - 18:44

అరవైల్లో నేను మద్రాసులో అడుగుపెట్టాను. జార్జిటౌన్‌లో తంబుచెట్టి వీధిలో - నాన్నగారి బస ఆఫీసూ రెండూ వున్న ఆంధ్రా ఇన్‌స్యూరెన్స్ బిల్డింగ్‌లో, నెంబర్ 337 - దానికి కొంచెం ఐమూలగా, ఎదురుగా వున్న ఆంధ్రపత్రిక బిల్డింగు - ఆరు, ఏడు నెంబర్లు రెండూ కలిపిన భవనం - ఆనక నెంబరు పనె్నండు. ఆనందవాణి కాళిదాసుగారి కార్యాలయం, ప్రెస్సూ - ఆఫీసూ రెండూ అవే నాకు తెల్సు.

01/12/2019 - 18:37

మునగఛెట్టు పూల గుత్తుల ముసిముసి నవ్వులు నవ్వుతుంది అన్నది చూశాను - కాని దాని మీద కథ రాయడానికి ప్రేరణ మాత్రం వో చిన్ని సంఘటన - జరిగింది. అప్పటికే ఆంధ్రపత్రిక రాధాకృష్ణ గారితో పరిచయం గాఢం కాసాగింది. పత్రికకి కథ పంపాలి అన్న కోరిక మొలకెత్తింది. మా పేట హిందువుల సందులో మునగచెట్టు జ్ఞాపకం వచ్చింది.

01/05/2019 - 19:33

మా ఇంట్లో; మేం 1963లో వింఛిపేట నుంచి సూర్యారావుపేటకి మారిపోయేదాకా, పనమ్మాయి నైజాం నుంచి ఏ నాడో వచ్చిన బుచ్చమ్మే. మరాఠీ స్టయిల్లో కచ్చబోసి, మోకాళ్ల దాకా మాత్రం వచ్చే గళ్ల చీరలు కట్టుకునేది. మోచేతుల దాకా వున్న జాకెట్లు వేసుకునేది. భాష కానీ - యిష్టానిష్టాలు గానీ ఇంత పిసరు మార్చుకోలేదు. ఆమె కూతురు మా చెల్లి ఈడుదే - యశోద. మాకు ఒక రకంగా బుచ్చమ్మ ‘కేర్‌టేకర్’ అన్న మాట.

12/29/2018 - 17:31

ఆంధ్రప్రభ బెజవాడ గాంధీనగర్ నుం చి ప్రచురింపబడటంతో ఊళ్లో ఒక సంచలనం. గాంధీనగరం అది వరకూ కేవలం సినిమా పంపిణీ కేంద్రమే గానీ, ఆ తర్వాత ఎక్స్‌ప్రెస్, ప్రభ వెలువడుతూ స్పెషల్ ఏరియా అయింది (1960). నవయుగ ఫిలిమ్స్ మేనేజర్ కాట్రగడ్డ నరసయ్య - అయిడియాల పుట్ట.

12/22/2018 - 18:48

మా చిన్నప్పుడు స్కూల్లో మొట్టమొదటగా ప్రార్థనగా పాడే పాట - ‘నమో హిందు మాతా! మాతా నమో జగన్మాతా’ - ఓ చరణం ఉంది- ‘గోలకొండ నీ రత్నకోశమలు - కోహినీరు నీ జెడలో పువ్వట.. ఆహాహా నీ భాగ్యమె!’ అంటూ కోరస్‌గా పాడించేవారు.

12/15/2018 - 17:33

మొట్టమొదటి అఖిల భారత తెలుగు రచయితల మహాసభలు 1960 మే నెలలో హైదరాబాద్ - పోతుకూచి సాంబశివరావుగారు, ఆయనగారి యువ టీము - గొప్ప సమన్వయంగల ఏర్పాట్లు చేశారు. దానికి అప్పటి ముఖ్యమంత్రి శ్రీ దామోదరం సంజీవయ్య గారు ఆహ్వాన సంఘ అధ్యక్షులు. మహాసభలకి రాష్ట్రంలో నుంచే కాదు, ఎక్కడెక్కడి నుంచో - పాత కొత్త రచయితలు మహదానందంగా తరలి వచ్చారు.

12/08/2018 - 18:33

1960లోనే ఒకనాడు పిటిఐ టిక్కర్ (టెలి ప్రింటర్) దగ్గర బొమ్మారెడ్డిగారు టెలిగ్రాముల తోరణాన్ని చేతబట్టి బల్ల మీద పెట్టి - ఇత్తడి బద్దతో ఫర్ ఫర్ నరుకుతూ వుండగా చూస్తూ వున్నా. అంతలో రామో నన్ను - తన చిన్ని రూములో నుంచి బయటకొచ్చి ‘ఇలారా’ అని సంకేతించారు. వెళ్లాను. (ముళ్లపూడి) రమణగారొచ్చారు. అదే నేను రమణని చూడటం. ‘ఈ కుర్రవాడు తెలుసుటోయ్? వీరాజీ.. ఒక అప్‌కమింగ్ రైటర్’ అని పరిచయం చేశారు. ‘ఆయ్.

12/01/2018 - 22:16

మార్చి 1960లో తొలి మలుపు అగ్రిమెంట్ విశాలాంధ్ర ప్రచురణకర్తలు పక్కాగా లీగల్‌గా తయారుచేశారు. మా అగ్రిమెంటు టైపు చేసిన టైపిస్ట్ ఎవరో తెలుసా? అటు తరువాత నవోదయా రామమోహనరావుగా పుస్తక ప్రపంచంలో ఒక చక్రం తిప్పిన మహర్జాతకుడు. అప్పుడు విశాలాంధ్ర సంస్థ జనరల్ మేనేజర్. విజయవాడకి రెండుసార్లు మేయర్ అయినట్టి వెంకటేశ్వర్లు (టివి) గారు. ఆపాటికే మహీధర రామమోహన్‌రావుగారు తొలి మలుపుకి ముందు మాటలు రాసేశారు.

11/24/2018 - 18:40

కొన్ని తమాషాలు హమేషా స్మృతి పథాన - మరపురాని మనోజ్ఞమైన సన్నివేశాలై నిలుస్తాయ్! నేను రాతి మేడ అనే చిన్న రొమాంటిక్ నవల రాయడం అట్లా జరిగింది. 1959-60 అంతా నేను కథలు - నవలలు నిర్విరామంగా రాస్తూనే వున్నాను. ఇరవై కథలు దాకా ప్రధాన పత్రికల్లోనే ప్రచురణ అయ్యేయి. తొలిమలుపు - రాయడం ఒక జీవిత కాలపు తపస్సు అయితే - రాతిమేడ రాయడం - ఒక యాదృచ్ఛికమైన మనోజ్ఞ సన్నివేశం.

11/17/2018 - 19:20

ప్రజాశక్తి నగర్ - బెజవాడ మొగల్రాజపురం గుహల ప్రాంగణంలో విస్తరిస్తున్న ‘మేధావుల’ పేట మా ఇంచిపేట నుంచి - బెజవాడ రైల్వేస్టేషన్ బ్రిజ్ (దీనిని నేను వైతరిణి అనేవాణ్ణి) దాటి కొత్తగా పెరుగుతున్న కస్తూర్బా పేట మీదుగా ప్రజాశక్తి నగర్‌కి లెఫ్ట్ రైట్ కొట్టుకుంటూ ప్రతీ శనివారం సాయంకాలం క్రమం తప్పకుండా రెండున్నర మైళ్లు పోయేవాళ్లం తమ్ముడు నేనూ...

Pages